Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 24 Jan 2023 20:56 IST

1. Oscars nominations 2023: ఆస్కార్‌ బరిలో ‘నాటు నాటు’.. ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో నామినేషన్‌

సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఆస్కార్‌ నామినేషన్స్‌ (oscars nominations 2023) జాబితా వచ్చేసింది. 95వ ఆస్కార్‌ అవార్డుల బరిలో నిలిచిన చిత్రాలను ది అకాడమీ ప్రకటించింది. భారతీయుల ఆశలకు ఊతం ఇస్తూ, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) లో ‘నాటు నాటు’ పాటకు బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఆస్కార్‌కు నామినేట్‌ అయింది. వివిధ భాషల నుంచి దాదాపు 300 చిత్రాలు షార్ట్‌లిస్ట్‌ కాగా, అత్యుత్తమ ప్రమాణాలను కలిగిన చిత్రాలను ఓటింగ్‌ ద్వారా ఆస్కార్‌ మెంబర్స్‌ తుది జాబితాకు ఎంపిక చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Rashid Khan: టీ20ల్లో రషీద్‌ ఖాన్‌ అరుదైన ఘనత.. రెండో క్రికెటర్‌గా రికార్డు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (IPL)లో హైదరాబాద్‌ తరఫున ఆడిన రషీద్‌ ఖాన్‌.. ప్రస్తుతం గుజరాత్‌ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే తన జాతీయ జట్టు అఫ్గానిస్థాన్‌తోపాటు విదేశాల్లోనూ పలు లీగుల్లో రషీద్‌ ఆడుతున్నాడు. టీ20ల్లో స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందాడు. తాజాగా టీ20 ఫార్మాట్‌లో ఓ ఘనతను తన ఖాతాలో వేసుకొన్నాడు. ఇలా నిలిచిన రెండో బౌలర్‌గా అవతరించాడు. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే..? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. oscar nominations 2023: ఇప్పటివరకూ ఆస్కార్‌కు నామినేట్‌ అయిన భారతీయ చిత్రాలివే!

యావత్‌ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా చూసిన ఆస్కార్‌ అవార్డుల నామినేషన్‌ ప్రక్రియ ముగిసింది. వివిధ కేటగిరిల్లో పలు చిత్రాలు నామినేషన్‌ దక్కించుకున్నాయి. ఈ ఏడాది వివిధ భాషల్లో దాదాపు 300ల సినిమాలు ఆస్కార్‌ నామినేషన్‌కు షార్ట్‌లిస్ట్‌ అవగా, వాటిలో ఉత్తమ చిత్రాలు ఇప్పుడు అవార్డుల బరిలో నిలిచాయి. ఇప్పటివరకూ ఏయే భారతీయ చిత్రాలు ఆస్కార్‌ అవార్డుల తుదిపోరులో నిలిచాయో చూద్దామా! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Jio 5G Services: మరో 50 నగరాల్లో జియో 5జీ సేవలు..

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో (Jio) తన 5జీ సేవల్ని శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు నగరాల్లో 5జీ సేవలు తీసుకొచ్చిన జియో.. తాజాగా దేశవ్యాప్తంగా మరో 50 నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది. కొత్తగా సేవలు ప్రారంభించిన నగరాల పరిధిలోని యూజర్లు జియో వెల్‌కమ్‌ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Air India: ఎయిర్‌ ఇండియాకు రూ.10 లక్షల జరిమానా.. వారం వ్యవధిలోనే రెండోసారి!

