Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 10 Jun 2023 21:11 IST

1. ఏపీ నేతలకు మాటలెక్కువ.. చేతలు తక్కువ: హరీశ్‌రావు

ఆంధ్రప్రదేశ్‌ పాలకుల తీరుపై మంత్రి హరీశ్‌రావు మరోసారి విమర్శలు గుప్పించారు. పాలకుల తీరు వల్లే ఏపీ రాష్ట్రం వెల్లకిలా పడిందన్నారు. అక్కడి నాయకులకు మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ అని ఎద్దేవా చేశారు. సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి ఏంటో చూపిస్తాం: జేపీ నడ్డా

ప్రధాని మోదీ ఎప్పుడూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయరని భాజపా జాతీయ అధ్యక్షుడు  జేపీ నడ్డా అన్నారు. ఓటు బ్యాంకు పాలిటిక్స్‌ను బాధ్యతాయుత పాలిటిక్స్‌ వైపు మళ్లించారని తెలిపారు. దేశమంతా అభివృద్ధి జరగాలనే విధానం వైపు మోదీ మొగ్గు చూపారని పేర్కొన్నారు. శ్రీకాళహస్తిలో భాజపా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ప్రాంతీయ పార్టీల వల్ల రాష్ట్రానికి నష్టమే: కిరణ్‌కుమార్‌రెడ్డి

ప్రజా జీవితంలో ఉండాలా? వద్దా?’ అని ఇన్ని రోజులు ఆలోచించానని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, ఇటీవల భాజపాలో చేరిన నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. జాతీయ పార్టీలో ఉంటేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని భావించినట్లు తెలిపారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శ్రీకాళహస్తి పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Group-1 ప్రిలిమ్స్ రాసే వారికి TSPSC సూచనలు

తెలంగాణలో 503 గ్రూప్‌-1 సర్వీసు ఉద్యోగాల భర్తీకి ఆదివారం ఉదయం 10.30 నుంచి ఒంటి గంట వరకు టీఎస్‌పీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనుంది. దీని కోసం ఇప్పటికే 994 కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. పరీక్ష ప్రారంభ సమయానికి 15 నిమిషాల ముందు గేట్లు మూసివేస్తామని టీఎస్‌పీఎస్సీ ఓ ప్రకటనలో పేర్కొంది. పరీక్ష కేంద్రంలోకి వాచీలు, హ్యాండ్‌ బ్యాగ్‌లు, పర్సులు అనుమతించబోరు. అభ్యర్థులు చెప్పులు మాత్రమే వేసుకోవాలి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఎప్పటికైనా పోలవరం పూర్తి చేసేది చంద్రబాబే: తెదేపా నేతలు

పోలవరం ప్రాంతంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మైనింగ్ రహస్యాలు బయటపడతాయనే తెలుగుదేశం పార్టీ నేతలను ప్రాజెక్టు సందర్శనలకు అనుమతి ఇవ్వడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ప్రాజెక్టులోని లోపాలను బాహ్య ప్రపంచానికి తెలుస్తాయనే ఉద్దేశంతో తెదేపా నాయకుల పర్యటనలపై ఆంక్షలు విధిస్తున్నారని మండిపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఏడు గంటలపాటు సాగిన అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఎనిమిదో నిందితుడైన కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి సీబీఐ విచారణ ఇవాళ ముగిసింది. దాదాపు 7 గంటలపాటు అధికారులు ఆయన్ను సుదీర్ఘంగా విచారించారు. అవినాష్‌ రెడ్డిని ఇటీవల అరెస్టు చేసిన సీబీఐ.. రూ.5 లక్షల చొప్పున రెండు పూచీకత్తులు తీసుకొని వెంటనే విడుదల చేసిన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. సీఎం కుర్చీ సంతోషాన్నిచ్చే చోటు కాదు..: సిద్ధరామయ్య

ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించడంతో కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. శనివారం ఆయన తన సొంత నియోజకవర్గం వరుణలో పర్యటించారు. అక్కడ ఏర్పాటుచేసిన కృతజ్ఞత సభలో పాల్గొని మాట్లాడారు. ఈ ఎన్నికల్లో అవినీతి, నిర్వహణలోపం, అభివృద్ధిలేమి, సమాజాన్ని విచ్ఛిన్నం చేసే దుష్ట రాజకీయాలను ఓడించి ప్రజలు చారిత్రక నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పెట్రో ధరలను ఎప్పుడు తగ్గిస్తామంటే..

పెట్రోల్‌, డీజిల్‌ ధరల (Petrol diesel prices) తగ్గింపు విషయంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురీ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు (Crude oil prices) స్థిరంగా కొనసాగితే ఆయిల్‌ మార్కెటింగ్‌ సంస్థలు ఈ విషయంపై దృష్టి పెట్టే అవకాశం ఉందని చెప్పారు. దిల్లీలో భాజపా ప్రధాన కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. బాహానగా బజార్‌ రైల్వేస్టేషన్‌కు ‘సీబీఐ’ సీల్‌.. అప్పటివరకు రైళ్లు ఆగవు!

ఒడిశా రైలు ప్రమాదం (Odisha Train Tragedy) తీరని విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో 288 మంది మృతి చెందారు. అయితే, ఇదంతా ఉద్దేశపూర్వకమేనా? దీని వెనుక కుట్ర కోణం ఏమైనా ఉందా? వెలికితీసేందుకు సీబీఐ (CBI) ఇప్పటికే రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే దుర్ఘటన చోటుచేసుకున్న బాహానగా బజార్‌ (Bahanaga Bazar) రైల్వేస్టేషన్‌ను తాజాగా సీల్‌ చేసింది. అంతకుముందే స్టేషన్‌ లాగ్‌ బుక్‌, రిలే ప్యానెల్‌, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. జర్నలిస్టును ‘బెదిరించిన’ స్మృతి ఇరానీ.. వీడియో షేర్‌ చేసిన కాంగ్రెస్‌

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) ఓ విలేకరి (Journalist)పై ఆమె మండిపడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అయ్యింది. దీన్ని తమ ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసిన కాంగ్రెస్‌ (Congress).. కేంద్రమంత్రిపై విమర్శలు గుప్పించింది. మీడియాపై స్మృతి ఇరానీ బెదిరింపులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టింది. స్మృతి ఇరానీ ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని తన సొంత నియోజకవర్గమైన అమేఠీ (Amethi)లో పర్యటిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని