Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 20 Mar 2023 21:27 IST

1. భారాస శ్రేణులకు సీఎం కేసీఆర్‌ ‘ఆత్మీయ సందేశం’

ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమే బాగుంటే సరిపోదని.. దేశం మొత్తం బాగుండాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. ‘అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ నినాదంతో దేశం కోసం ముందుకు పోదామని పార్టీ శ్రేణులకు కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు భారత్‌ రాష్ట్ర సమితి (భారాస) నేతలకు సీఎం కేసీఆర్‌ ఆత్మీయ సందేశాన్ని ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఉప్పల్‌ స్టేడియంలో ఏడు మ్యాచ్‌లు.. భద్రతా ఏర్పాట్లపై సీపీ సమీక్ష

ఈ నెల 31 నుంచి ఐపీఎల్ 16 సీజన్‌ ప్రారంభం కానుంది. ఉప్పల్ స్టేడియంలో ఏడు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సీజన్‌లో ఇక్కడ మొదటి మ్యాచ్‌ ఏప్రిల్ 2న సన్‌ రైజర్స్ హైదరాబాద్‌-రాజస్థాన్ రాయల్స్‌ మధ్య జరగనుంది. దీంతో మ్యాచ్‌లకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ జట్టు ప్రతినిధులు, బీసీసీఐ, హెచ్‌సీఏ ప్రతినిధులతో రాచకొండ సీపీ డి.ఎస్. చౌహాన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. యువతకు 2.5లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు.. ₹3వేలు నిరుద్యోగ భృతి: రాహుల్‌ హామీ

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు(Karnataka assembly elections) సమీపిస్తుండటంతో అక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే ప్రధాన పార్టీల అగ్ర నేతలు రంగంలోకి దిగి గెలుపే లక్ష్యంగా కృషిచేస్తున్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) మాండ్యలో ఎక్స్‌ప్రెస్‌ హైవేను ప్రారంభించి ప్రసంగించగా.. తాజాగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) బెళగావిలో నిర్వహించిన ‘యువక్రాంతి సమావేశం‘లో పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆమ్‌ఆద్మీ దూకుడు.. రాహుల్‌ గాంధీ వరాలు..!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు (Karnataka Assembly) సమయం దగ్గరపడుతోన్న వేళ.. రాజకీయ పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఇందులో భాగంగా మరో ముందడుగు వేసిన ఆమ్‌ఆద్మీ పార్టీ (AAP).. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. 80 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాల్లో (224)నూ ఆప్‌ పోటీ చేస్తుందని స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. 15 నెలల కనిష్ఠానికి క్రూడ్‌.. అయినా మనకు ధరలెందుకు తగ్గడం లేదు?

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Crude oil) ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. బ్యాంకింగ్‌ రంగంలో వరుస కుదుపులు, ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు కారణంగా మాంద్యం పరిస్థితులు నెలకొంటాయన్న భయాలు ఇందుకు కారణమయ్యాయి. మాంద్యం పరిస్థితులు తలెత్తితే చమురుకు డిమాండ్‌ తగ్గుతుంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు 15 నెలల కనిష్ఠానికి చేరాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ATMలలో కనిపించని ₹2వేల నోటు.. నిర్మలా సీతారామన్‌ సమాధానమిదే..

ఒకప్పటితో పోలిస్తే ఏటీఎం కేంద్రాల్లో రూ.2వేల నోట్లు (2000 Note) మునుపటిలా కనిపించడం లేదు. దీంతో ఉద్దేశపూర్వకంగానే ఆ నోట్లను తగ్గిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏటీఎం (ATM) కేంద్రాల్లో రూ.2వేల నోటు లభ్యతపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టతనిచ్చారు. ఏటీఎంలలో 2వేల నోట్లను ఉంచాలని గానీ, ఉంచొద్దని గానీ తాము బ్యాంకులకు సూచించలేదని లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కీలక మ్యాచ్‌లో సత్తాచాటిన యూపీ.. గుజరాత్‌పై 3 వికెట్ల తేడాతో గెలుపు

డబ్ల్యూపీఎల్‌ (WPL)లో కీలక మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌ సత్తా చాటింది. గుజరాత్ జెయింట్స్‌పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగుల భారీ స్కోరు సాధించింది. గ్రేస్ హ్యారిస్‌ (72) మెరుపులకు తోడు తాహిలా మెక్‌గ్రాత్ (57),  అర్ధ శతకంతో  రాణించడంతో ఈ లక్ష్యాన్ని యూపీ19.5 ఓవర్లలో 7వికెట్లను నష్టపోయి ఛేదించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఆగని ఖలిస్థానీ అనుకూలవాదుల దాడులు.. నిన్న లండన్‌.. నేడు శాన్‌ఫ్రాన్సిస్కో

ఖలిస్థాన్‌ (Khalistan) అనుకూలవాదులను పంజాబ్‌ పోలీసులు అరెస్టు చేయడంతోపాటు, ‘వారిస్‌ పంజాబ్‌ దే’ నేత అమృత్‌పాల్‌ సింగ్ కోసం గాలిస్తున్న నేపథ్యంలో విదేశాల్లోని ఖలిస్థానీ సానుభూతిపరులు దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఆదివారం లండన్‌లోని భారత్‌ హైకమిషన్‌ భవనంపై ఉన్న జెండాను కిందికి దింపి అగౌరవ పరిచిన ఆందోళనకారులు... తాజాగా అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఇండియన్‌ కాన్సులేట్‌పై దాడికి దిగారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. విమానంలో ఇద్దరు పైలట్లు ఒకే రకమైన ఆహారం ఎందుకు తీసుకోరు?

కొద్దిరోజుల క్రితం హోలీ పండుగ రోజు  ఓ ప్రైవేటు విమానయాన సంస్థకు చెందిన విమానం (Flight)లో ఇద్దరు పైలట్లు (Pilots) కాక్‌పిట్‌ (Cockpit)లో ఆహారం (Food) తీసుకోవడం వివాదాస్పదమైంది. దీంతో ఆ ఘటనపై విచారణ చేపట్టిన విమానయాన సంస్థ యాజమాన్యం సదరు పైలట్లను రోజువారీ విధుల నుంచి తొలగించింది. ఈ నేపథ్యంలో కమర్షియల్‌ విమాన పైలట్ల ఆహార నియమావళి గురించి నెట్టింట్లో తీవ్ర చర్చ ప్రారంభమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. సహజీవన బంధాలను రిజిస్టర్‌ చేయాలంటూ పిటిషన్‌.. సుప్రీం ఆగ్రహం

సహజీవనాల (live-in relationships)పై దాఖలైన ఓ పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆ సంబంధాలను రిజిస్టర్‌ చేసేలా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు రూపొందించాలంటూ చేసిన అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. అది తెలివి తక్కువ ఆలోచన అని పిటిషన్‌దారుపై మండిపడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు