Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 30 Jan 2023 21:05 IST

1. Taraka Ratna: విషమంగానే తారకరత్న ఆరోగ్యం: వైద్యులు

సినీనటుడు నందమూరి తారకరత్న (Tarakaratna) ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు నారాయణ హృదయాలయ (Narayana Hrudayalaya) ఆస్పత్రి యాజమాన్యం  హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నట్లు బులిటెన్‌లో పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు వివరాలు అందిస్తున్నామని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. LIC: అదానీ గ్రూపును ప్రశ్నించే హక్కు మాకుంది : ఎల్‌ఐసీ

అమెరికా పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్‌ (Hindenburg Report) ఇచ్చిన నివేదిక దేశ స్టాక్‌మార్కెట్లను తీవ్ర ఒడిదొడుకులకు గురిచేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హిండెన్‌బర్గ్‌ ఆరోపణలపై అదానీ గ్రూపు ఇచ్చిన స్పందనను విశ్లేషిస్తున్నామని లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (LIC) వెల్లడించింది. అంతేకాకుండా మరికొన్ని రోజుల్లోనే అదానీ గ్రూపుతో సమావేశమై పూర్తి సమాచారం తెలుసుకుంటామని వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. TSPSC: గ్రూప్‌-4 పోస్టులు 8,180.. దరఖాస్తులు 8.47లక్షలు.. గడువు పొడిగింపు

టీఎస్‌పీఎస్సీ(TSPSC) నిర్వహించే గ్రూప్‌-4 ఉద్యోగాల(Group 4 jobs) దరఖాస్తుల గడువును ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) ప్రకటించింది. భారీ సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. నేటితో గడువు ముగియడంతో ఇప్పటివరకు మొత్తంగా దరఖాస్తు(applications) చేసుకున్న అభ్యర్థుల సంఖ్యను అధికారులు వెల్లడించారు. 8,180 పోస్టులకు 8,47,277 మంది అప్లై చేసుకున్నట్టు తెలిపారు. నిన్న ఒక్కరోజే 58,845 మంది దరఖాస్తు చేసుకోగా.. ఆఖరి రోజైన సోమవారం కొత్తగా మరో 34,247 మంది దరఖాస్తు చేసుకున్నట్టు వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. KTR: రాజ్‌భవన్‌లో రాజకీయ నాయకుల ఫొటోలు సరికాదు: కేటీఆర్‌

రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారు ఒక పార్టీకి మద్దతుగా మాట్లాడటం, రాజ్‌భవన్‌ (RajBhavan)లో ఓ పార్టీకి చెందిన నాయకుల ఫొటోలను పెట్టడం సరికాదని మంత్రి కేటీఆర్‌(KTR) వ్యాఖ్యానించారు. సిరిసిల్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాచరిక వ్యవస్థను మార్చాలని చెబుతున్న మోదీ.. బ్రిటిష్‌ కాలం నాటి గవర్నర్‌ వ్యవస్థను కూడా తొలగించాలని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Pak Cricket: భారత్‌ మోడల్‌కు తొందరేం లేదు.. ముందు ఆ పని చూడండి.. పాక్‌కు మాజీ ప్లేయర్‌ సూచన

మూడు ఫార్మాట్లకు ఇద్దరు కెప్టెన్లు.. రెండు జట్లు.. ఇదీ టీమ్‌ఇండియా మోడల్‌. రోహిత్ శర్మ నాయకత్వంలో వన్టేలు, టెస్టులను ఆడే భారత్‌.. హార్దిక్‌ పాండ్య కెప్టెన్సీలో టీ20లు ఆడుతోంది. ‘మిషన్ 2024’లో భాగంగా పాండ్యకు నాయకత్వ బాధ్యతలను మేనేజ్‌మెంట్‌ అప్పగించింది. భారత్‌ మోడల్‌ను అంతర్జాతీయంగా పలువురు మాజీ క్రికెటర్లు అభినందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Startups: అంకురాల్లోనూ తప్పని తొలగింపులు..!

మాంద్యం భయాలతో 2022 చివర్లో ప్రారంభమైన టెక్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ 2023లో కొనసాగుతూనే ఉంది. ట్విటర్‌తో ప్రారంభమైన ఈ తొలగింపుల పర్వం మెటా, అమెజాన్‌, గూగుల్ వంటి దిగ్గజ సంస్థల వరకు వచ్చింది. ఈ క్రమంలో కొన్ని కంపెనీలు  గౌరవప్రదంగా ఉద్యోగులను తొలగిస్తుంటే.. మరికొన్ని కంపెనీల తీరుపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Pakistan: మసీదులో పేలుడు ఘటనలో 44కి చేరిన మృతులు.. ఇది తమ పనేనని ప్రకటించిన టీటీపీ!

పాకిస్థాన్‌(Pakistan)లో ముష్కరులు మరోసారి పేట్రేగిపోయారు. ఓ మసీదు లక్ష్యంగా సోమవారం మధ్యాహ్నం బాంబు దాడికి తెగబడ్డారు. పెషావర్‌(Peshawar)లోని ఓ మసీదులో సోమవారం భారీ బాంబు పేలుడు (Bomb blast) ఘటనలో మృతుల సంఖ్య 44కి చేరగా.. 157 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. China: జననాల క్షీణత ఎఫెక్ట్‌.. అక్కడ పెళ్లికాకపోయినా పిల్లల్ని కనొచ్చు..!

చైనా(China) జనాభా తగ్గుదల కలరపెడుతోంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న డ్రాగన్‌ ఆశలకు ఈ పరిస్థితి గండికొట్టేలా కనిపిస్తోంది. దాంతో ఆ దేశంలోని సిచువాన్‌(Sichuan) ప్రావిన్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లికాని వారు కూడా చట్టబద్ధంగా పిల్లల్ని కలిగి ఉండొచ్చని, వివాహితులు పొందే ప్రయోజనాలు పొందడానికి ఆ ప్రావిన్స్‌ అనుమతించనున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనం ఒకటి వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Yash: రూ. 1500 కోట్ల ప్రాజెక్టు.. హృతిక్‌ వద్దంటే.. యశ్‌ అడుగుపెడతారా?

అధికారికంకాకపోయినా స్టార్‌ హీరోల సినిమాలకు సంబంధించిన కొన్ని వార్తలు అంచనాలు పెంచుతుంటాయి. కన్నడ నటుడు యశ్‌ (Yash) విషయంలో అదే జరుగుతోంది. ఓ భారీ ప్రాజెక్టులో ఆయన అడుగుపెట్టే అవకాశాలున్నాయంటూ వెలువడిన కథనాలు సర్వత్రా ఉత్కంఠ పెంచుతున్నాయి. అదేదో కొత్త ప్రాజెక్టు అయితే అంత క్రేజ్‌ ఉండకపోవచ్చేమో! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Nitish: భాజపాతో మళ్లీ జట్టు కట్టడం కంటే చనిపోవడమే మేలు : నీతీశ్‌

బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ (Nitish Kumar) భాజపాపై ఉన్న అసంతృప్తిని మరోసారి బయటపెట్టారు. భాజపాతో మళ్లీ కలిసి పనిచేసే అంశాన్ని తోసిపుచ్చిన ఆయన.. వారితో జట్టు కట్టడం కంటే చనిపోవడమే మేలని వ్యాఖ్యానించారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న సమయంలో తమ నుంచి కాషాయ పార్టీనే లాభపడిందన్న నీతీశ్‌.. వారికి దూరంగా ఉండే ఓ వర్గం ఓట్లతోనూ భాజపా ప్రయోజనం పొందిందని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని