Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 15 Mar 2023 21:19 IST

1. కంటోన్మెంట్‌ బోర్డు నిర్ణయం.. 35వేల మంది ఓటు హక్కును కాలరాస్తోంది: మంత్రి కేటీఆర్‌

సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో తొలగించిన 35వేల మంది ఓటర్లను తిరిగి జాబితాలో చేర్చాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి, భారాస కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌ (Minister KTR) కోరారు. దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుతూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు ఆయన లేఖ రాశారు. కంటోన్మెంట్ పరిధిలో రక్షణశాఖ ఆధ్వర్యంలో ఉన్న స్థలంలో అక్రమంగా నివసిస్తున్నారన్న అర్థం లేని కారణంతో, అర్హత కలిగిన వారిని కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగించారని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. పర్యాటకులకు శుభవార్త.. పూరీ - కాశీ - అయోధ్య సందర్శనకు ప్రత్యేక రైలు

ఈ వేసవిలో హాలిడే ప్లాన్‌ చేస్తున్నారా? దేశంలోనే అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన పూరీ, కాశీ, అయోధ్య వంటి ఆధ్యాత్మిక ప్రాంతాలను దర్శించుకోవాలని ఉందా? తెలుగు రాష్ట్రాల యాత్రికుల కోసమే ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది. ఇందుకోసం భారత్‌ గౌరవ్‌ టూరిస్ట్‌ ట్రైన్‌ పేరిట ఓ ప్రత్యేక రైలును అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా మార్చి 18న, ఏప్రిల్‌ 18న ఈ రైళ్లు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి బయల్దేరనున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. చెన్నూరు కోసం రూ.1600 కోట్లతో ఎత్తిపోతల పథకం: మంత్రి హరీశ్‌రావు

మంచిర్యాల జిల్లా జైపూర్‌, భీమారం, చెన్నూర్‌ మండలాల్లో రూ.210 కోట్ల విలువైన 30 అభివృద్ధి పనులకు మంత్రి హరీశ్‌రావు (Minister Harish rao) శంకుస్థాపన చేశారు. చెన్నూరులో ఆర్‌వోబీ, 100 పడకల ఆస్పత్రి, గ్రంథాలయాలు, వీధిలైట్ల ఏర్పాటును ఆయన ప్రారంభించారు. లక్ష ఎకరాలకు నీరందించే ఎత్తిపోతల పథకాన్ని చెన్నూరులో నిర్మించనున్నట్లు మంత్రి ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం పెట్టుకుంటే అభ్యంతరం లేదు: సుజనాచౌదరి

రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను కేంద్ర మాజీమంత్రి, రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సుజనాచౌదరి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలతో పాటు నైసర్గిక అంశాలపై చర్చించినట్టు చెప్పారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గవర్నర్‌కు వివరించినట్టు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఇది కోహ్లీ అత్యుత్తమ ఇన్నింగ్స్‌ కాదు.. విరాట్‌ 28వ సెంచరీపై మార్క్‌వా

టెస్టుల్లో మరోసారి మూడంకెల స్కోరు చేరుకోవడానికి విరాట్‌ కోహ్లీ(Virat Kohli)కి దాదాపు మూడున్నరేళ్ల సమయం పట్టింది. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ(Border Gavaskar Trophy)లోని చివరి టెస్టు(IND vs AUS)తొలి ఇన్నింగ్స్‌లో 186 పరుగులు చేసి.. తన సెంచరీ కరవును తీర్చుకోవడమే కాకుండా.. విమర్శకులకు ఈ ఇన్నింగ్స్‌తోనే సమాధానమిచ్చాడు విరాట్‌. ఈ శతకంపై పలువురి క్రికెటర్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. శక్తికాంత దాస్‌కు ‘గవర్నర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ పురస్కారం

రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (RBI) గవర్నర్‌ శక్తికాంత దాస్‌కు (Shaktikanta Das) అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ ఇంటర్నేషనల్‌ రీసెర్చి జర్నల్‌ సెంట్రల్‌ బ్యాంకింగ్‌ (Central Banking) ఆయనకు 2023 సంవత్సరానికి గానూ ‘గవర్నర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ పురస్కారాన్ని ప్రకటించింది. కష్టకాలంలో ఆర్‌బీఐ గవర్నర్‌గా ఆయన అందించిన సేవలకు గానూ ఈ పురస్కారం ప్రకటించినట్లు సెంట్రల్‌ బ్యాంకింగ్‌ తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రుణం కోసం పాకులాడుతున్న దేశం.. అయినా లగ్జరీ కార్లు వదులుకోని మంత్రులు..!

పొరుగుదేశం పాకిస్థాన్(Pakistan) ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయింది. ఈ క్రమంలో ఇప్పటికే ప్రకటించిన, చేపడుతోన్న పొదుపు చర్యలు ఫలించడం లేదు. విలాసవంతమైన కార్లు, వాహనాలు వినియోగించొద్దని, ఇప్పటికే ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని ప్రభుత్వం సూచనలు చేసింది. అయితే వాటిని వదులుకోవడానికి పలువురు మంత్రులు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, ప్రభుత్వ ప్రతినిధులు ఇష్టపడడం లేదని తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అడ్డుపడటం వల్లే అలా జరిగింది.. లేదు అదే కూలిపోయింది..

ఏడాదికి పైగా ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న దండయాత్రలో తాజాగా జరిగిన ఉదంతంతో అమెరికా-రష్యాల మధ్య ఉద్రిక్తతలు శిఖరస్థాయికి చేరాయి. నల్లసముద్రంపై  అంతర్జాతీయ జలాల్లో గస్తీ నిర్వహిస్తున్న ఎంక్యూ రీపర్‌ 9 డ్రోన్‌ను రష్యాకు చెందిన రెండు సుఖోయ్‌ యుద్ధ విమానాలు అడ్డుపడటంతో డ్రోన్‌ సముద్ర జలాల్లో కూలిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రెస్ట్‌ ఇన్‌ పీస్.. అంటూ పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డుపై రషీద్ లతీఫ్ సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) తీసుకున్న ఓ నిర్ణయంపై ఆ జట్టు మాజీ ఆటగాడు రషీద్ లతీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు (PAK vs AFG) రెగ్యులర్ సారథి బాబర్ అజామ్‌తోపాటు ఫాస్ట్‌ బౌలర్ షహీన్ అఫ్రిదికి అవసరం లేకపోయినా విశ్రాంతినిచ్చి పీసీబీ జట్టును ప్రకటించింది. ఇదే నిర్ణయం.. అఫ్గాన్‌కు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన రషీద్‌ లతీఫ్‌కు ఆగ్రహం తెప్పించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఆస్పత్రిలో 24గంటలు లేకున్నా.. ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ చేసుకోవచ్చా..!

ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రుల్లో చేరే వారికి ఆరోగ్య బీమా ఉన్నప్పటికీ ఒక్కోసారి అవి తిరస్కరణకు గురవుతుంటాయి. రోగి ఆస్పత్రిలో చేరకపోవడం, ఒకరోజు మొత్తం ఆస్పత్రిలో ఉండలేదనే కారణాలతో బీమా కంపెనీలు మెడికల్‌ క్లెయిమ్‌లను తిరస్కరిస్తుంటాయి. అయితే, చికిత్స కోసం వెళ్లిన రోగులు ఆస్పత్రిలో చేరి 24 గంటలు పూర్తికాకున్నా, ఆస్పత్రిలో చేరకున్నా.. బీమా క్లెయిమ్‌ చేసుకోవచ్చని గుజరాత్‌లోని ఓ వినియోగదారుల ఫోరమ్‌ తీర్పు వెలువరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని