Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 22 Jan 2023 21:00 IST

1. భాజపా వస్తే అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేస్తాం: కేంద్ర మంత్రి హామీ

తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తే అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేస్తామని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్‌ ముండా హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ ఆదివాసీలను అందలం ఎక్కిస్తే.. కేసీఆర్‌ నేతృత్వంలోని భారాస సర్కారు వారి హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేశ్లాపూర్‌లోని నాగోబా జాతరకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి ఆయన హాజరయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ‘పది’తో ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో 1,675 ఉద్యోగాలు.. 28నుంచి అప్లై చేసుకోండి!

కేంద్ర హోం శాఖ పరిధిలోని నిఘా విభాగం ఇంటెలిజెన్స్‌ బ్యూరో( Intelligence Bureau)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. మొత్తం 1,675 ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ ప్రకటన వెలువడింది. సెక్యూరిటీ అసిస్టెంట్‌/ఎగ్జిక్యూటివ్‌ (Security Assistant/Executive) పోస్టులు 1,525 కాగా.. మల్టీ టాస్కింగ్‌(Multi-Tasking Staff/) సిబ్బంది పోస్టులు 150 ఉన్నాయి. పదో తరగతి లేదా తత్సమాన కోర్సులు చేసిన ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేకొనేందుకు అర్హులు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. హైదరాబాద్‌లో దారుణం.. నడిరోడ్డుపై వెంటాడి, వేటాడి నరికేశారు

ముగ్గురు వ్యక్తులు కత్తులు, వేట కొడవళ్లతో స్వైరవిహారం చేశారు. ఓ వ్యక్తిని నడిరోడ్డుపై వెంటాడి, వేటాడి మరీ నరికి చంపారు. ఆదివారం సాయంత్రం అందరూ చూస్తుండగానే హైదరాబాద్‌లోని పురానాపూల్‌ సమీపంలో జియాగూడ బైపాస్‌ రోడ్డుపై ఈ దారుణ ఘటన జరిగింది. జియాగూడ బైపాస్‌ రోడ్డుపై ఓ వ్యక్తి పరుగెత్తుకుంటూ వెళ్తున్నాడు.. అతన్ని మరో ముగ్గురు తరుముకుంటూ వచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అతడు అద్భుతమైన బౌలర్‌.. మేం కూడా మిస్‌ అవుతున్నాం: షమీ

గత టీ20 ప్రపంచకప్‌ నుంచి కీలక బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే టీమ్‌ఇండియా మ్యాచ్‌లను ఆడేస్తోంది. స్వదేశంలో వరుసగా మూడో సిరీస్‌ను సొంతం చేసుకొంది. శ్రీలంకైనా కాస్త పోరాటం ఇచ్చింది కానీ, న్యూజిలాండ్‌ మాత్రం వన్డే సిరీస్‌లో తేలిపోయిందనే చెప్పాలి. మొదటి వన్డే చివరి వరకు విజయం కోసం ప్రయత్నించిన కివీస్‌.. రెండో వన్డేలో మాత్రం చేతులెత్తేసింది. సిరాజ్, షమీతో కూడిన పేస్‌ దళం దెబ్బకు కుప్పకూలింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. నిర్మలా సీతారామన్‌ జట్టులో కీలక సభ్యులు వీరే

సార్వత్రిక ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్‌ (Budget 2023)ఇది. 2024 ఎన్నికలకు ముందు మరో బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉన్నా అది కేవలం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ మాత్రమే. అంటే కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు చేయాల్సిన ఖర్చులకు పార్లమెంట్‌ ఆమోదం తీసుకోవడమే. కాబట్టి ఓ విధంగా మోదీ సర్కారుకు ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌ (Budget 2023) కానుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఈసారి బడ్జెట్‌లో బ్యాంకులకు ‘మూలధనం’ లేనట్లేనా?

రానున్న కేంద్ర బడ్జెట్‌ (Budget 2023)లో బ్యాంకులకు ప్రత్యేకంగా మూలధన కేటాయింపులు ఉండకపోవచ్చునని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బ్యాంకుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడి లాభాల బాటలో ఉండడమే అందుకు కారణమని పేర్కొన్నాయి. బ్యాంకుల ‘క్యాపిటల్‌ అడిక్వసీ రేషియో’ నియంత్రణాపరమైన అవసరాల కంటే 14- 20% అధికంగా ఉందని వెల్లడించాయి. 2023- 24 బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ప్రాంతీయ భాషల్లో తీర్పు ప్రతులు.. చీఫ్‌ జస్టిస్‌ ఆలోచన ప్రశంసనీయం: మోదీ

ప్రాంతీయ భాషల్లోనూ సుప్రీం కోర్టు తీర్పులను అందుబాటులో ఉంచాలన్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఆలోచనను ప్రధాని మోదీ ప్రశంసించారు. సుప్రీం కోర్టు తీర్పులను ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఇటీవల ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు. ఇందుకోసం సాంకేతికతను వాడుకోవాలని ఆయన సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మత మార్పిడికి ‘నో’.. పాకిస్థాన్‌లో హిందూ మహిళపై ఘోరం

పాకిస్థాన్‌లో హిందువులపై దారుణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సింధ్‌ ప్రావిన్స్‌లో ఓ వివాహిత మహిళపై కొందరు వ్యక్తులు కిరాతకానికి ఒడిగట్టారు. మతం మారాలని బలవంతం చేయగా అందుకు ఆమె నిరాకరించడంతో కిడ్నాప్‌ చేసి అత్యాచారానికి ఒడిగట్టారు. ఉమర్‌కోట్‌ జిల్లాలోని సమరో పట్టణంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. చైనాలో కొవిడ్‌ ఉద్ధృతి.. వారంలో 13 వేల మరణాలు!

కరోనా‌(Coronavirus) ఉద్ధృతితో చైనా(China) సతమతమవుతోంది. స్థానికంగా రోజూ వేల సంఖ్యలో కేసులు, మరణాలూ నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల వారం వ్యవధిలోనే దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో దాదాపు 13 వేల వరకు కొవిడ్‌ సంబంధిత మరణాలు నమోదైనట్లు చైనా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(CDC) వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ఆ యువ బ్యాటర్‌ రోహిత్ శర్మకు ‘మినీ వెర్షన్‌’లా ఉన్నాడు: రమీజ్‌ రజా

టీమ్‌ఇండియా ఆటగాళ్ల ప్రదర్శనపై ఎప్పుడూ పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌, పీసీబీ మాజీ ఛైర్మన్ రమీజ్ రజా అవాకులు చెవాకులు పేలుతుండేవాడు. అయితే తొలిసారి భారత యువ క్రికెటర్‌పై అభినందనలు కురిపించాడు. కివీస్‌పై రెండు వన్డేల్లోనూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన శుభ్‌మన్‌ గిల్‌ను రమీజ్‌ రజా ప్రశంసించాడు. టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మినీ వెర్షన్‌లా ఉన్నాడని కొనియాడాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని