Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top Ten News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 31 Mar 2023 21:02 IST

1. అధికారుల వైఖరి దురదృష్టకరం.. వారిని జైలుకు పంపాలి: హైకోర్టు

ప్రభుత్వ అధికారులు కోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదని హైకోర్టు మండిపడింది. కోర్టుకు హాజరు కావాలని ఆదేశిస్తేనే అధికారులు స్పందించి పనులు చేస్తున్నారని విచారణ సందర్భంగా హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రెండు వేర్వేరు కోర్టు ధిక్కరణ కేసుల్లో పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు హైకోర్టుకు హాజరయ్యారు. దంత వైద్య కళాశాలలో ఒప్పంద ఉద్యోగిగా పనిచేస్తున్న అరుణ అనే మహిళ.. తనకు 2018 నుంచి జీతం ఇవ్వట్లేదని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. పేపర్‌ లీకేజీ కేసు.. సిట్‌ అధికారుల కీలక నిర్ణయాలు

పేపర్‌ లీకేజీ కేసులో సిట్‌ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేసు విచారణలో భాగంగా కమిషన్‌లో పనిచేసే కొంతమంది సభ్యులను విచారించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌, సభ్యుడు లింగారెడ్డికి నోటీసులు జారీ చేశారు. అనితా రామచంద్రన్‌, లింగారెడ్డి దగ్గర నిందితులు ప్రవీణ్‌, రమేశ్‌లు పీఏలుగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దర్నీ సిట్‌ అధికారులు విచారించి వాంగ్మూలం నమోదు చేయాలని నిర్ణయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. హైదరాబాద్‌ మెట్రో.. రద్దీ వేళల్లో రాయితీ రద్దు

నగరవాసులకు హైదరాబాద్‌ మెట్రో రాయితీల్లో కోత విధించనుంది. ఏప్రిల్ 1 నుంచి మెట్రో రాయితీల్లో కోత విధించనున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. రద్దీ వేళల్లో డిస్కౌంట్‌ను పూర్తిగా ఎత్తివేయనున్నట్లు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకూ... రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకూ మాత్రమే రాయితీ వర్తిస్తుందని పేర్కొన్నారు. మెట్రో కార్డు, క్యూఆర్‌ కోడ్‌పై ఇప్పటి వరకు ప్రయాణ ఛార్జీల్లో 10శాతం డిస్కౌంట్ ఉండేది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. లేఆఫ్‌ల వేళ.. నియామకాలు చేపట్టనున్న ఐటీ సంస్థ

ప్రపంచవ్యాప్తంగా ఐటీ దిగ్గజ సంస్థలు (IT Companies) ఆర్థిక మాంద్యం భయాలతో ఉద్యోగుల తొలగింపులు చేపడుతున్నాయి. ట్విటర్‌, అమెజాన్, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, మెటా, ఎరిక్సన్ వంటి సంస్థలు పెద్ద ఎత్తున లేఆఫ్‌లు (Layoffs) విధిస్తున్నాయి. మరికొన్ని సంస్థలు కొంతకాలంపాటు ఉద్యోగ నియామకాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో ఉద్యోగం పోతే మరో సంస్థలో కొలువు దొరుకుతుందో లేదో తెలియని పరిస్థితి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. దేశంలో అత్యంత ఖరీదైన ఫ్లాట్‌.. రూ.369కోట్లతో ఎవరు కొన్నారో తెలుసా?

దేశ వాణిజ్య రాజధాని (Financial Capital) ముంబయి (Mumbai)కి భారత్‌లో అత్యంత ఖరీదైన నగరంగా పేరుంది. ఇక్కడ సాధారణ అపార్ట్‌మెంట్‌ (Apartment)లో ఒక ఫ్లాట్‌ ధర రూ.కోటి పైనే ఉంటుంది. మరి అన్ని సౌకర్యాలతో కూడిన లగ్జరీ ఇల్లు కొనుగోలు చేయాలంటే పదులు, వందల కోట్లు కుమ్మరించాల్సిందే. తాజాగా, ఈ నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మూడంతస్తుల ఫ్లాట్‌ కళ్లు చెదిరే ధరకు అమ్ముడైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అలా మాట్లాడితే.. కేజ్రీవాల్‌పై పరువు నష్టం దావా వేస్తా: సీఎం హిమంత హెచ్చరిక

దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అర్వింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం అస్సాం పర్యటనకు వెళ్లనున్న వేళ  ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వశర్మ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తనను మరోసారి అవినీతిపరుడు అని అంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.  దేశంలోని ఏ కోర్టుల్లో గానీ, ఏజెన్సీల వద్ద గానీ తనపై ఎలాంటి కేసులు పెండింగ్‌లో లేవని స్పష్టంచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు పెంపు

చిన్న మొత్తాల పథకాల్లో పొదుపు చేసుకునే వారికి ఊరటనిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి త్రైమాసికానికి చిన్నమొత్తాల పొదుపు  పథకాల (Small Savings Scheme) వడ్డీ రేట్లను సవరించింది. దీంతో సీనియర్‌ సిటిజన్ల పొదుపు పథకాలు, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాల వడ్డీ రేట్లు మారనున్నాయి. మరోవైపు పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (PPF), సాధారణ సేవింగ్స్‌ డిపాజిట్‌ వడ్డీ రేట్లలో ఎలాంటి సవరణలు ప్రకటించలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఆ విషయం చెప్పడానికి నాకు 40 ఏళ్లు పట్టింది: స్మృతి ఇరానీ

కేంద్రమంత్రి, భాజపా నేత స్మృతి ఇరానీ(Smriti Irani) తన చిన్ననాటి పరిస్థితుల గురించి వెల్లడించారు. తన తల్లిదండ్రులు విడిపోవడం(parent’s separation) గురించి మాట్లాడారు. వారి గురించి బయటకు చెప్పడానికి తనకు 40 ఏళ్లు పట్టిందన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ మేరకు స్పందించారు. తన తల్లిదండ్రులు విడిపోయిన విషయం చెప్పడానికి తనకు 40 ఏళ్లుపట్టిందని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మా అమ్మ కన్నీటితో డైరీలో అక్షరాలు తడిసిపోయాయి..!

చైనా చరిత్రను గమనిస్తే.. గుర్తొచ్చే వాటిలో ఏకసంతానం విధానం కూడా ఒకటి. దశాబ్దాలుగా కొనసాగిన ఈ కఠిన నిబంధన ఎందరో తల్లుల జీవితాల్లో వేదనను మిగిల్చింది. ఒకరి కంటే ఎక్కువమంది పిల్లలు ఉంటే .. ఆ తల్లిదండ్రులు ఉద్యోగాలను కోల్పోయే పరిస్థితి ఉండేది. అలాగే మరో బిడ్డ ఉన్నవారు జరిమానా కట్టకపోతే.. ఆ సంతానాన్ని చట్టం ఉనికిలో లేకుండా చేయడం, వైద్య సేవలు, విద్యవంటి వాటిని అందకుండా చేసేవారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. యువతిపై ఘోరం.. కారులోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారం!

కర్ణాటక రాజధాని బెంగళూరు(Bengaluru)లో  దారుణం చోటుచేసుకుంది.  19 ఏళ్ల యువతిని కారులోకి బలవంతంగా లాక్కెళ్లిన నలుగురు దుండగులు.. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.  నగరంలోని ఓ పార్కులో తన స్నేహితుడితో కలిసి కూర్చుని ఉండగా అక్కడికి వచ్చిన దుండగులు యువతిని ఎత్తుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని