Updated : 26 May 2022 20:59 IST

Top 10 News @ 9 PM : ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

1. చెన్నైలో ప్రధాని మోదీ.. తమిళ భాష, సంస్కృతులపై ప్రశంసల జల్లు!

తమిళ భాషా సంస్కృతులపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. తమిళ భాష శాశ్వతమైనదని, అక్కడి ప్రజల సంస్కృతి విశ్వవ్యాపితమైందిగా పేర్కొన్నారు. ప్రతి రంగంలోనూ తమిళనాడుకు చెందిన పౌరులు ప్రతిభ కనబరుస్తున్నారని.. ఇటీవల జరిగిన డెఫెలింపిక్స్‌లో భారత్‌ 16 పతకాలు సాధించగా.. అందులో ఆరు పతకాలు తమిళనాడు యువతే కైవసం చేసుకున్నారని కొనియాడారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. భాజపా అధికారంలోకి వస్తుందనేది పగటికల: హరీశ్‌రావు

తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తుందనేది ఆ పార్టీ నేతల పగటికల అని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. తెలంగాణ గురించి మాట్లాడే హక్కు ప్రధాని మోదీకి లేదన్నారు. 8 ఏళ్లలో తెలంగాణకు భాజపా ఇచ్చిందేమిటో మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చే పార్టీ తెరాస అని ధీమా వ్యక్తం చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. అమ్మా.. నువ్వు తిరిగా రా..! నిన్ను గట్టిగా హత్తుకోవాలని ఉంది..!!

‘అమ్మా, నీ గొంతు వినాలని ఉంది. నిన్ను హత్తుకోవాలనిపిస్తుంది. నువ్వు కావాలి. అంతా మునుపటిలా మారిపోవాలి. కానీ ఇదంతా సాధ్యం కాదు. నేను నిన్నెప్పటికీ చూడలేను’ అంటూ ఓ కూతురు మృతి చెందిన తన తల్లి కోసం ఆరాటపడుతోంది. నువ్వు నా హీరో, నా స్ఫూర్తి అంటూ తనకు తానే ధైర్యం చెప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో మంగళవారం తుపాకీ సృష్టించిన మారణహోమం.. ఓ బిడ్డకు మిగిల్చిన కన్నీటి జ్ఞాపకమిది.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. ‘మరోసారి అలా చేస్తే చంపేస్తా’.. ఎంపీ నవనీత్‌ రాణాకి హత్యా బెదిరింపులు!

మహారాష్ట్రలో మాతోశ్రీ- హనుమాన్‌ చాలీసా వివాదంతో వార్తల్లోకెక్కిన అమరావతి ఎంపీ నవనీత్‌ రాణా.. తాజాగా తనకు ఫోన్‌లో హత్య బెదిరింపులు వచ్చాయని ఆరోపిస్తూ దిల్లీలో ఫిర్యాదు చేశారు. రాణా బుధవారం ఈ మేరకు పోలీసులను ఆశ్రయించగా.. ఒకరోజు తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. నార్త్ అవెన్యూ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు దిల్లీ డీసీపీ అమృత గుగులోత్ గురువారం వెల్లడించారు.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. టీ20 లీగ్‌ ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌ల్లో శతకాలు బాదిన వీరులు

భారత టీ20 లీగ్‌ తుది అంకానికి చేరుకుంది. ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లు ఉత్కంఠభరింతంగా సాగుతున్నాయి. ఇప్పటికే క్వాలిఫయర్‌-1లో గుజరాత్‌ విజయం సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్లగా.. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో బెంగళూరు గెలుపొందింది. శుక్రవారం రాజస్థాన్‌, బెంగళూరు మధ్య క్వాలిఫయర్‌-2 జరగనుండగా.. ఆదివారం ఫైనల్‌ మ్యాచ్‌ని నిర్వహించనున్నారు. మరి ఇప్పటివరకు టీ20 లీగ్‌ ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌ల్లో శతకాలు బాదిన వీరులు ఎవరో ఓ లుక్కేద్దాం.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. మామిడిపళ్లు అతిగా తింటే ఈ సమస్యలు తప్పవట!

మామిడి పండ్లు.. ఎన్ని తిన్నా తనివి తీరదు. ఎంతో రుచిగా ఉన్నాయనో, ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయనో.. ఇలా కారణమేదైనా కొంతమంది మరీ ఎక్కువగా లాగించేస్తుంటారు. అయితే వీటిని మితిమీరి తిన్నా.. పలు రకాల అనారోగ్యాలు తప్పవంటున్నారు నిపుణులు. సౌందర్యపరంగానూ నష్టమేనంటున్నారు. మరి, ఇంతకీ రోజుకు ఎన్ని మామిడి పండ్లు తినాలి? ఎక్కువగా తింటే ఏమవుతుంది? రండి.. తెలుసుకుందాం..! మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఇబ్బంది పడ్డ రాహుల్ గాంధీ.. వీడియో వైరల్‌

కొద్ది రోజులుగా కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ చేస్తున్న బ్రిటన్ పర్యటన తాజాగా ఆయనకు ఇబ్బందికర పరిస్థితిని తీసుకువచ్చింది. భారతీయ సమాజంలో హింస, అహింస అనే అంశంపై ప్రశ్న ఎదురుకాగా.. సమాధానం చెప్పేందుకు రాహుల్ తడుముకొన్నట్లు కనిపించింది. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. రాష్ట్ర వర్సిటీలకు ఛాన్సలర్‌గా సీఎం.. త్వరలో దీదీ సర్కార్‌ బిల్లు..!

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్‌గా ఇక నుంచి ముఖ్యమంత్రి వ్యవహరించేలా త్వరలోనే బిల్లు తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో వచ్చిన ఈ ప్రతిపాదనకు మంత్రులు అంగీకారం తెలిపారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. ‘ఉక్రెయిన్‌ ముగిసింది.. తర్వాత పోలాండే!’ చెచెన్‌ నేత కదిరోవ్‌ వీడియో వైరల్‌

ఉక్రెయిన్‌పై సైనిక చర్య విషయంలో పుతిన్‌కు మద్దతుగా నిలుస్తోన్న చెచెన్‌ నేత రంజాన్‌ కదిరోవ్‌.. తాజాగా పోలాండ్‌ను ఉద్దేశించి తీవ్ర బెదిరింపు ధోరణిలో మాట్లాడినట్లు కనిపిస్తోన్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘ఉక్రెయిన్ సమస్య ముగిసింది. తర్వాత పోలాండ్‌ పట్ల ఆసక్తిగా ఉంది’ అని ఆయన అందులో వ్యాఖ్యానించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. కరోనా ఇంకా పూర్తిగా పోలేదు.. మాస్క్‌ మరవకండి!

కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న వేళ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు జాగ్రత్తలు పాటించడంలో అలసత్వం ప్రదర్శించొద్దని.. మాస్క్‌లు ధరించడాన్ని కొనసాగించాలని కోరారు. కరోనా వైరస్‌ మన నుంచి పూర్తిగా పోలేదన్న ఆయన.. ఆస్పత్రిలో చేరికలు తక్కువగానే ఉన్నప్పటికీ అందరూ అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని కోరారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని