Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..
1. కోట్లాది కొలువులు.. ఖాతాల్లో రూ.లక్షల కొద్దీ డబ్బు.. ఏవీ?: హరీశ్‌రావు
ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు. భాజపా సభలో నడ్డా డైలాగుల కోసం పాకులాడిన్నట్లుందని విమర్శించారు. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘భారాసకు వీఆర్‌ఎస్ అంటే మాకు ఓటమి లేదని నడ్డా అంగీకరించినట్లే. వీఆర్‌ఎస్ అంటే స్వచ్ఛంద విరమణ. మేం స్వచ్ఛంద విరమణ చేస్తే తప్పా మాకు ఓటమి లేదని నడ్డానే అన్నారు’’ అని హరీశ్‌రావు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. మైక్రోసాఫ్ట్ వచ్చాకే హైదరాబాద్‌లో ఐటీ విప్లవం ఊపందుకుంది: చంద్రబాబు
ఐఎస్‌బీ హైదరాబాద్ ద్విదశాబ్ది వేడుకల ముగింపు కార్యక్రమానికి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... హైదరాబాద్‌లో ఐఎస్‌బీ ఏర్పాటు చేసేందుకు ఆయన చేసిన కృషిని వివరించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధి కోసం ఎలా కష్టపడ్డారో వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. ఈడీ నోటీసు ఆశ్చర్యంగా.. విచిత్రంగా ఉంది: ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మనీలాండరింగ్ చట్టం కింద నోటీసులు జారీ చేసిన అధికారులు ఈనెల 19న ఉదయం 10గంటలకు విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. ఈడీ నోటీసులపై ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి స్పందించారు. ఎమ్మెల్యేలకు ఎర వేసిన భాజపా బండారం బయటపెట్టినందుకే కక్షపూరితంగా ఈడీ నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. మాచర్లలో రణరంగం.. రాళ్లు, గాజు సీసాలతో తెదేపా కార్యకర్తలపై దాడి
తెదేపా శ్రేణులపై వైకాపా కార్యకర్తలు కర్రలు, రాళ్లు, గాజు సీసాలతో దాడులు చేసిన ఘటన పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. ‘ఇదేం ఖర్మ.. రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా తెదేపా కార్యకర్తలు స్థానిక రింగురోడ్డు నుంచి ప్రదర్శన చేపట్టారు. ఈ క్రమంలో మున్సిపల్ కార్యాలయం వద్ద వైకాపా శ్రేణులు కూడా భారీగా మోహరించారు. చిన్న కాన్వెంట్ వద్దకు తెదేపా ప్రదర్శన చేరుకోగానే వైకాపా శ్రేణులు ఒక్కసారిగా రాళ్లు, సీసాలు విసిరారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. చైనా యుద్ధానికి సిద్ధమవుతుంటే ప్రభుత్వం నిద్రపోతోంది: రాహుల్ గాంధీ
పొరుగు దేశం చైనా మనపై యుద్ధానికి సిద్ధమవుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిద్రపోతోందని ఆరోపించారు. అసలు ముప్పేలేనట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇదే విషయాన్ని తాను గడిచిన రెండేళ్లుగా చెబుతున్నానని తెలిపారు. ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్‌లో తవాంగ్ సెక్టార్ వద్ద ఇరు దేశాల సైనికుల ఘర్షణల నేపథ్యంలో రాహుల్ గాంధీ దీనిపై స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. కెప్టెన్ వచ్చేస్తున్నాడు.. మరి తుది జట్టులో ఎవర్ని తప్పిస్తారో?
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బొటన వేలికి గాయమైన సంగతి తెలిసిందే. చికిత్స కోసం అతడు భారత్‌కు రావడంతో బంగ్లాతో మూడో వన్డే, తొలి టెస్టుకు దూరమయ్యాడు. డిసెంబరు 22 నుంచి బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు రోహిత్ శర్మ అందుబాటులో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. భుట్టో... ఖబడ్దార్! దేశవ్యాప్త నిరసనలకు భాజపా పిలుపు
ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)పై పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావుల్ భుట్టో(Bilawal Bhutto) వ్యక్తిగతంగా చేసిన అనుచిత వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ(BJP) తీవ్రస్థాయిలో స్పందించింది. పాక్ మంత్రి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించిన భాజపా నేతలు.. దిల్లీలోని పాకిస్థాన్ రాయభార కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. పాక్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు భుట్టో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. అక్కడి మాంద్యం మనకు అవకాశం: సీతారామన్
పాశ్చాత్య దేశాలలో నెలకొన్న మాంద్యం భయాలను భారత్ అవకాశాలుగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు భారత్‌కు వచ్చేలా వ్యూహాలను రచించాలని దేశీయ పరిశ్రమ వర్గాలను కోరారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కావాల్సిన నిబంధనల్ని సైతం ప్రభుత్వం మారుస్తోందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. జైల్లో రక్షణ లేదు.. బెయిల్ ఇవ్వండి: కోర్టుకెళ్లిన ఆఫ్తాబ్
సంచలనం సృష్టించిన కాల్ సెంటర్ ఉద్యోగి శ్రద్ధా వాకర్ (Shraddha Walkar) హత్య కేసులో నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలా (Aaftab Poonawala) బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాడు. జైల్లో తనకు భద్రత లేదని, బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై దిల్లీ సాకేత్ కోర్టు శనివారం (డిసెంబరు 17న) విచారణ చేపట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. ప్రపంచ వ్యాప్తంగా ‘కలరా’ కలవరం.. నిండుకున్న టీకా నిల్వలు..!
ప్రపంచ వ్యాప్తంగా కలరా (Cholera) వ్యాప్తి విజృంభణ కొనసాగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. ఇదే సమయంలో ఈ వ్యాధి నిరోధానికి అవసరమైన టీకా (Vaccine) నిల్వలు ఖాళీ అవడం/కనీస స్థాయికి పడిపోయినట్లు ఆందోళన వ్యక్తం చేసింది. సుమారు 30 దేశాల్లో కలరా వ్యాప్తి అధికంగా ఉందన్న డబ్ల్యూహెచ్‌ఓ.. అంతర్జాతీయంగా మరణాల రేటు పెరుగుతోందని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Rahul Gandhi: బంగ్లా ఖాళీ చేస్తే.. రాహుల్ ఎక్కడికి వెళ్తారు..? రిప్లయ్ ఇచ్చిన ఖర్గే
-
World News
Ukraine war: ఉక్రెయిన్‌కు చేరిన లెపర్డ్ ట్యాంకులు..!
-
Education News
APPSC: ఏపీలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా.. కారణం ఇదే..!
-
Politics News
Palaniswami: ‘అమ్మ’ పార్టీకి అధినాయకుడిగా.. పళని ఏకగ్రీవంగా ఎన్నిక
-
Sports News
IPL 2023: లఖ్‌నవూకు బలం ఆ ఇద్దరే.. కానీ ఫ్లే ఆఫ్స్‌కు మాత్రం వెళ్లదు: ఆరోన్ ఫించ్
-
Crime News
Andhra news: పులివెందులలో కాల్పుల కలకలం