Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 10 Mar 2023 20:56 IST

1. కవితకు ఈడీ నోటీసు.. భయపడే ప్రసక్తే లేదు: సీఎం కేసీఆర్‌

మద్యం కుంభకోణం వ్యవహారంలో (Delhi Liqour scam) ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) ఇచ్చిన నోటీసులపై సీఎం కేసీఆర్‌ స్పందించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన  భారత రాష్ట్ర సమితి విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భాజపా ఉద్దేశపూర్వకంగా తమ పార్టీ నేతలను వేధిస్తోందన్న ఆయన... మంత్రులు మల్లారెడ్డి, గంగుల కమలాకర్‌, ఎంపీ రవిచంద్రను ఇబ్బంది పెట్టారని, ఇప్పుడు  ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చారని వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. హైదరాబాద్‌ కేంద్రంగానే లిక్కర్‌ స్కామ్‌.. రిమాండ్‌ రిపోర్టులో ఈడీ

మనీశ్‌ సిసోదియాను ఇవాళ కోర్టులో హాజరు పరిచిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు ఆయనతో పాటు రిమాండ్‌ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. 58 పేజీల రిమాండ్‌ రిపోర్టులో ఇప్పటి వరకు వెలుగులోకి రాని రాజకీయ, ఆర్థిక, నేరపూరిత వ్యవహారాలను ఈడీ బయటపెట్టింది. లిక్కర్‌ స్కామ్‌ హైదరాబాద్‌ కేంద్రంగానే జరిగిందని ఈడీ పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. సీబీఐ విచారణ వెనుక రాజకీయ కుట్రలు: ఎంపీ అవినాష్‌రెడ్డి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య (Viveka Murder case) కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి (Avinash reddy) సీబీఐ విచారణ మూడోసారి ముగిసింది. దాదాపు 4 గంటలకు పైగా ఆయన్ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. విచారణ అనంతరం అవినాష్‌ మీడియాతో మాట్లాడారు. మళ్లీ పిలిచినప్పుడు విచారణకు రావాలని సీబీఐ అధికారులు చెప్పారన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. భాజపాకే నా సంపూర్ణ మద్దతు.. క్లారిటీ ఇచ్చేసిన సుమలత

అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో  కర్ణాటక (Karnataka) రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.   భాజపాలో చేరికపై వచ్చిన ఊహాగానాలపై సినీనటి, మాండ్య ఎంపీ సుమలత అంబరీశ్‌(Sumalatha Ambareesh) క్లారిటీ ఇచ్చారు. మరో రెండు రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ మైసూరు-బెంగళూరు మధ్య నిర్మించిన 10 లైన్ల ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించేందుకు వస్తున్న తరుణంలో ఆమె కీలక నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ముగిసిన రెండో రోజు ఆట.. ఇక భారత బ్యాటర్లపైనే భారం!

బోర్డర్ - గావస్కర్ (Border - Gavaskar Trophy)ట్రోఫీ నాలుగో టెస్టు మ్యాచ్‌ రెండో రోజు ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 480 పరుగులకు ఆలౌటైంది. ఉస్మాన్‌ ఖవాజా (180), కామెరూన్ గ్రీన్ (114) సెంచరీలు సాధించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమ్‌ఇండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మేనేజర్లు ఇంటికి.. వాళ్లు ఎంపిక చేసిన వారు ఆ స్థానంలోకి.. అట్లుంటది మరి మస్క్‌తోని!

ట్విటర్‌ (Twitter) సీఈవోగా ఎలాన్‌ మస్క్‌(Elon MUsk) తీసుకుంటున్న నిర్ణయాలు సంస్థ ఉద్యోగులతోపాటు, మార్కెట్‌ వర్గాలను సైతం షాక్‌కు గురిచేస్తున్నాయి. ఉద్యోగుల తొలగింపు నుంచి ట్విటర్ సబ్‌స్క్రిప్షన్‌ వరకు ప్రతిదీ సంచలనమే. కంపెనీపై ఆర్థికపరమైన భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు మస్క్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మార్చి చివరి నాటికి ఇన్‌ఫ్లుయెంజా కేసులు తగ్గుముఖం.. కేంద్రం అంచనా

కొవిడ్‌ మహమ్మారి నుంచి కోలుకుంటున్న వేళ.. దేశంలో ఇన్‌ఫ్లుయెంజా (Influenza) వైరస్‌ వ్యాప్తి కలవరపెడుతోంది. ఇన్‌ఫ్లుయెంజా ఉపరకమైన H3N2 వైరస్‌ కారణంగా మరణాలు కూడా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. సీజనల్‌ ఇన్‌ఫ్లుయెంజా కేసుల (H3N2 Influenza Virus Cases)పై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్న కేంద్రం.. మార్చి చివరి నాటికి ఈ కేసులు తగ్గుముఖం పట్టే అవకాశముందని అంచనా వేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మద్యం కుంభకోణంలో సిసోదియాకు ఏడు రోజుల ఈడీ కస్టడీ

మద్యం కుంభకోణం (Delhi excise scam case)లో దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా (Manish Sisodia)ది ప్రత్యక్ష పాత్రే అని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) శుక్రవారం కోర్టుకు తెలిపింది. ఈ కేసులో ప్రస్తుతం సిసోదియా జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. ఆ బెయిల్‌ పిటిషన్‌పై నేడు దిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఈడీ తన వాదనలు వినిపించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Video: చైన్ స్నాచర్‌కు చుక్కలు చూపించిన బాలిక

9. అసలైన యుద్ధానికి సిద్ధంగా ఉండండి.. సైన్యానికి కిమ్ ఆదేశాలు

ఉత్తర కొరియా(North Korea) అధ్యక్షుడు కిమ్ జోంగ్‌ ఉన్‌(Kim Jong Un) నుంచి వచ్చే ప్రతిమాటా వార్త అవుతుంది. అలాగే ఆయన మాటలు, చేతలపై దక్షిణ కొరియా, అమెరికా వంటి దేశాలు ఓ కన్నేసి ఉంచుతాయి. ఇక ఇటీవల కిమ్ రాజ్యంలో యుద్ధం పదం ఎక్కువగా వినిపిస్తోంది. అసలైన యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ తాజాగా ఆయన తన సైన్యాన్ని ఆదేశించారు. తన కుమార్తెతో కలిసి సైనిక పరమైన డ్రిల్స్ పర్యవేక్షించిన సమయంలో ఈ వ్యాఖ్య చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఇక్కడ రోహిత్ శర్మ నేర్చుకొనేందుకు అవకాశాలు పుష్కలం: రవిశాస్త్రి

బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar Trophy) తొలి మూడు టెస్టులు కేవలం మూడు రోజుల్లోనే ముగిశాయి. అయితే నాలుగో టెస్టు జరుగుతున్న అహ్మదాబాద్‌ పిచ్‌ మాత్రం బ్యాటర్లకు అనుకూలంగా ఉంది. ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా (180)తోపాటు కామెరూన్ గ్రీన్ (114) సెంచరీలు సాధించారు. ఈ క్రమంలో ఆసీస్‌ వికెట్ల కోసం భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని