Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Published : 31 Dec 2021 20:57 IST

1.రూ.10వేల కోట్ల భూ వివాదంపై హైకోర్టు కీలక తీర్పు

మంచిరేవులలో రూ.వేల కోట్ల విలువైన వివాదాస్పద భూమిపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గ్రేహౌండ్స్‌కు కేటాయించిన 142 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని తెలిపింది. 2007లో ఈ భూమిని అప్పటి ప్రభుత్వం గ్రేహౌండ్స్‌కు కేటాయించింది. దాదాపు రూ.10వేల కోట్ల విలువ చేసే ఆ భూమి తమదేనని 45 మంది హైకోర్టును ఆశ్రయించారు.

2.నా అనుచరుల అక్రమ మైనింగ్‌.. అదో దుష్ప్రచారం!

చిత్తూరు జిల్లా నగరి వైకాపాలో వర్గపోరు తారస్థాయికి చేరింది. వైకాపాలో ఓ వర్గం కావాలనే తాను అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నానంటూ దుష్ప్రచారం చేస్తోందని  నగరి ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. శుక్రవారం చిత్తూరు ఎస్పీని కలిసిన ఆమె.. తనపై ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. తన అనుచరులతో అక్రమ మైనింగ్‌ చేయిస్తున్నట్టు కొందరు ఇటీవల డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారన్నారు.

New Year Celebrations: కేకులే కేకులు.. నూతన ఏడాది కోసం ఎదురుచూపులు

3.చిన్నారెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి కౌంటర్‌

ఎమ్మెల్యే జగ్గారెడ్డి క్రమశిక్షణ ఉల్లంఘించారని కమిటీ భావిస్తున్నట్టు పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ చిన్నారెడ్డి మీడియాకు వెల్లడించిన అంశాలు పార్టీలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. దీనిపై పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చించకుండా పార్టీ కార్యక్రమాలపై ప్రకటనలు చేస్తున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కూడా కమిటీ ముందుకు పిలవాలని, అప్పుడే తాను కమిటీ ముందు హాజరవుతానని స్పష్టం చేశారు.

4.రేపటి నుంచి నుమాయిష్‌ ప్రారంభం

కొత్త ఏడాదిలో హైదరాబాద్‌ నగర వాసులను అలరించేందుకు 81వ నుమాయిష్‌ సిద్ధమైంది. రేపటి నుంచి 45 రోజుల పాటు జరగనున్న 81వ అఖిలభారత పారిశ్రామిక వస్తు ప్రదర్శనకు ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేసినట్టు ఎగ్జిబిషన్‌ సొసైటీ  ప్రకటించింది. నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో నిర్వహించే ఈ వస్త్ర, వస్తు ప్రదర్శన కోసం జీహెచ్‌ఎంసీ, ఫైర్‌, పోలీసు, విద్యుత్‌ అన్ని శాఖల అనుమతులు తీసుకున్నట్టు సొసైటీ తెలిపింది.

5.ఐటీ రిటర్నుల దాఖలు గడువు పెంచే యోచన లేదు: కేంద్రం

ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు (ITR) గడువును పెంచే యోచన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాంటి ప్రతిపాదనేమీ తమ వద్దకు రాలేదని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఐటీఆర్‌ దాఖలు ప్రక్రియ సజావుగానే కొనసాగుతోందన్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 5.62 కోట్ల రిటర్నులు దాఖలయ్యాయన్నారు.

New year : సమయ సూచిక ' కేలండర్' ఎలా పుట్టింది?

6.అక్కడ న్యూఇయర్‌ వచ్చేసింది.. 2022లోకి అడుగుపెట్టిన న్యూజిలాండ్‌

కరోనా కల్లోల పరిస్థితుల్లోనే కాలచక్రం మరో ఏడాది గిర్రున తిరిగింది. మరికొద్ది గంటల్లో మనం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. అయితే మనకంటే ముందే కొన్ని ప్రాంతాలు కొత్త ఏడాదిని ఆహ్వానించాయి. పసిఫిక్‌ మహా సముద్రంలోని ‘సమోవా’ ద్వీపం ప్రపంచంలోనే అందరికంటే ముందుగా 2022లోకి వెళ్లింది. భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 3.30 గంటలకే అక్కడ నూతన సంవత్సరం వచ్చేసింది.

7.‘ఆ భూభాగం మాదే’.. అరుణాచల్​ ప్రాంతాలకు పేర్లు పెట్టడాన్ని సమర్థించుకున్న చైనా

అరుణాచల్ ​ప్రదేశ్​లో 15 ప్రాంతాలకు చైనీస్​ పేర్లు పెట్టడాన్ని చైనా సమర్థించుకుంది. ఈ విషయంపై భారత్​ తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో శుక్రవారం వివరణ ఇచ్చింది. దక్షిణ టిబెట్​లో అరుణాచల్ ప్రదేశ్ భాగమని.. తాము పేర్లు పెట్టడం తప్పేంకాదని వితండవాదం చేసింది.​ ఇవి తమ దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన విషయాలంటూ వక్రబుద్ధిని ప్రదర్శించింది.

8.అండర్‌ -19 ఆసియా కప్‌ మన కుర్రాళ్లదే

టీమ్‌ఇండియా కుర్రాళ్లు అదరగొట్టేశారు. వరుసగా మూడోసారి అండర్‌ -19 ఆసియా కప్‌ను సొంతం చేసుకుని సత్తా చాటారు. స్వల్ప స్కోర్లు నమోదైన ఆసియా కప్‌ తుదిపోరులో శ్రీలంకపై తొమ్మిది వికెట్ల తేడాతో (డక్‌వర్త్‌లూయిస్) భారత్‌ ఘన విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు మ్యాచ్‌ను 38 ఓవర్లకు కుదించారు. టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌ చేసిన లంక 38 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 106 రన్స్‌ చేసింది.

Viral news : ఈ మెట్రో మెట్లెక్కితే.. సంగీతమే!

9.ఒకప్పటి కీలకాస్త్రమే కోహ్లీకి బూమ‘రాంగ్‌’ అయ్యిందా?

ప్రత్యర్థులపై పైచేయి సాధించడానికి అతగాడికదే ఒకప్పుడు కీలకాస్త్రం. బౌలర్‌ ఎవరైనా, జట్టు ఏదైనా ఆ షాట్‌ సంధిస్తే బంతి బౌండరీకి పరుగులు పెట్టాల్సిందే. ఒకప్పటి అదే అస్త్రం.. ఇప్పుడు అతగాడి పాలిట శాపంగా మారింది. ఏ షాట్‌ పేరు తెచ్చిందో.. ఇప్పుడదే షాట్ విమర్శల పాల్జేస్తోంది. ఇప్పటికే అర్థమై ఉంటుంది ఆ షాట్‌ పేరు కవర్‌ డ్రైవర్‌. ఆ క్రికెటరే విరాట్ కోహ్లీ. 

10.న్యూఇయర్‌ పార్టీలో సౌండ్‌ బాక్సులు దద్దరిల్లిపోవాల్సిందే..!

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘భీమ్లానాయక్‌’. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న సినిమాలో పవన్‌ పాత్ర కోసం ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఓ స్పెషల్‌ సాంగ్‌ రాసిన విషయం తెలిసిందే. ‘లాలా బీమ్లా’ అంటూ సాగే ఈ పాట.. అరుణ్‌ కౌండిన్య ఆలపించారు. తమన్‌ మ్యూజిక్‌ అందించారు. ఇప్పటికే ఈ సాంగ్‌ మిలియన్ల కొద్ది వ్యూస్‌ సొంతం చేసుకుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని