Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Updated : 01 Jan 2022 21:01 IST

1.సంక్రాంతికి 10 ప్రత్యేక రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే

సంక్రాంతి పర్వదినం సందర్భంగా 10 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈనెల 7, 14న కాచిగూడ-విశాఖపట్నం, 8, 16వ తేదీన విశాఖపట్నం-కాచిగూడ, 11న కాచిగూడ - నర్సాపూర్‌, 12న నర్సాపూర్‌- కాచిగూడ, 19, 21న కాకినాడ టౌన్‌- లింగంపల్లి , 20, 22న లింగంపల్లి - కాకినాడ టౌన్‌ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది.

2.హైదరాబాద్‌లో ప్రారంభమైన నుమాయిష్‌

భాగ్యనగర ప్రజలను అలరించేందుకు నుమాయిష్‌ ప్రారంభమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో 45 రోజుల పాటు జరగనున్న 81వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శనను రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీతో కలిసి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఇవాళ ప్రారంభించారు. కొవిడ్‌ కారణంగా గత ఏడాది నుమాయిష్‌ నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఈ ఏడాది ప్రభుత్వం అనుమతించినప్పటికీ ఒమిక్రాన్‌ వ్యాప్తి దృష్ట్యా స్టాళ్ల సంఖ్యను తగ్గించారు.

3.కొవిడ్‌థర్డ్‌ వేవ్‌ గ్యారెంటీ.. మెజారిటీ ప్రజల మనోగతమిదే: సర్వే

కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తితో దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొద్ది రోజుల వ్యవధిలోనే కేసులు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశంలో మూడో వేవ్‌ అనివార్యమని అనేక మంది భారతీయులు భావిస్తున్నారట. వచ్చే మూడు నెలల్లో దేశంలో థర్డ్‌ వేవ్‌ వస్తుందని ముగ్గురిలో ఇద్దరు భారతీయులు భావిస్తున్నారని ఓ సర్వేలో తేలింది.

New Year: న్యూఇయర్‌ వేళ.. నిమిషానికి 9000 ఫుడ్‌ ఆర్డర్లు

నూతన సంవత్సరం సందర్భంగా ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలైన తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీశైలం దేవాలయాల అర్చకులు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. కొత్త సంవత్సరంలో తొలిరోజైన శనివారం ఆయనకు వేదాశీర్వచనం అందించారు. అలాగే, శేష వస్త్రాలతో పాటు ఆలయాల నుంచి తమ వెంట తీసుకెళ్లిన ప్రసాదాలను ప్రధానికి బహూకరించారు.

5.‘మేం గెలిస్తే కరెంట్‌ ఉచితం’

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. ఓటర్లను తమవైపు ఆకర్షించేందుకు ఉచిత హామీలు గుప్పిస్తున్నాయి. తమ పార్టీకి ఓట్లేసి గెలిపిస్తే ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేస్తామని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌ శనివారం ప్రకటించారు. యూపీలో తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైతే ఒక్కో ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేస్తామన్నారు.

6.ఆ భయం వల్లే వస్త్రాలపై జీఎస్టీ పెంపు వాయిదా!

దేశంలో వస్త్రాలపై జీఎస్టీ రేటును 5 శాతం నుంచి 12 శాతానికి పెంచాలనే నిర్ణయాన్ని కేంద్రం తాత్కాలికంగా వాయిదా వేయడంపై కాంగ్రెస్‌ స్పందించింది. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, టెక్స్‌టైల్‌ హబ్‌గా పేర్గాంచిన గుజరాత్‌లో డిసెంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో ఓడిపోతామనే భయం వల్లే ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించింది. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధికారప్రతినిధి పవన్‌ ఖేరా దిల్లీలో మీడియాతో మాట్లాడారు. 

7.ఒకే రోజు.. విదేశీ విరాళాల లైసెన్సు కోల్పోయిన 6వేల ఎన్జీవోలు..!

దేశవ్యాప్తంగా దాదాపు 6వేల ఎన్జీవోలు ఒకే రోజు విదేశీ విరాళాల లైసెన్సును కోల్పోయాయి. ఇందులో ఐఐటీ దిల్లీ, జమియా మిలియా ఇస్లామియా, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌, నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం అండ్‌ లైబ్రరీ వంటి ప్రముఖ ఎన్జీవోలు కూడా ఉండటం గమనార్హం. వీటిల్లో కొన్ని ఎన్జీవోలు ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్సు పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకోకపోగా.. మరికొన్ని సంస్థలు చేసిన దరఖాస్తులను కేంద్ర హోంశాఖ తిరస్కరించారు.

8.ఒమిక్రాన్‌తో ఆస్పత్రి పాలయ్యే ముప్పు తక్కువే.. టీకాలు పనిచేస్తాయి!

డెల్టా వేరియంట్‌ సోకినవారితో పోల్చితే ఒమిక్రాన్ నిర్ధారణ అయినవారు ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం తక్కువగా ఉంటుందని తాజాగా బ్రిటన్‌లో చేసిన ఓ అధ్యయనం వెల్లడించింది. యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ(యూకేహెచ్‌ఎస్‌ఏ) గతేడాది నవంబర్ 22- డిసెంబర్ 26 మధ్య ఇంగ్లాండ్‌లో నమోదైన 5.28 లక్షలకుపైగా ఒమిక్రాన్‌ కేసులు, 5.73 లక్షల డెల్టా కేసులను విశ్లేషించి దీన్ని రూపొందించింది.

TSRTC : 12 ఏళ్లలోపు చిన్నారులందరికీ ఉచిత ప్రయాణం!

భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి టెస్టు ఐదో రోజు ఆటలో సౌతాఫ్రికా బ్యాటర్‌ తెంబా బావుమా పాదాలపై టీమ్‌ఇండియా బౌలర్‌ మహ్మద్ సిరాజ్ బంతిని బలంగా విసిరాడు. దీంతో బావుమా తీవ్రమైన నొప్పితో విలవిల్లాడాడు. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 62వ ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సిరాజ్ విసిరిన గుడ్ లెంగ్త్ బంతిని బావుమా డిఫెన్సివ్ షాట్ ఆడాడు. వెంటనే సిరాజ్‌ బంతిని అందుకుని బావుమా పైకి విసిరాడు.

10.సైనిక బలోపేతానికి కిమ్​ వ్యూహాలు.. కొవిడ్​ చర్యలు మరింత కఠినతరం

దేశ సైనిక సామర్థ్యాన్ని మరింత పటిష్ఠం చేస్తానని, కరోనా కట్టడికి కఠినమైన చర్యలను కొనసాగిస్తానని ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు బలంగా కృషి చేస్తానని వెల్లడించారు. అధికార పార్టీ ప్లీనరీలో పలు కీలక అంశాలపై కిమ్‌ మాట్లాడినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని