Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Updated : 23 Sep 2022 21:09 IST

1. ఎన్నాళ్లో వేచిన ఉదయం.. నెరవేరిన మెదక్‌ వాసుల మూడు దశాబ్దాల కల!

తమ ప్రాంతానికి రైల్వే సౌకర్యం కోసం  మూడు దశాబ్దాలకు పైగా ఎదురుచూసిన మెదక్‌ వాసుల కల నెరవేరింది. కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌ రెడ్డి మెదక్‌-కాచిగూడ ప్యాసింజర్‌ రైలును ప్రారంభించారు. అక్కన్నపేట- మెదక్‌ మధ్య నూతన రైలు మార్గాన్ని శుక్రవారం ఆయన జాతికి అంకితం చేశారు. కాచిగూడ-మెదక్‌ ప్యాసింజర్‌ రైలును జెండా ఊపి ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. ‘అర్బన్‌ నక్సల్స్‌’ కారణంగానే సర్దార్‌ సరోవర్‌ పనులు నిలిచిపోయాయి: మోదీ

రాష్ట్రాల పర్యావరణశాఖ మంత్రుల సదస్సులో ప్రధాని మోదీ కొందరు పర్యావరణ ఉద్యమకారులపై మండిపడ్డారు. వారిని అభివృద్ధి నిరోధకులుగా పేర్కొన్నారు. గుజరాత్‌ రాష్ట్రం నర్మద జిల్లాలోని ఏక్తానగర్‌లో ఆయన పర్యావరణ శాఖ మంత్రుల జాతీయ సదస్సును వర్చువల్‌ ప్రారంభించారు. ఈ  సందర్భంగా మాట్లాడుతూ.. రాజకీయ మద్దతుతో అర్బన్‌ నక్సల్స్‌, అభివృద్ధి నిరోధక శక్తులు సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ నిర్మాణాన్ని అడ్డుకొన్నాయన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. అసలు జైషా ఎవరు..? ఎన్ని సెంచరీలు కొట్టారు..?

దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించేందుకు భాజపా తీవ్ర యత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ప్రాంతీయంగా బలమైన పార్టీలను ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తోంది. వారసత్వ రాజకీయాలను ఎత్తిచూపుతూ వాటిని ఎదుర్కోవాలని చూస్తోంది. తాజాగా తమిళనాడు పర్యటనలో భాగంగా డీఎంకేపై చేసిన విమర్శల్లో భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యావిధానం, నీట్‌ను వ్యతిరేకించడంపైనా మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. యూపీ చట్టసభల్లో ‘ఆమె’ కోసం ఒక రోజు..!

ఉత్తర్‌ప్రదేశ్‌ చట్టసభల్లో మహిళా ప్రతినిధులు మాట్లాడేందుకు ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించాయి. ఈ మేరకు గురువారం ఆ రాష్ట్రంలోని రెండు సభలు (అసెంబ్లీ, లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌) నిర్ణయం తీసుకున్నాయి. ఈ సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం పనిచేస్తుందని పేర్కొన్నారు. ‘‘చట్టసభల్లో పురుష సభ్యుల ఆధిపత్యంతో మహిళా సభ్యుల గొంతు వినపడకపోవడం మనం చూశాం. కానీ, ఈ రోజు మహిళా సభ్యుల మాటలు వింటూ వారు తమ తప్పును గుర్తించాలి’’ అని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. ప్రతి వ్యక్తి కదలికలపైనా నిఘా.. మొబైల్స్ తీసుకెళ్లొచ్చు: సీపీ మహేశ్‌ భగవత్‌

ఉప్పల్‌ స్టేడియంలో ఈనెల 25న జరిగే భారత్‌-ఆసీస్‌ మ్యాచ్‌కు సంబంధించి భద్రతాపరంగా అన్ని ఏర్పాట్లు చేశామని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. మ్యాచ్ ఏర్పాట్ల వివరాలపై ఉప్పల్‌ స్టేడియంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. దాదాపు మూడేళ్ల తర్వాత హైదరాబాద్‌లో క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతుందన్నారు. ఈ మ్యాచ్‌ వీక్షించడానికి దాదాపు 40వేల మంది వస్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. భారత్‌ - ఆసీస్‌ రెండో టీ20.. ఇంకా ఆలస్యమైతే 5 ఓవర్ల ఆటే!

భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. నిన్న రాత్రి వర్షం కారణంగా విదర్భ మైదానం అవుట్‌ ఫీల్డ్‌  చిత్తడిగా మారిపోయింది. దీంతో మ్యాచ్‌ కోసం సిద్ధం చేసేందుకు ఇంకా సమయం పట్టనుంది. ఇప్పటికే రెండుసార్లు సమీక్షించిన అంపైర్లు మరోసారి రాత్రి 8.45 గంటలకు ఇన్‌స్పెక్షన్ చేయనున్నారు. ఒకవేళ మ్యాచ్‌ 9.46 లోపు ప్రారంభమైతే.. ఐదు ఓవర్ల మ్యాచ్‌ జరిగే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. సత్య నాదెళ్ల చెప్పిన కొత్త సమస్య.. ‘ప్రొడక్టివిటీ పారనోయా’

కరోనా సంక్షోభం మూలంగా కార్పొరేట్‌ ప్రపంచంలో ఇంటి నుంచి పని విధానం తప్పనిసరైంది. మహమ్మారి కాస్త అదుపులోకి వచ్చిన తర్వాత కొన్నాళ్లు ఇంటి దగ్గర, కొన్ని రోజులు కార్యాలయాలకు వెళ్లాలనే హైబ్రిడ్‌ వర్కింగ్‌ వ్యవస్థ ప్రారంభమైంది. ఈ వెసులుబాట్లు సుదీర్ఘకాలం నుంచి కొనసాగుతుండటంతో చాలా మంది ఉద్యోగులు ఈ విధానానికి అలవాటుపడ్డారు. పైగా తాము ఆఫీసుకు వెళ్లే కంటే ఇంటి దగ్గరే ఎక్కువ పనిచేస్తున్నామని 87 శాతం మంది ఉద్యోగులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. భారత్‌ జోడో యాత్రలో సోనియా, ప్రియాంక

కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన భారత్‌ జోడో పాద యాత్ర నిరాటంకంగా కొనసాగుతోంది. తమిళనాడులో మొదలైన ఈ పాదయాత్ర త్వరలో కర్ణాటకలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం కేరళలో కొనసాగుతోంది. రాహుల్‌ గాంధీ సహా పలువురు భారత యాత్రికులు చేపట్టిన ఈ పాదయాత్రకు మరింత ఆదరణ తీసుకొచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ సన్నాహాలు చేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. అప్రమత్తంగా ఉండండి.. కెనడాలోని భారతీయులకు కేంద్రం హెచ్చరిక!

కెనడాలో నివసిస్తోన్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. కెనడాలో విద్వేషపూరిత ఘటనలు, మతపరమైన హింస, భారత వ్యతిరేక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని పేర్కొంటూ.. అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. భారత విదేశాంగశాఖ శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. సైన్యంలో చేరండి.. విమానయాన సిబ్బందికి రష్యా ప్రభుత్వ ఆదేశాలు..!

ఉక్రెయిన్‌పై దాడులను మరింత తీవ్రతరం చేసేందుకు సిద్ధమైన రష్యా.. సైనిక సమీకరణను ముమ్మరం చేసింది. తాజాగా విమానయాన సంస్థలు, ఎయిర్‌పోర్టుల్లో పనిచేసే సిబ్బందిని సైన్యంలో చేరాలని ఆదేశిస్తోంది. ఇందులో భాగంగా సైనిక రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని ఇప్పటికే ఐదు ఎయిర్‌లైన్స్‌, పది ఎయిర్‌పోర్టుల సిబ్బందికి సమన్లు జారీ చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మరోవైపు నిర్బంధ సైనిక సమీకరణపై పుతిన్‌ ఆదేశాలకు భయపడి ఎంతోమంది రష్యన్లు దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని