Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..
1. ‘యువగళం’ వైకాపా నేతల్లో వణుకు పుట్టిస్తోంది: నందమూరి బాలకృష్ణ
ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌కి ఇసుక, వైన్, మైన్ తప్ప ప్రజల ఇబ్బందులు పట్టడం లేదని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు. సత్యసాయి జిల్లా హిందూపురంలో నిర్వహించిన ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... లోకేశ్ చేయనున్న యువగళం పాదయాత్ర వైకాపా నాయకుల్లో భయం కలిగిస్తోందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. ఉపాధ్యాయుల స్పౌజ్ కేటగిరీ బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా
బదిలీల విషయంలో గత కొంత కాలంగా ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయ దంపతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉపాధ్యాయుల స్పౌజ్ కేటగిరీ బదిలీలకు అనుమతిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దంపతులను ఒకే చోటుకు బదిలీ చేయాలని ఇటీవల టీచర్లు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో నిలిపివేసిన 12 జిల్లాల్లోని ఉపాధ్యాయ దంపతుల బదిలీలు చేయాలని నిర్ణయించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. తెదేపాలో యువోత్సాహం.. లోకేశ్ పాదయాత్ర సాగేదిలా..!
యువత భవితకోసం, ఆడబిడ్డల రక్షణ కోసం, అవ్వాతాతల బాగోగుల కోసం.. దగాపడ్డ వివిధ వర్గాలకు తోడు కోసం అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) శుక్రవారం నుంచి చేపట్టనున్న యువగళం (Yuvagalam) పాదయాత్రకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. రాష్ట్ర అభివృద్ధికి వారధిగా నిలుస్తానంటూ 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్లకు పైగా నడిచేందుకు ఆయన సిద్ధమయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. ములాయంకు పద్మవిభూషణ్.. కేంద్రంపై ఎస్పీ నేతల విమర్శలు!
సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం దివంగత ములాయం సింగ్ యాదవ్(Mulayam Singh Yadav)కు కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్(Padma Vibhushan) పురస్కారం ప్రకటించడం పట్ల ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఈ అవార్డుకు ఎంపిక చేయడం ద్వారా ములాయం వ్యక్తిత్వాన్ని, ఆయన సేవల్ని కేంద్రం అపహాస్యం చేసిందంటూ విమర్శలు చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. రేపటి నుంచే టీ20 సమరం.. పొట్టి సిరీస్‌లోనూ భారత్ జోరు కొనసాగిస్తుందా?
న్యూజిలాండ్‌పై మూడు వన్డేల సిరీస్‌ని 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసిన టీమ్‌ఇండియా.. ఇప్పుడు టీ20 సిరీస్‌పై కన్నేసింది. జనవరి 27న మూడు టీ20ల సిరీస్ ప్రారంభంకానుంది. వన్డే సిరీస్‌లో ఆడిన స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నారు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య కెప్టెన్సీ బాధ్యతలు చూసుకుంటాడు. వరుసగా సెంచరీలు బాది ఫామ్‌లో ఉన్నగిల్, రంజీల్లో ట్రిపుల్ సెంచరీ బాది జోరుమీదున్న పృథ్వీ షా ఓపెనర్లుగా బరిలోకి దిగుతారని హార్దిక్ వెల్లడించాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. భార్యభర్తలిద్దరికీ ఒకేసారి లేఆఫ్..!
ప్రస్తుతం ఐటీ రంగంలో ఉద్యోగులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. ఎప్పుడు లేఆఫ్ వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ప్రముఖ టెక్ సంస్థలన్నీ భారీ స్థాయిలో ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. ఒక మెయిల్ చేసి, ఉద్యోగం నుంచి తీసేసినట్లు సమాచారం ఇస్తున్నాయి. తాజాగా గూగుల్ కూడా ఒకేసారి ఒక జంటను తీసేసింది. ఈ మేరకు ఓ వార్తాసంస్థ కథనాన్ని ప్రచురించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. అలా ఎంపిక చేయం.. ఇప్పటికే లైన్‌లో చాలా మంది ప్లేయర్లు: రోహిత్
వన్డే ప్రపంచకప్ 2023 కోసం జట్టు సన్నద్ధతపై భారత్ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో టీమ్‌ఇండియా సారథి రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్తులో జరిగే పెద్ద టోర్నమెంట్‌లను దృష్టిలో పెట్టుకొనే ఆటగాళ్ల ఎంపిక ఉంటుందని రోహిత్ వెల్లడించాడు. జట్టులోకి వచ్చేందుకు చాలామంది ప్లేయర్లు లైన్‌లో ఉన్నారని పేర్కొన్నాడు. శ్రేయస్ అయ్యర్ గాయం వల్ల.. కేఎల్ రాహుల్ వ్యక్తిగత కారణాలతో ద్వైపాక్షిక సిరీస్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. కస్టమ్స్ సుంకాల్లో మార్పులొద్దు.. బడ్జెట్‌పై జీటీఆర్‌ఐ సూచనలు
దేశంలో తయారీని ప్రోత్సహించడానికి వచ్చే ఐదేళ్ల పాటు కస్టమ్స్ సుంకాల్లో ఎలాంటి మార్పు చేయొద్దని ఆర్థిక మేధోసంస్థ ‘గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్’ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కీలక పరికరాలపై దిగుమతి పన్నును కొనసాగించాలని సూచించింది. ‘ఇన్వర్టెడ్ డ్యూటీ’ విషయంలో స్పష్టతనివ్వాలని కోరింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. ఆధిపత్య పోరు మళ్లీ షురూ.. తన పనితీరు వల్లే గెలిచామన్న గహ్లోత్
రాజస్థాన్ కాంగ్రెస్‌లో వర్గపోరు మరింత ముదురుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌ల మధ్య ఆధిపత్య పోరు మరోసారి తెరపైకి వచ్చింది. తాను 2013-2018 మధ్యకాలంలో పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు పార్టీ నాయకుల కృషి వల్లే క్రితం ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్లు సచిన్ పైలట్ చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఖండించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. ఐసీసీ క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్ 2022.. విజేతలు వీరే
2022 సంవత్సరానికిగాను క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను ఐసీసీ (ICC) ప్రకటించింది. మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ఎంపికగా.. మహిళల క్రికెట్‌లో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ నాట్ స్కివర్ ఎంపికైంది. 2022 సంవత్సరానికి సంబంధించి వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు కూడా వీరినే వరించాయి. 2021లోనూ బాబర్ అజామ్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Mobile: ‘ఫోన్ వాడకాన్ని చూసి విస్తుపోయా’.. సెల్‌ఫోన్ పితామహుడు
-
World News
USA: అమెరికాలో భారతీయ టెకీలకు గుడ్ న్యూస్
-
Crime News
Mumbai: ప్రియుడితో భార్య వెళ్లిపోయిందని.. మామను చంపిన అల్లుడు
-
World News
Ferry: ప్రయాణికుల నౌకలో అగ్నిప్రమాదం.. 31 మంది మృతి..!
-
General News
Hyderabad: వ్యక్తిగత డేటా చోరీ కేసు.. రంగంలోకి దిగిన ఈడీ అధికారులు
-
India News
Tamil Nadu: తమిళనాట ‘పెరుగు’ వివాదం.. పేరు మార్పుపై రగడ