Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Updated : 24 Sep 2022 21:14 IST

1. కల్వకుంట్ల కుటుంబం వల్లే హెచ్‌సీఏలో గందరగోళ పరిస్థితులు: వివేక్‌

కల్వకుంట్ల కుటుంబం వల్లే హైదరాబాద్‌ క్రిక్‌ట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ)లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని భాజపా నేత వివేక్‌ వెంకటస్వామి ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ కవితను హెచ్‌సీఏ అధ్యక్షురాలిని చేసేందుకు సీఎం కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. భారత్‌, ఆసీస్‌ మూడో టీ20 మ్యాచ్‌కు సంబంధించి ఎన్ని టికెట్లు విక్రయించారో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. ఈ ఆర్థిక సంవత్సరంలో 100 బి.డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు: కేంద్రం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 100 బిలియన్‌ డాలర్ల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) దేశానికి రానున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్రం చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, సరళతర వాణిజ్య విధానాలు ఇందుకు దోహదపడబోతున్నాయని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో (2021-22 ) ఎప్పుడూ లేని విధంగా అత్యధికంగా 83.6 బిలియన్‌ డాలర్ల విలువైన విదేశీ పెట్టుబడులు దేశానికి వచ్చాయని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. ‘వ్యభిచార కూపంలోకి లాగేందుకు యత్నిస్తున్నారు’.. ఆ యువతి ఆవేదన

కనిపించకుండాపోయి, శవమై తేలిన ఉత్తరాఖండ్‌ యువతి (19) ‘రిసార్టు హత్య’ కేసు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. రిసార్టుకు వచ్చే అతిథులకు ‘ప్రత్యేక సేవలు’ అందించేందుకు నిరాకరించడం వల్లే ఆమెను హత్యచేసినట్లు ఇప్పటికే పోలీసులు వెల్లడించారు. రిసార్టుకు వచ్చే అతిథులతో శృంగారం చేయాలని యువతిపై యజమాని ఒత్తిడి తెచ్చాడని, అందుకు ఆమె నిరాకరించడంతో ఈ హత్యకు పాల్పడినట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. ‘జంగిల్‌ రాజ్‌ నడిచింది గుజరాత్‌లోనే’.. అమిత్‌షా వ్యాఖ్యలకు లాలూ కౌంటర్‌

బిహార్‌లో అధికారం పోయిందన్న బాధలో హోంమంత్రి అమిత్‌షా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అన్నారు. 2024 ఎన్నికల్లోనూ అదే జరగబోతోందని చెప్పారు. అందుకే జంగిల్‌ రాజ్‌ అదీ ఇదీ మాట్లాడుతున్నారని లాలూ అన్నారు. అమిత్‌షా గుజరాత్‌లో ఉన్నప్పుడే జంగిల్‌ రాజ్‌ నడిచిందంటూ దుయ్యబట్టారు. బిహార్‌లో నిర్వహించిన ఓ సభలో జేడీయూ-ఆర్జేడీ ప్రభుత్వంపై అమిత్‌షా విమర్శలు గుప్పించిన నేపథ్యంలో లాలూ ఈ విధంగా స్పందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. రిసార్టు మర్డర్‌.. ఆమె ‘ప్రత్యేక’ సేవలకు నిరాకరించినందుకే..!

కొద్దిరోజులుగా కనిపించకుండా పోయి, శవమై తేలిన యువతి హత్యకేసు ఉత్తరాఖండ్‌లో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ కేసులో ఇప్పటికే భాజపా నేత వినోద్‌ ఆర్య కుమారుడు, రిసార్టు యజమాని పులకిత్‌ ఆర్య, అతడి సిబ్బంది అరెస్టయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఆ రాష్ట్ర డీజీపీ అశోక్‌ కుమార్ కీలక విషయం వెల్లడించారు. సదరు యువతి రిసార్టుకు వచ్చే అతిథులకు ‘ప్రత్యేక’ సేవలు అందించేందుకు నిరాకరించడం వల్లే వారు ఈ హత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఆ యువతి తన స్నేహితుడితో జరిపిన చాటింగ్ ఆధారంగా ఈ విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. థాయ్‌లాండ్‌లో ఐటీ జాబ్‌ ఆఫర్లా.. జాగ్రత్త..!

విదేశాల్లో ఐటీ ఉద్యోగాలంటూ నకిలీ జాబ్‌ రాకెట్ల వలలో పడవద్దంటూ దేశ యువతను కేంద్ర విదేశాంగశాఖ హెచ్చరించింది. ఇతర దేశాల్లో ఉద్యోగ ఆఫర్లు వచ్చినప్పుడు సంబంధిత కంపెనీ పూర్తి వివరాలు తెలుసుకున్నాకే వెళ్లాలని సూచించింది. ఉద్యోగాల పేరుతో మోసపోయి కొంతమంది భారతీయులు మయన్మార్‌లో చిక్కుకున్నట్లు వస్తోన్న వార్తల నేపథ్యంలో విదేశాంగ శాఖ శనివారం ఈ అడ్వైజరీ జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. ఇతర దేశాల కరెన్సీ కంటే మన రూపాయి మెరుగే: నిర్మలా సీతారామన్‌

రూపాయి పతనంపై (Rupee) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు. ఇతర దేశాల కరెన్సీతో పోలిస్తే అమెరికా డాలరుతో రూపాయి బాగానే రాణిస్తోందని చెప్పారు. డాలరుతో రూపాయి మారకం విలువ భారీగా పతనమైన నేపథ్యంలో ఇక్కడ ఆమె విలేకరులతో మాట్లాడారు. రిజర్వ్‌ బ్యాంక్‌, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. తాలిబన్‌ నేతకు అతడి ఇంటి ఫొటో పంపించి బెదిరించా: ట్రంప్‌

తాలిబన్లతో చర్చల సందర్భంగా తాను ఆ ముఠా అగ్ర నాయకుడిని గట్టిగా బెదిరించానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తెలిపారు. ఆ నాయకుడి ఇంటి శాటిలైట్‌ ఫొటోను పంపించి హెచ్చరించానని అన్నారు. ఓ అమెరికా వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. ఆసీస్‌తో కీలక పోరు.. భారత కూర్పు ఎలా ఉండనుందో..?

ఆస్ట్రేలియాపై మూడు టీ20ల సిరీస్‌ను గెలిచేందుకు హైదరాబాద్‌లో అడుగు పెట్టింది టీమ్‌ఇండియా. చెరొక విజయంతో 1-1తో సమంగా ఉండటంతో ఆదివారం జరిగే చివరి మ్యాచ్‌ కీలకంగా మారింది. తొలి మ్యాచ్‌లో 209 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో విఫలమైన భారత్‌ ఓటమిపాలైంది. ఇక ఎనిమిది ఓవర్ల ఆట జరిగిన రెండో టీ20లో 91 పరుగులను ఛేదించి మరీ సిరీస్‌ రేసులో నిలిచింది. ఈ క్రమంలో ఉప్పల్‌ వేదికగా జరిగే మూడో మ్యాచ్‌లో టీమ్‌ఇండియా బ్యాటింగ్‌, బౌలింగ్‌ సహా ఫీల్డింగ్‌లోనూ రాణించాల్సిందే. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. ఒకే వీడియోలో ఇటు కృష్ణంరాజు.. అటు ప్రభాస్‌.. రెండు కళ్లు సరిపోవటం లేదు!

కథానాయకుడు ప్రభాస్‌ తన పెదనాన్న కృష్ణంరాజును గుర్తు చేసుకున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు ఇటీవల తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభాస్‌ అభిమానులు చేసిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. అందులో ఒకవైపు కృష్ణంరాజు నటించిన చిత్రాలలోని పాత్రలు, మరోవైపు ప్రభాస్‌ నటించిన చిత్రాలలోని సన్నివేశాలను ఒకదానితో ఒకటి కలిసేలా మిక్స్‌ చేసిన విధానం బాగుంది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని