Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 25 Nov 2022 21:00 IST

1. 9,168 గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి అనుమతి

తెలంగాణలో గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి అనుమతి లభించింది. 9,168 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసినట్టు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా గ్రూప్‌-4 పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రూప్ 4 ఉద్యోగాల్లో నాలుగు కేటగిరీ పోస్టులున్నాయి. 429 జూనియర్ అకౌంటెంట్ పోస్టులు, 6,859 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 18 జూనియర్ ఆడిటర్ పోస్టులు, 1,862 వార్డు ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. పట్టణాల్లో సమస్యల పరిష్కారానికి కొత్త యాప్‌

ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాలు, నగరాలు, గ్రామాల్లో సమస్యల గుర్తింపు.. పరిష్కారం.. నిరంతర పర్యవేక్షణ కోసం ప్రత్యేక యాప్ త్వరలో అందుబాటులోకి రానుంది. పర్యవేక్షణ సహా సమస్యలపై సత్వర పరిష్కారంపై దృష్టి పెట్టాలని అధికారులను సీఎం జగన్‌ అదేశించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. మున్సిపల్‌ సర్వీసుల కోసం నగరాలు, పట్టణాలు సహా గ్రామాల్లోనూ యాప్‌ను తీసుకురావాలని సీఎం ఆదేశించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. చిన్నా.. కాళ్లు పోయినా మృత్యువు కనికరించలేదా?

విద్యుదాఘాతంతో రెండు కాళ్లు కోల్పోయి.. 14 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దర్శిత్‌ చివరికి మృత్యుఒడికి చేరాడు. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పైడిమెట్టకు చెందిన జొన్నకూటి దర్శిత్‌(3) శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 12న తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పైడిమెట్టలో.. భవనంపై దుస్తులు ఆరేయడానికి తల్లితోపాటు దర్శిత్‌ కూడా వెళ్లాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మూడు రాజధానుల ప్రస్తావన తెచ్చిన బాలకృష్ణ.. కిరణ్‌కుమార్‌ రెడ్డి సమాధానమిది!

మూడు రాజధానుల విషయంపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. ‘అన్‌స్టాపబుల్‌ 2’ కార్యక్రమ వేదికగా నటుడు నందమూరి బాలకృష్ణ ఆ ప్రస్తావన తీసుకురాగా కిరణ్‌కుమార్‌ సమాధానమిచ్చారు. ‘‘అసెంబ్లీ జరిగేటప్పుడు అధికారులంతా అక్కడే ఉండాలి. ఎగ్జిక్యూటివ్‌ అంటే కేబినెట్‌, సెక్రటేరియట్‌కు సంబంధించివారు. వారంతా అసెంబ్లీకి హాజరవ్వాలి’’ అని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. దీదీ.. సువేందు.. ‘చాయ్‌ పే చర్చా’: ఆసక్తికరంగా బెంగాల్‌ రాజకీయాలు

పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో శుక్రవారం ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, శాసనసభా ప్రతిపక్ష నేత సువేందు అధికారి శుక్రవారం సమావేశమయ్యారు. సువేందు తృణమూల్ కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరడం, నందిగ్రామ్‌లో ముఖాముఖి తలపడటం తర్వాత వీరిద్దరూ భేటీ అవ్వడం ఇదే తొలిసారి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ‘మీరు ప్రపంచకప్‌ గెలవాలంటే ఆ లీగ్‌లో ఆడకండి’

టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ ప్రస్తుతం ఆటగాడిగానే కాకుండా కెప్టెన్‌గానూ విఫలమవుతున్నాడు. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో సారథిగా రాణిస్తున్నా మెగా ఈవెంట్లలో తనదైన మార్క్‌ చూపలేకపోతున్నాడు. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ సెమీస్‌లోనే ఇంటిముఖం పట్టడంతో రోహిత్‌ ఆటతీరు, కెప్టెన్సీపై విమర్శలు వచ్చాయి. వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో రోహిత్‌ సారథ్యంలోనే టీమ్‌ఇండియా బరిలోకి దిగనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కోతల కాలమ్‌: ప్రపంచవ్యాప్తంగా 1.37 లక్షల ఉద్యోగులు ఔట్‌!

నిన్న మొన్నటి వరకు కొవిడ్‌ నామస్మరణ చేసిన కంపెనీలు.. ఇప్పుడు మాంద్యం జపం చేస్తున్నాయి. కారణమేదైనా ఉద్యోగాల కోత కామన్‌ అన్నట్లు తయారైంది పరిస్థితి. మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో ఉద్యోగాల తొలగింపు పదం తరచూ వినిపిస్తోంది. అమెరికా టెక్‌ కంపెనీలు మెటా, ట్విటర్‌, గూగుల్‌ వంటివి ఉద్యోగులను పెద్ద సంఖ్యలో తొలగిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇవే కాదు ఈ ఒక్క ఏడాదే ప్రపంచ వ్యాప్తంగా సుమారు 853 టెక్‌ కంపెనీలు 1.37 లక్షల మంది ఉద్యోగుల్ని తొలగించాయట. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. సముద్రతీర విల్లాలో కిమ్ కుమార్తె లగ్జరీ లైఫ్‌..!

ఉత్తర కొరియా, ఆ దేశ నియంత పాలకుడు కిమ్ జోంగ్ ఉన్‌ గురించి ప్రతి విషయమూ ఆసక్తికరమే. ఇటీవల ఆయన క్షిపణి ప్రయోగ ప్రదేశానికి తన కుమార్తెను తీసుకువచ్చి ఆశ్చర్యపరిచారు. జపాన్‌, అమెరికా, దక్షిణ కొరియా దేశాలతో ఉద్రిక్తతలు కొనసాగుతోన్న సమయంలో ఆమెను మొదటిసారి ప్రపంచానికి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన పిల్లలకు అందుతోన్న విలాసవంతమైన జీవితం గురించి న్యూయార్క్‌ పోస్టు కథనం ప్రచురించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఇకపై అన్ని శాంసంగ్‌ 5జీ ఫోన్లలో ఎయిర్‌టెల్‌ 5జీ!

దేశంలో ప్రముఖ నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికీ, ఓఎస్‌ సపోర్ట్ చేయని కారణంగా కొన్ని స్మార్ట్‌ఫోన్లలో 5జీ నెట్‌వర్క్‌ పనిచేయడంలేదు. దీంతో మొబైల్‌ కంపెనీలు ఓవర్‌ ది ఎయిర్‌ (OTA) ఓఎస్‌ అప్‌డేట్‌ను విడుదల చేస్తున్నాయి. తాజాగా శాంసంగ్‌ విడుదల చేసిన అప్‌డేట్‌తో ఇకపై అన్ని శాంసంగ్‌ 5జీ  మోడల్స్‌లోనూ ఎయిర్‌టెల్‌ 5జీ నెట్‌వర్క్‌ పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఉమ్రాన్‌.. పేస్‌ను వదలొద్దు.. జోరు పెంచాలి: జహీర్‌ ఖాన్‌

న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో టీమ్‌ఇండియా యువపేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ ఫామ్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. తన తొలి ఐదు ఓవర్లలోనే దాదాపు 150 కి.మీ వేగాన్ని అందుకుంటూ వేసిన బంతులు కివీస్‌ బ్యాటర్లను ఇరుకున పెట్టాయి. ఉమ్రాన్‌ ధాటికి డెవన్‌ కాన్వే, డెరిల్‌ మిచెల్‌ వంటి కీలక ఆటగాళ్లు పెవిలియన్‌కు చేరారు. తాజాగా టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ జహీర్‌ ఖాన్‌ ఈ ఆటగాడి ప్రతిభను కొనియాడాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని