Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 11 Mar 2023 21:01 IST

1. ముగిసిన ఈడీ విచారణ.. 8గంటల పాటు కవితను ప్రశ్నించిన అధికారులు

దిల్లీ మద్యం కుంభకోణం కేసు (Delhi liquor scam case)లో భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ఈడీ విచారణ ముగిసింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ రాత్రి 8 గంటల వరకు కొనసాగింది. దాదాపు 8గంటలకు పైగా  ఆమెను ఈడీ (ED) అధికారులు ప్రశ్నించారు.  విచారణ మధ్యలో సాయంత్రం 4గంటల నుంచి 5 గంటల వరకు భోజన విరామ సమయం ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అర్ధ రూపాయికి ఓటు అమ్ముకుంటే.. దేహీ అనాల్సి వస్తుంది: పవన్‌

బీసీలు రాజ్యాధికారం అర్థించటం కాదు.. సాధించుకోవాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీసీ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని బీసీ కులాలు కలిస్తే రాజ్యాధికారం ఇంకెవరికీ దక్కదన్నారు. ఇన్నేళ్లుగా బీసీల సమైక్యత ఎందుకు సాధ్యం కాలేదో అర్థం కావట్లేదన్నారు. గతంలో 93 ఉన్న బీసీ కులాలు ఇప్పుడు 140కి ఎందుకు పెరిగాయని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. నోటీసులు వస్తే.. మహిళా కమిషన్‌ ముందు హాజరవుతా: బండి సంజయ్‌

భారాస ఎమ్మెల్సీ కవితపై (MLC Kavitha) భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi sanjay) అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. బండి సంజయ్‌ వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్‌ (womens commission) కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళల గౌరవాన్ని కించపరిచేలా సంజయ్‌ వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. రాజస్థాన్‌లో పుల్వామా వీరపత్నుల నిరసన హింసాత్మకం

పుల్వామా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల సతీమణులు చేపట్టిన ఆందోళన రాజస్థాన్‌లో కొత్త రాజకీయ వివాదానికి తెరతీసింది. ఈ నిరసనకు సంఘీభావం తెలిపేందుకు భాజపా కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడంతో పరిస్థితులు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడికి దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. గిల్‌ సెంచరీ.. కోహ్లీ హాఫ్‌ సెంచరీ.. మూడో రోజు ఆట పూర్తి

భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా మూడు వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (59; 128 బంతుల్లో 5 ఫోర్లు బ్యాటింగ్‌), రవీంద్ర జడేజా (16; 54 బంతుల్లో 1 సిక్స్‌ బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఇంకా 191 పరుగుల వెనుకంజలో ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. నా తండ్రి నన్ను లైంగికంగా వేధించాడు.. DCW చీఫ్‌ ఆరోపణలు

బాల్యంలో తన తండ్రి తనను లైంగికంగా వేధించాడం(Sexual Assault)టూ దిల్లీ మహిళా కమిషన్‌(DCW) ఛైర్‌పర్సన్‌ స్వాతి మాలివాల్‌(Swati Maliwal) తాజాగా ఆరోపణలు చేశారు. డీసీడబ్ల్యూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అనంతరం ఆమె ఈ మేరకు మాట్లాడారు. ‘నా 4వ తరగతి వరకు మేం ఆయనతో కలిసి ఉన్నాం. నన్ను ఆయన అకారణంగా కొట్టేవారు’ అని స్వాతి మాలివాల్‌ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మళ్లీ కలిశాం.. మళ్లీ సీబీఐ, ఈడీ వచ్చాయి..!: నీతీశ్‌ విమర్శలు

ఉద్యోగాలకు భూముల కుంభకోణం(Land for jobs Case)కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్ కుటుంబసభ్యుల్ని కేంద్రదర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ వరుసపెట్టి ప్రశ్నిస్తున్నాయి. వారికి చెందిన పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి. లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్‌(Tejashwi Yadav)కు సమన్లు ఇచ్చాయి. తాజాగా దీనిపై బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌(Nitish Kumar) స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. యుద్ధాన్ని ముగించేందుకు.. ఉక్రెయిన్‌పై పుతిన్‌ అణుదాడి!

ఏడాదికాలంలో ఉక్రెయిన్‌(Ukraine)పై రష్యా(Russia) జరుపుతోన్న సైనిక చర్యలో  విజయం ఎవరిపక్షమో స్పష్టత లేదు. తాను ప్రారంభించిన దాడిని గెలుపుతోనే ముగించాలని రష్యా భావిస్తుండగా.. అమెరికా(America), దాని మిత్రదేశాల సాయంతో ఉక్రెయిన్‌ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఎడతెగక జరుగుతోన్న ఈ దాడిని అణ్వస్త్రాల ప్రయోగంతో ముగించాలని రష్యా భావిస్తుందట. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. బిలావల్‌ నోట మళ్లీ అవాకులు, చెవాకులు

ఐరాస(UN) వేదికలపై పాకిస్థాన్‌(Pakistan) ప్రతిసారి కశ్మీర్ అంశాన్ని(Kashmir Issue) లేవనెత్తుతుంది. సమావేశంలో చర్చిస్తున్న అంశం, ఎజెండాతో సంబంధం లేకుండా దీనిపై అనవసర వ్యాఖ్యలు చేస్తుంటుంది. ఇదే విషయమై పాక్‌ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ(Bilawal Bhutto) తాజాగా భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. ఐరాసలో ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడల్లా భారత్‌ అడ్డుపడుతోందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ఇక, వారందరికీ ఇంటి నుంచే ఓటు.. ఈసీ కీలక నిర్ణయం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లకు సిద్ధమవుతున్న ఎన్నికల సంఘం.. శనివారం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఇక, 80 ఏళ్లు పైబడిన వారు, అంగవైకల్యంతో బాధపడేవారు ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. త్వరలో జరగబోయే కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో తొలిసారిగా ఈ ఓట్‌ ఫ్రమ్‌ హోమ్‌ సదుపాయాన్ని కల్పించబోతున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని