Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌ టాప్‌ 10 వార్తలు @ 9 PM

Top 10 News in eenadu.net ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 27 Mar 2023 20:58 IST

1.March Deadline: వీటికి ఇంకా నాలుగు రోజులే గడువు.. మరి పూర్తి చేశారా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) చివరికి వచ్చేశాం. మరో నాలుగు రోజులు ఆగితే కొత్త సంవత్సరం (2023-24) మొదలవుతుంది. కొత్త ఏడాదిలో చేయాల్సిన పనులు గురించి అటుంచితే.. ఈ ఏడాది పూర్తి చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. ఒకవేళ మీరు పూర్తి చేయకుంటే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. వీటిల్లో ఏ ఒక్కటైనా మీరు చేయలేదేమో చూడండి. చేయకుంటే మార్చి 31లోగా (March 31st Deadline) పూర్తి చేయండి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. KTR: బండి సంజయ్‌, రేవంత్‌ ఒక్కసారైనా పరీక్ష రాశారా?: కేటీఆర్‌

విద్యా వ్యవస్థలో సిరిసిల్ల జిల్లా ముందుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ ఏడాది సిరిసిల్లకు వైద్య కళాశాల, ఇంజినీరింగ్‌, నర్సింగ్ కళాశాల తీసుకొచ్చామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఒక్క వైద్య కళాశాలగానీ, నవోదయ కళాశాలగానీ ఇవ్వలేదని విమర్శించారు. సిరిసిల్లలో భారాస పార్టీ ప్రతినిధుల ఆత్మీయ సమ్మేళన సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. కేంద్రం తీరుపై విమర్శలు గుప్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3.మీ బంధం బయటపడినా.. మళ్లీ వారి డబ్బు అదానీకేనా? మోదీకి రాహుల్‌ ప్రశ్న

అదానీ (Adani Group) వ్యవహారంలో గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్న కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi).. తాజాగా మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM modi)పై తీవ్ర విమర్శలు చేశారు. అదానీ గ్రూప్‌పై ఎన్ని ఆరోపణలు వస్తున్నా.. వాటిపై దర్యాప్తు చేయడానికి ఎందుకు భయపడుతున్నారంటూ ప్రధానిని ప్రశ్నించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Bilkis Bano: బిల్కిస్‌ బానో పిటిషన్‌.. భావోద్వేగాలతో తీర్పు ఇవ్వలేం: సుప్రీం

 తనపై అత్యాచారానికి పాల్పడ్డ దోషులను ముందస్తుగా విడుదల చేయడాన్ని సవాల్‌ చేస్తూ బాధితురాలు బిల్కిస్‌ బానో (Bilkis Bano) వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) నేడు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌పై తమ స్పందన తెలియజేయాలంటూ కేంద్రం, గుజరాత్‌ ప్రభుత్వానికి (Gujarat Govt) నోటీసులు జారీ చేసింది. ఈ కేసు అనేక అంశాలతో ముడిపడి ఉన్నందున.. దీన్ని సవివరంగా విచారించాల్సిన అవసరముందని జస్టిస్‌ కె.ఎం. జోసెఫ్‌, జస్టిస్‌ బి.వి. నాగరత్నతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Rahul Gandhi: ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయండి.. రాహుల్‌గాంధీకి నోటీసులు

 క్రిమినల్‌, పరువునష్టం కేసులో దోషిగా తేలడంతో ఎంపీ పదవి నుంచి అనర్హతకు గురైన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi)తన అధికారిక బంగ్లాను సైతం ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెల రోజుల్లో తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలంటూ లోక్‌సభ హౌసింగ్‌ కమిటీ ఆయనకు నోటీసులు పంపినట్టు సమాచారం. ఏప్రిల్‌ 22లోగా అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలని డెడ్‌లైన్‌ పెట్టినట్టు పార్లమెంట్‌వర్గాలు పేర్కొంటున్నాయి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Amritpal Singh: భారత్‌ ‘హద్దులు’ దాటిన అమృత్‌పాల్‌..!

 పంజాబ్‌ (Punjab) పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌  (Amritpal Singh) దేశం దాటినట్లు తెలుస్తోంది. అతడు నేపాల్‌ (Nepal)లో నక్కినట్లు భారత్‌ విశ్వసిస్తోంది. ఈ క్రమంలోనే అతడు మరో దేశానికి పారిపోకుండా చూడాలని నేపాల్‌ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఈ మేరకు నేపాల్‌ కాన్సులర్‌ సేవల విభాగానికి అక్కడి భారత రాయబార కార్యాలయం లేఖ రాసినట్లు కాఠ్‌మాండూ మీడియా కథనాలు వెల్లడించాయి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. TSPSC: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ. . మరో వ్యక్తి అరెస్టు

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో సిట్‌ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.  రేణుక భర్త డాకియా ద్వారా ఏఈ ప్రశ్నాపత్రం పొందిన తిరుపతి అనే వ్యక్తిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ఇతడు ఆ ప్రశ్నాపత్రాన్ని రాజేందర్‌కు విక్రయించినట్టు తేలడంతో అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో అతడిని నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. దీంతో ఈ వ్యవహారంలో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య 15కి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Cheetah: ఆ నమీబియా చీతాల్లో.. ‘సాశా’ మృత్యువాత

 గతేడాది సెప్టెంబరులో నమీబియా(Namibia) నుంచి మన దేశానికి ఎనిమిది చీతాలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ వాటిని మధ్యప్రదేశ్‌(Madhya Pradesh) కునో జాతీయ పార్కు(Kuno National Park)లోని ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లోకి విడుదల చేశారు. అయితే, వాటిలో ‘సాశా(Sasha)’ అనే ఆడ చీతా సోమవారం అనారోగ్యంతో మృత్యువాత పడింది. కిడ్నీ సంబంధిత వ్యాధితో అది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Virat - Anushka: మా ఇద్దరిలో విరాట్‌ డ్యాన్స్‌ అదరగొడతాడు: అనుష్క

స్టార్‌ బ్యాటర్ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) డ్యాన్స్‌ అదరగొడతాడని ఆయన సతీమణి అనుష్కశర్మ (Anushka Sharma) వెల్లడించింది. ఇటీవల ముంబయిలో జరిగిన ఇండియన్‌ స్పోర్ట్స్‌ ఆనర్స్‌ (Indian sports Honours Awards 2023) కార్యక్రమంలో పాల్గొన్నారు విరాట్‌, అనుష్క. ఆ కార్యక్రమంలో వారిద్దరూ ఆసక్తికర రాపిడ్‌ఫైర్‌ను ఎదుర్కొన్నారు. డ్యాన్స్‌ ఫ్లోర్‌పై ఎవరి ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని ప్రశ్నించగా విరాట్‌ను చూపించింది అనుష్క. ఆమె సమాధానానికి కోహ్లీ ఆశ్చర్యపోయాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Infinix Hot 30i: ₹9 వేలకే 16జీబీ ర్యామ్‌..50Mp కెమెరాతో ఇన్ఫీనిక్స్‌ ఫోన్‌

 ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇన్ఫీనిక్స్‌ నుంచి హాట్‌ సిరీస్‌ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ సోమవారం భారత్‌లో విడుదలైంది. ఇన్ఫీనిక్స్‌ హాట్‌ 30ఐ పేరుతో వస్తున్న ఈ ఫోన్‌లో 6.6 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ తెర, 50 ఎంపీ డ్యుయల్‌ కెమెరా ఉన్నాయి. దీంట్లో 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే స్టాండ్‌బై మోడ్‌లో 30 రోజుల వరకు పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. ఆక్టాకోర్‌ మీడియా టెక్‌ జీ37 ప్రాసెసర్‌తో వస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు