Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
Top Ten News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..
1. తెదేపా అన్‌స్టాపబుల్.. అడ్డొస్తే తొక్కుకొని వెళ్తాం: చంద్రబాబు
వైకాపా ఎమ్మెల్యేలకు జగన్‌పై నమ్మకం లేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఇక నుంచి తెలుగుదేశం పార్టీ.. అన్‌స్టాపబుల్ అని, గేర్ మార్చి.. స్పీడ్ పెంచుతామని తెలిపారు. ‘సైకిల్‌పై దూసుకెళ్తాం.. అడ్డొస్తే తొక్కుకొని వెళ్తాం’ అని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం చేసిన విధ్వంసం వల్ల ఏపీ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్న చంద్రబాబు.. అప్పులు చేయడం, దోచుకోవడమే జగన్ పని అని దుయ్యబట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. నలుగురు వైకాపా ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారన్న కారణంతో నలుగురు ఎమ్మెల్యేలపై అధికార వైకాపా చర్యలకు దిగింది. ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలను సస్పెండ్ చేసినట్లు వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఈ మేరకు వైకాపా క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుందని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. రాహుల్ గాంధీపై అనర్హత వేటు
కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభలో పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ సచివాలయం నిర్ణయం తీసుకుంది. పరువు నష్టం కేసులో గుజరాత్‌లోని సూరత్ కోర్టు ఆయనకు రెండెళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చిన మరుసటి రోజే.. ఆ తీర్పు కాపీని పరిశీలించిన అనంతరం లోక్‌సభ సచివాలయం చర్యలు చేపట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. అనర్హతే ఆయుధం కావొద్దు..అది ప్రజాస్వామ్యానికే ప్రమాదం: జేపీ
ప్రతి చిన్న అంశానికీ అనర్హతను ప్రధాన ఆయుధంగా ఉపయోగిస్తే ప్రజాస్వామ్యం క్రమంగా క్షీణించిపోతుందని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. పదవి కోల్పోయిన వ్యక్తిగా రాహుల్‌కు పైకోర్టులో అప్పీల్ చేసుకునే వెసులుబాటు ఉందన్న ఆయన.. ఒక వేళ పై కోర్టులో శిక్షను తగ్గించినట్లయితే అనర్హత వేటును వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. దేశం కోసమే నా పోరాటం.. ఎంత మూల్యానికైనా సిద్ధమే..!
పరువునష్టం కేసులో దోషిగా తేలిన రాహుల్ గాంధీ.. పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై స్పందించిన ఆయన.. ‘భారత్ గళాన్ని వినిపించేందుకే తాను పోరాటం చేస్తున్నానని.. ఈ క్రమంలో ఎంత మూల్యం చెల్లించడానికైనా సిద్ధమే’ అని ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారిస్తూ సూరత్ కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. ఆయనపై అనర్హత వేటు విధిస్తున్నట్లు లోక్‌సభ సెక్రటేరియట్ శుక్రవారం ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. జైలుశిక్ష పడి.. చట్టసభల సభ్యత్వం కోల్పోయిన నేతలు వీరే!
మోదీ ఇంటి పేరును కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకుగానూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి (Rahul Gandhi) జైలుశిక్ష పడిన నేపథ్యంలో ఆయన పార్లమెంట్ సభ్యత్వం (MP)పై అనర్హత వేటు పడింది. అయితే, అప్పీలుకు వెళ్లేందుకు రాహుల్‌కు 30రోజులు గడువు ఉండటంపై కోర్టు నిర్ణయానికి అనుగుణంగా మళ్లీ ఆయన అర్హత పొందే అవకాశాలు ఆధారపడి ఉంటాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ప్రజాస్వామ్యం కోసం మా కుటుంబం రక్తాన్ని ధారపోసింది!
కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై అనర్హత వేటు (disqualification) వేస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ తీసుకున్న నిర్ణయంపై ఆయన సోదరి, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) తీవ్రంగా మండిపడ్డారు. ఈ దేశ ప్రజాస్వామ్యం కోసం తమ కుటుంబం రక్తాన్ని ధారబోసిందని, అలాంటి ప్రజాస్వామ్యాన్ని నేడు మోదీ (Modi) సర్కారు అణచివేయాలని చూస్తోందని దుయ్యబట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. బంతి పట్టిన ధోనీ.. ఆశ్చర్యంలో అభిమానులు
త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్‌లో(IPL 2023) చెన్నై సారథి మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) బౌలింగ్ చేయబోతున్నాడా అనే అనుమానం కలగక మానదు అతడి ప్రాక్టీస్ సెషన్స్ వీడియో చూస్తే. మరి ఈ సీజన్‌లో అతడేం అద్భుతం చేయబోతున్నాడో తెలియదు కానీ, చెపాక్ మైదానంలో మాత్రం బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ మేరకు వీడియోను సీఎస్‌కే(Chennai Super Kings) ఫ్రాంఛైజీ తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. ఎన్‌పీఎస్‌పై కేంద్రం కమిటీ.. మరింత మెరుగుపర్చేందుకు సూచనలు!
నూతన పింఛన్ వ్యవస్థ (NPS) మరింత మెరుగుపర్చే అంశంపై కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. దీనికి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వం వహిస్తారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో తెలిపారు. ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ఈ కమిటీ కృషి చేస్తుందని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. ‘నేను స్పిన్ విభాగానికి కోచ్‌గా ఉంటానంటే ద్రవిడ్ వద్దన్నాడు’
భారత మాజీ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్.. టీమ్‌ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid)పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు స్పిన్ విభాగానికి కోచ్‌గా సేవలందిస్తానని అడిగితే ద్రవిడ్ అంగీకరించలేదని చెప్పాడు. ఆయన ఈ వ్యాఖ్యలు చేయడానికి గల కారణం ఏంటంటే.. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్ ఓటమిపాలై సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోయిన సంగతి తెలిసిందే. మూడో వన్డేలో భారత స్పిన్నర్లు విఫలమయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Prince Harry: ఫోన్ హ్యాకింగ్ కేసు.. తొలిసారి కోర్టు మెట్లెక్కిన ప్రిన్స్ హ్యారీ
-
India News
Operation Bluestar: ఆపరేషన్ బ్లూ స్టార్‌కు 39ఏళ్లు.. ఆ రోజు ఏం జరిగింది..?
-
General News
Weather: మూడు రోజులపాటు తెలంగాణలో మోస్తరు వర్షాలు!
-
Crime News
Gold: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 2 కిలోల బంగారం పట్టివేత
-
Sports News
WTC Final: ఐపీఎల్‌తో ఆత్మవిశ్వాసం వచ్చినా.. ఇది విభిన్నం: శుభ్‌మన్ గిల్
-
Politics News
Pattabhi: ఉద్యోగులకు మళ్లీ అన్యాయమే: పట్టాభి