ఎయిర్‌ ఇండియా(Air India)కు తాజాగా మరో జరిమానా పడింది. గత ఏడాది పారిస్- దిల్లీ విమానంలో ప్రయాణికుల అనుచిత ప్రవర్తన ఘటనలను రిపోర్ట్‌ చేయనందుకుగానూ డీజీసీఏ(DGCA) రూ.10 లక్షల జరిమానా విధించింది. డిసెంబరు 6న పారిస్‌- దిల్లీ విమానంలో ఓ ప్రయాణికురాలు వాష్‌రూమ్‌కు వెళ్లినప్పుడు.. మరో వ్యక్తి ఆమె సీట్‌పై ఉన్న దుప్పటిపై మూత్రవిసర్జన చేశాడు. అదే రోజు చోటుచేసుకున్న మరో ఘటనలో.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Naveen Jindal: రూ.50కోట్లు ఇవ్వు.. లేదంటే: నవీన్‌ జిందాల్‌కు బెదిరింపు లేఖ

ప్రముఖ పారిశ్రామికవేత్త, కాంగ్రెస్‌ మాజీ ఎంపీ నవీన్‌ జిందాల్‌ (Naveen Jindal)ను బెదిరిస్తూ ఓ లేఖ (Threat Letter) రావడం కలకలం సృష్టించింది. రూ. 50కోట్లు ఇవ్వాలని ఆగంతకుడు అందులో డిమాండ్ చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు లేఖపై దర్యాప్తు చేపట్టగా.. ఓ ఖైదీ దాన్ని పంపించినట్లు తేలింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. IMD: హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్‌: వాతావరణ శాఖ హెచ్చరిక

నగర వాసులకు భారత వాతావరణశాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. సికింద్రాబాద్‌, ఖైరతాబాద్‌, చార్మినార్‌, ఎల్బీనగర్‌, శేరిలింగంపల్లి వంటి ఐదు జోన్లలో ఈనెల 26 నుంచి విపరీతమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 11 డిగ్రీల సెంటిగ్రేడ్‌ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌కు ఎల్లో ఎలర్ట్‌ జారీ చేసింది. జనవరి 26 నుంచి నగరంలో ఉష్ణోగ్రతలు పడిపోయే ప్రమాదం ఉందని వెల్లడించింది.

8. Shraddha Murder: శ్రద్ధా వాకర్‌ హత్య.. ఐదు రకాల ఆయుధాలతో నరికేశాడు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్‌సెంటర్ ఉద్యోగి శ్రద్ధా వాకర్‌ (Shraddha Walkar) హత్య కేసులో దిల్లీ (Delhi) పోలీసులు మంగళవారం ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. స్నేహితుడ్ని కలవడానికి వెళ్లిందనే కోపంతోనే నిందితుడు ఆఫ్తాబ్‌ పూనావాలా (Aaftab Poonawala) ఆమెను హత్య చేసినట్లు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు 6,629 పేజీల అభియోగ పత్రాన్ని సాకేత్‌ కోర్టుకు సమర్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Gautam Adani: టాప్‌-3లో జెఫ్ బెజోస్.. నాలుగో స్థానానికి అదానీ

బ్లూమ్‌బెర్గ్‌ విడుదల చేసిన ప్రపంచ కుబేరుల జాబితాలో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా పేరుపొందిన అదానీ (Gautam Adani) గడిచిన 24 గంటల్లో 872 మిలియన్‌ డాలర్ల సంపదను కోల్పోవడంతో ఒక మెట్టు దిగాల్సి వచ్చింది. ఆయనను వెనక్కి నెట్టి, అమెజాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ జెఫ్‌ బెజోస్‌ టాప్‌-3లో నిలిచారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. BharOS: స్వదేశీ OS ఆవిష్కరణ.. ‘భారోస్‌’తో కేంద్రమంత్రుల తొలి వీడియోకాల్‌

ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ల గుత్తాధిపత్యాన్ని నిలువరించేందుకు భారత్‌ మొదలుపెట్టిన కసరత్తులకు కీలక ముందడుగు పడింది. ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’లో ఐఐటీ మద్రాస్‌ (IIT Madras) తొలి స్వదేశీ మొబైల్‌ ఓఎస్‌ (OS)ను రూపొందించింది. ‘భారోస్‌ (BharOS)’ పేరుతో అభివృద్ధి చేసిన ఈ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రదాన్‌, అశ్వినీ వైష్ణవ్‌ నేడు ఆవిష్కరించారు. అనంతరం ఈ ఓఎస్‌ను మంత్రులు విజయవంతంగా పరీక్షించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని