Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top Ten News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 29 Mar 2023 21:05 IST

1. చరిత్ర ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది: చంద్రబాబు

సంక్షేమానికి నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు నాయుడు అన్నారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ మైదానంలో ఏర్పాటు చేసిన తెదేపా 41వ ఆవిర్భావ సభకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్‌ కట్‌ చేశారు. అనంతరం భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులనుద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఎన్టీఆర్‌కు మరణం లేదు.. నిత్యం వెలిగే మహోన్నత దీపం: బాలకృష్ణ

నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీ  స్థాపించి  ఒక రాజకీయ విప్లవం తెచ్చారని.. అందరిలోనూ చైతన్యం తీసుకువచ్చారని హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్‌ పాలనలో ఎన్నో సాహసోపేతమైన పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో తెదేపా 41వ ఆవిర్భావ దినోతవ్సవ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రద్దు చేసిన ఏఈఈ నియామక పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ

పేపర్‌ లీకేజీ కారణంగా రద్దయిన అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఏఈఈ) నియామక పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) ప్రకటించింది. మే 8న ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మే 9న అగ్రికల్చర్, మెకానికల్ ఏఈఈ ఆన్‌లైన్ పరీక్ష, మే 21న సివిల్ ఏఈఈ ఓఎంఆర్ పరీక్ష నిర్వహించినున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 22న ఏఈఈ పరీక్షను టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కోలార్‌ నుంచే రాహుల్ ప్రచారం .. దానికో కారణముంది..!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఆ రాష్ట్రంలో భాజపాను గద్దె దించి, కాంగ్రెస్ అధికారంలో రావాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో హస్తం పార్టీ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఏప్రిల్ ఐదు నుంచి కోలార్‌లో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. అయితే ఆయన ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి ఒక కారణముంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఎంఎస్ ధోనీకిదే చివరి సీజనా..? రోహిత్ సూపర్ ఆన్సర్

మరో రెండు రోజుల్లో ఐపీఎల్ (IPL 2023) కొత్త సీజన్‌ ప్రారంభం కానుంది. గత రెండు సీజన్ల నుంచి టోర్నీ మొదలు కావడానికి ముందు ప్రతిసారి ఒక ప్రశ్న మాత్రం ఉత్పన్నమవుతూనే ఉంటుంది. కెప్టెన్ కూల్‌ ఎంఎస్ ధోనీకిదేనా చివరి సీజన్‌..? 2020లో  అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ధోనీ కేవలం ఐపీఎల్‌లోనే ఆడుతున్న విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అమృత్‌పాల్‌ లొంగిపోనున్నాడా..?

పరారీలో ఉన్న ఖలిస్థానీ(Khalistan) సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌(Amritpal Singh).. పంజాబ్‌(Punjab)కు తిరిగిరానున్నాడా..? పోలీసుల ముందు లొంగిపోనున్నాడా..? వీటికి అవుననే సమాధానం వినిపిస్తోంది. అతడు పోలీసుల ముందు లొంగిపోయే అవకాశం ఉన్నటు జాతీయ మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది. అతడి ఆచూకీ కోసం అన్ని ఏజెన్సీలతో సమన్వయం చేస్తున్నామని, సాధ్యమైనంత త్వరగా అతడిని అరెస్టు చేస్తామని మంగళవారం పంజాబ్ ప్రభుత్వం హైకోర్టుకు వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. నాలుగు కూనలకు జన్మనిచ్చిన నమీబియన్‌ చీతా

ప్రాజెక్ట్‌ చీతా (Project cheetah) లో భాగంగా నమీబియా (Namibia) నుంచి గతేడాది భారత్‌ (India)కు తీసుకొచ్చిన చీతాల్లో ఒకటి నాలుగు కూనలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి భూపేందర్‌ యాదవ్‌ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు.  ‘‘ శుభాకాంక్షలు, వన్యప్రాణుల సంరక్షణలో చారిత్రాత్మకమైన క్షణం. గతేడాది సెప్టెంబరు 17న నమీబియా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన చీతాల్లో ఒకటి నాలుగు కూనలకు జన్మనిచ్చింది’’ అని వీడియో/ఫొటోను మంత్రి ట్విటర్‌లో షేర్ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. 30కోట్ల ఉద్యోగాలపై ‘ఏఐ’ ప్రభావం.. గోల్డ్‌మన్‌ శాక్స్‌ అంచనా..!

కృత్రిమ మేధలో ఇటీవల కనిపిస్తోన్న పురోగతి ఎన్నో రంగాలపై ప్రభావం చూపనుందనే ఆందోళన ఎక్కువవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇవి చాలా రంగాల్లో ఉద్యోగుల స్థానాన్ని భర్తీ చేయగలవనే భయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ గోల్డ్‌మన్‌ శాక్స్‌ కూడా తాజా నివేదికలో ఇటువంటి అభిప్రాయాలనే వ్యక్తం చేసింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) సాంకేతికతలో వస్తోన్న నూతన ఒరవడులు 30కోట్ల ఉద్యోగాలపై ప్రభావం చూపొచ్చని అంచనా వేసింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. 30కోట్ల ఉద్యోగాలపై ‘ఏఐ’ ప్రభావం.. గోల్డ్‌మన్‌ శాక్స్‌ అంచనా..!

కృత్రిమ మేధలో (Artificial Intelligence) ఇటీవల కనిపిస్తోన్న పురోగతి ఎన్నో రంగాలపై ప్రభావం చూపనుందనే ఆందోళన ఎక్కువవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇవి చాలా రంగాల్లో ఉద్యోగుల స్థానాన్ని భర్తీ చేయగలవనే భయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ గోల్డ్‌మన్‌ శాక్స్‌ (Goldman Sachs) కూడా తాజా నివేదికలో ఇటువంటి అభిప్రాయాలనే వ్యక్తం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ఐపీఎల్‌లో రోహిత్‌కు విశ్రాంతి.. ముంబయి కోచ్‌ ఏమన్నాడంటే?

ఐపీఎల్‌-16 (IPL-16)  సీజన్‌ మరో రెండు రోజుల్లో ప్రారంభంకానుంది. దీంతో ఆటగాళ్లందరూ ప్రాక్టీస్‌లో మునిగితేలుతున్నారు. ముంబయి ఇండియన్స్‌ సారథి రోహిత్‌ శర్మ (Rohit Sharma) కూడా నెట్స్‌లో చెమటోడ్చుతున్నాడు. ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఎంచుకుని  టీమ్‌ఇండియాలోని కీలక ఆటగాళ్లను ఐపీఎల్‌లో కొన్ని మ్యాచ్‌లకు విశ్రాంతినివ్వాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని