Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. రాష్ట్రాభివృద్ధి వల్లే ఇవన్నీ సాధ్యమవుతున్నాయి: కేసీఆర్
రాష్ట్రంలో అభివృద్ధి పనులు నిరంతర ప్రక్రియగా కొనసాగాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఆర్థిక వనరులు, సంపదకు అనుగుణంగా ప్రజావసరాలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో అందరూ కలిసి పని చేయాలని మార్గనిర్దేశం చేశారు. ఈమేరకు ప్రగతిభవన్‌లో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు ఆర్థికంగా బలపడుతున్నాయని.. రాష్ట్రాభివృద్ధి వల్లే ఇది సాధ్యమవుతోందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి నిరాకరణ
తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టదలచిన ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సోమవారం రోజున నిర్మల్ జిల్లాలోని భైంసా నుంచి సంజయ్ సంగ్రామ యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 17న ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ఇటీవల పోలీసుల అనుమతి కోరారు. అయితే శాంతిభద్రతల కారణాల దృష్ట్యా పోలీసులు అనుమతి నిరాకరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. ఏపీని అవినీతి రాష్ట్రంగా మార్చేశారు: సోము వీర్రాజు
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి బీసీలను ఓటు బ్యాంకుగానే పరిగణిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఏపీని రాజధాని, అభివృద్ధి లేని అవినీతి రాష్ట్రంగా మార్చేశారని విమర్శించారు. బీసీల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని సీఎం చెబుతున్నా.. వారి కోసం ఒక్క కుర్చీ కూడా లేదన్నారు. ఏలూరులోని ఇండోర్ స్టేడియంలో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ సామాజిక చైతన్య సభలో తెలంగాణ భాజపా నేత లక్ష్మణ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. సమస్యల పరిష్కారానికి అవసరమైతే కాళ్లు పట్టుకునే నేర్పుండాలి: బొత్స
ప్రభుత్వంలో అవినీతి జరిగితే ఉద్యోగులు, సీఎం తలదించుకోవాల్సి వస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రస్తుతం వైకాపా ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదని తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రాష్ట్రస్థాయి ప్రథమ మహా జనసభ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేశ్‌తోపాటు ఏపీజేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు, ఉద్యోగులు హాజరయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. ఉగ్రవాద పార్టీకి సలహాదారుగా సజ్జల: పవన్ కల్యాణ్
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన ఇసుక తవ్వకాల వల్లే అన్నమయ్య ప్రాజెక్టు డ్యామ్ కొట్టుకుపోయిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఈ ప్రమాదంలో వందలాది పశువులు ప్రాణాలు కోల్పోయాయన్నారు. నాడు లష్కర్ రామయ్య అనే ఉద్యోగి అక్కడ లేకపోతే మరింత ప్రాణనష్టం జరిగి ఉండేదన్నారు. దాదాపు 200 మంది ప్రాణాలను ఆయన కాపాడారని చెప్పారు. ఆయన కృషిని జనసేన మనస్ఫూర్తిగా అభినందిస్తోందని, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. మావాడి విషయంలో తొందరపడటం లేదు: ఉమ్రాన్ తండ్రి అబ్దుల్ రషీద్
ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్ జట్టుకు టీమ్ఇండియా యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ ఎంపిక కాలేదన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా ఉమ్రాన్ తండ్రి అబ్దుల్ రషీద్ స్పందించాడు. తాము ఈ విషయంలో ఏమాత్రం బాధపడటం లేదన్నాడు. జట్టులో చేరిన స్వల్ప కాలంలోనే ఉమ్రాన్ దేశం తరఫున ఆడాలని తాము కోరుకోవడం లేదని తెలిపాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. కులం చూసి ఓట్లు వేసే సంస్కృతి పోవాలి: మంత్రి రోజా
కులం చూసి ఓట్లు వేసే సంస్కృతి పోవాలని ఏపీ మంత్రి రోజా అన్నారు. రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘శాసనసభ’ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రజల్లోనూ మార్పు వచ్చిందని, ప్రజల కోసం నాయకులు మారాలని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు.‘‘మావాడు, మా కులం అని ఓట్లు వేసి, ఆ తర్వాత అతడు ఏమీ చేయలేదని బాధపడే కన్నా, మంచి వ్యక్తికి ఓటు వేసి గెలిపించుకుంటే వాళ్లకు మంచి జరుగుతుంది’’ అని రోజా అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. పాత పెన్షన్ స్కీం పునరుద్ధరణపై నీతి ఆయోగ్ ఆందోళన!
పాత పెన్షన్ పథకం (OPS) పునరుద్ధరణపై నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరీ ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల భవిష్యత్తు పన్ను చెల్లింపుదారులపై భారం పడుతుందని తెలిపారు. ఆర్థిక పరిపుష్టి, సుస్థిర వృద్ధిరేటును సాధించాల్సిన ఈ తరుణంలో ఇలాంటి చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థకు అంతగా మంచి చేయవని హితవు పలికారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. నన్ను చంపేందుకు ముగ్గురు షూటర్లు ప్రయత్నించారు: ఇమ్రాన్
పంజాబ్ ప్రావిన్స్‌లోని వజీరాబాద్‌లో నవంబర్ తొలి వారంలో తనపై జరిగిన హత్యా ప్రయత్నంలో ముగ్గురు షూటర్లు పాల్గొన్నట్టు పాక్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ అన్నారు. దేశంలో మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్‌తో ఆయన చేపట్టిన లాంగ్ మార్చ్‌లో ప్రసంగించేందుకు సిద్ధమవుతుండగా దుండగుల కాల్పుల్లో ఆయన కుడికాలికి గాయాలైన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. బల్లార్షాలో కూలిన రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి.. 13మందికి గాయాలు
మహారాష్ట్రలోని బల్లార్షా రైల్వేస్టేషన్లో పెను ప్రమాదం చోటుచేసుకుంది. చంద్రాపూర్‌లోని బల్లార్షా రైల్వేస్టేషన్లో ఫుట్ఓవర్ వంతెన కొంత భాగం కూలిపోయింది. ఈ ఘటనలో 13మందికి పైగా గాయాలు కాగా.. నలుగురికి తీవ్రగాయాలైనట్టు అధికారులు వెల్లడించారు. రైల్వే స్టేషన్లో ఒక ప్లాట్‌ఫాం నుంచి వేరే ప్లాట్‌ఫాంకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన ఈ వంతెనపై నడుస్తుండగా అనేకమంది ప్రయాణికులు దాదాపు 20అడుగుల ఎత్తు నుంచి ట్రాక్‌పై జారిపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Chinese spy balloon: అమెరికా అణ్వాయుధ స్థావరంపై చైనా నిఘా బెలూన్..!
-
Politics News
Kotamreddy: అధికార పార్టీ ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్.. ఆషామాషీగా జరగదు: కోటంరెడ్డి
-
India News
Air India Express: గగనతలంలో ఇంజిన్‌లో మంటలు.. విమానానికి తప్పిన ముప్పు
-
Movies News
K Vishwanath: కె.విశ్వనాథ్ ఖాకీ దుస్తుల వెనుక కథ ఇది!
-
Movies News
K Viswanath: విశ్వనాథ వారి కలం.. అవార్డులు వరించిన ఈ ఐదు చిత్రాలు ఎంతో ప్రత్యేకం..!
-
Politics News
Somu Veerraju: కలసి వస్తే జనసేనతో.. లేకుంటే ఒంటరిగానే పోటీ: సోము వీర్రాజు