
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
1. దేశంలో ఒక సంచలనం జరగాలి.. జరిగి తీరుతుంది: సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో కేసీఆర్ సమావేశమయ్యారు. చర్చల అనంతరం ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజకీయ నాయకులు కలిసినప్పుడు రాజకీయాలే మాట్లాడుకుంటారు. దేశంలో ఒక సంచలనం జరగాల్సి ఉంది. తొందర్లోనే జరిగి తీరుతుంది. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో అందరూ చూస్తారు’’ అని పేర్కొన్నారు.
2. విభేదాలు పక్కనపెట్టి భారతదేశం, తెలంగాణ ప్రగతికి కృషి చేద్దాం: కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రగతిని కొనసాగించేందుకు సహకరించాలంటూ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రవాస భారతీయులకు పిలుపునిచ్చారు. లండన్‌లో జరిగిన ‘‘మీట్ అండ్ గ్రీట్’’ కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో సాధించిన విజయాలను మంత్రి తన ప్రసంగం ద్వారా వివరించారు. ప్రవాస భారతీయులు తెలంగాణ ఉద్యమానికి మద్ధతుగా నిలిచారని.. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలంగాణను నిరంతరం ప్రోత్సహిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు.
Video: ‘కలిసి ఉంటే కలదు సుఖం’ అంటున్న దేశంలోనే అతిపెద్ద ఉమ్మడి కుటుంబం..
3. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిన కేంద్రం
దేశంలో రోజురోజుకీ ఇంధన ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్న ప్రజలకు కేంద్రం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. చమురు, గ్యాస్‌పై పన్నులు తగ్గించింది. లీటరు పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. తాజా తగ్గింపుతో లీటర్ పెట్రోల్‌పై రూ.9.50లు, డీజిల్‌పై రూ.7తగ్గే అవకాశం ఉంది. మరోవైపు, పీఎం ఉజ్వల్ యోజన పథకం కింద 9కోట్ల మంది లబ్దిదారులకు ఒక్కో సిలిండర్‌పై రూ. 200 రాయితీ ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
4. భారత్-చైనా సరిహద్దుల్లో ఉక్రెయిన్ పరిస్థితులు: రాహుల్ గాంధీ
భారత్-చైనా సరిహద్దుల్లో ఉక్రెయిన్ తరహా పరిస్థితులు నెలకొన్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్‌లోని ప్రజాస్వామ్యం ప్రపంచ ప్రజల మేలు కోసం ఉందని.. దానికి నష్టం వాటిల్లితే అది భూగ్రహానికే సమస్యగా మారుతుందని పేర్కొన్నారు. స్వచ్ఛంద సంస్థ బ్రిడ్జ్ ఇండియా.. లండన్‌లో నిర్వహించిన ‘ఐడియాస్ ఫర్ ఇండియా’ అనే ముఖాముఖి సదస్సులో రాహుల్ పాల్గొని మాట్లాడారు. అభివృద్ధి ఫలాలు కొందరికే అందాలని భాజపా, ఆర్ఎస్ఎస్ భావిస్తుండగా, అందరికీ సమాన అవకాశాలు ఉండాలని తాము కోరుకుంటున్నామని పేర్కొన్నారు.
5. రాణా దంపతులకు మరో ఝులక్.. ఆ నిర్మాణాన్ని కూల్చివేయాలంటూ ఆదేశాలు
హనుమాన్ చాలీసా పఠన వివాదంలో అరెస్టయి విడుదలైన అమరావతి ఎంపీ నవనీత్ రాణా, ఎమ్మెల్యే రవి రాణా దంపతులకు మరో షాక్ తగిలింది. ముంబయిలో ఖేర్ ప్రాంతంలోని ఫ్లాట్‌లో కొంతభాగం అక్రమంగా నిర్మించుకున్నారని, దాన్ని వారం రోజుల్లోగా తొలగించాలని ముంబయి నగరపాలక సంస్థ (బృహన్ ముంబయి కార్పొరేషన్) శనివారం ఆదేశాలు జారీ చేసింది. వారంరోజుల్లోగా తొలగించకపోతే ఆ పని, తామే చేస్తామని.. ఇంటి యజమానికి నెలరోజులపాటు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉన్నట్లు హెచ్చరించింది.
సినీ ప్రస్థానం గురించి ‘ప్రేమలేఖ’ రాసిన దర్శకుడు
6. టీ20 లీగ్.. గుజరాత్ గాండ్రింపా..? రాజస్థాన్ రాజసమా..?
టీ20 లీగ్‌లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ అద్భుత విజయాలతో నంబర్‌వన్ స్థానం దక్కించుకుంది. హార్దిక్ పాండ్య నేతృత్వంలోని టీమ్ 14 మ్యాచుల్లో 10 విజయాలతో 20 పాయింట్లు సాధించింది. ఇక ఆఖరి వరకు టాప్-4లో ప్లేస్ కోసం పోరాడిన రాజస్థాన్ ఏకంగా రెండో స్థానంలోకి దూసుకొచ్చింది. రాజస్థాన్, మరొక కొత్త జట్టు లఖ్‌నవూ కూడా తొమ్మిదేసి విజయాలతో ఉన్నప్పటికీ మెరుగైన నెట్‌రన్‌రేట్ కారణంగా సంజూ సేన ముందుకొచ్చింది.
7. 963 మంది అమెరికన్లపై రష్యా నిషేధాజ్ఞలు.. జాబితాలో అధ్యక్షుడు బైడెన్
ఉక్రెయిన్‌కు అమెరికా ఆర్థిక సాయం అందించడాన్ని తీవ్రంగా పరిగణించిన రష్యా కీలక అడుగులు వేస్తోంది. అమెరికా వాసులపై నిషేధాజ్ఞలు విధిస్తోంది. ఇప్పటివరకు మొత్తంగా 963 అమెరికన్లపై ప్రయాణ నిషేధం విధించినట్లు పుతిన్ ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. గతంలోనే అధ్యక్షుడు బైడెన్, విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్, సీఐఏ (CIA) చీఫ్ విలియమ్ బర్న్స్‌పై ప్రయాణ నిషేధం విధించినట్లు తెలిపింది. ఆ జాబితాలో మరికొందరి పేర్లు చేర్చడంతో మొత్తం సంఖ్య 963కు చేరినట్లు తెలిపింది.
8. అదే సమయంలో రష్యాతో ద్వైపాక్షిక చర్చలు: జెలెన్స్కీ
ఉక్రెయిన్ సంక్షోభానికి కేవలం దౌత్య మార్గాల ద్వారానే పరిష్కారం లభిస్తుందని దేశాధ్యక్షుడు జెలెన్స్కీ శనివారం పునరుద్ఘాటించారు. చర్చల విషయంలో ఇరు దేశాల ప్రతిష్టంభన నెలకొన్న క్రమంలో ఆయన ఓ టీవీ ఛానెల్‌తో ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘పోరు కొనసాగుతోంది. యుద్ధం రక్తమయమవుతోంది. కానీ, చివరకు దౌత్యం ద్వారానే దీనికి తెరపడుతుంది. ఇరు దేశాల మధ్య నిర్ణయాత్మక చర్చలు జరగనున్నాయి’ అని తెలిపారు.
Video: రైతు బీమా అప్పుడు ఇవ్వడమేంటి..:రేవంత్ రెడ్డి
9. ఫాసిస్టు పాలన.. ఆమెను హింసించి అపహరించుకెళ్లారు: ఇమ్రాన్ ఆగ్రహం
పాకిస్థాన్‌లో ప్రస్తుత ఫాసిస్టు ప్రభుత్వం తమ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి షిరీన్ మజారీని హింసాత్మకంగా అపహరించుకెళ్లిందంటూ పీటీఐ అధినేత, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మండిపడ్డారు. ఆమె ఇంట్లో ఉండగా ప్రభుత్వం నిరంకుశత్వంతో వ్యవహరించి హింసించి అపహరించుకెళ్లిందంటూ ట్వీట్ చేశారు. ‘‘మా పార్టీ సీనియర్ నాయకురాలు షిరీన్ మజారీని ఈ ఫాసిస్టు పాలనలో హింసించి అపహరించుకుపోయారు. ఈ ఫాసిస్టు దిగుమతి ప్రభుత్వం ఆమెను భయపెట్టాలని భావిస్తే మాత్రం తప్పులో కాలేసినట్టే’’ అని ట్వీట్ చేశారు.
10. పాక్ మహిళ మాయలో ఆర్మీ ఉద్యోగి.. కీలక సమాచారం లీక్!
పాకిస్థాన్ మహిళ విసిరిన వలపు వల (హనీట్రాప్)లో పడి సైన్యానికి సంబంధించిన కీలక సమాచారం లీక్ చేశాడన్న ఆరోపణలపై ఓ ఆర్మీ ఉద్యోగి అరెస్టయ్యారు. 24ఏళ్ల ప్రదీప్ కుమార్ హనీట్రాప్‌కు గురై సైన్యానికి సంబంధించిన సమాచారం లీక్ చేసినట్టు ఆరోపణలు రావడంతో రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. జోధ్‌పూర్‌లో పనిచేస్తున్న కుమార్‌కు పాకిస్థాన్ ఐఎస్ఐకి చెందిన మహిళ ఫేస్బుక్లో పరిచయమైంది. తనను తాను మధ్య ప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన ఓ హిందూ మహిళగా చెప్పుకొంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Pakistan: పాక్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. 19 మంది మృతి
-
Crime News
దారుణం.. మైనర్లయిన అక్కాచెల్లెలిపై గ్యాంగ్ రేప్: ఐదుగురు యువకులు అరెస్టు!
-
Sports News
Virat Kohli: బెయిర్‌స్టో క్యాచ్ పట్టాక.. కోహ్లీ ఫ్లయింగ్ కిస్ వీడియో..!
-
Business News
Maruti Alto K10: మళ్లీ రానున్న మారుతీ ఆల్టో కే10?
-
Movies News
Ante Sundaraniki: డేట్ సేవ్ చేసుకోండి.. ‘అంటే.. సుందరానికీ!’.. ఆరోజే ఓటీటీలోకి
-
General News
Anand Mahindra: హర్ష గొయెంకా ‘గ్రేట్ మెసేజ్’కు.. ఆనంద్ మహీంద్రా రియాక్ట్!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- IND vs ENG: పుజారా అర్ధశతకం.. మూడో రోజు ముగిసిన ఆట
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- Naresh: ముదిరిన నరేశ్ కుటుంబ వివాదం.. పవిత్రను చెప్పుతో కొట్టబోయిన రమ్య
- Virat Kohli: బెయిర్‌స్టో క్యాచ్ పట్టాక.. కోహ్లీ ఫ్లయింగ్ కిస్ వీడియో..!
- Viral tweet: ‘క్యాబ్‌లో నేను ఇంటికి వెళ్లే ఖర్చుతో విమానంలో గోవా వెళ్లొచ్చు!’
- Anand Mahindra: హర్ష గొయెంకా ‘గ్రేట్ మెసేజ్’కు.. ఆనంద్ మహీంద్రా రియాక్ట్!
- Rishabh Pant: వికెట్ కీపర్లలో పంత్.. బ్రియాన్ లారా: పాక్ మాజీ కెప్టెన్
- Ante Sundaraniki: డేట్ సేవ్ చేసుకోండి.. ‘అంటే.. సుందరానికీ!’.. ఆరోజే ఓటీటీలోకి
- Social Look: ఆహారం కోసం ప్రియాంక ఎదురుచూపులు.. రకుల్‌ప్రీత్ హాట్ స్టిల్!
- IndiGo: ఒకేరోజు వందల మంది ఉద్యోగులు ‘సిక్‌లీవ్’..! 900 సర్వీసులు ఆలస్యం