Top Ten news @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
1. టీచర్ల ఆస్తులపై విద్యాశాఖ ఉత్తర్వులు రద్దు చేసిన ప్రభుత్వం
ఉపాధ్యాయుల ఆస్తులపై తెలంగాణ పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. విద్యాశాఖ పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులు ఏటా ఆస్తుల వివరాలు ప్రకటించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. స్థిర, చరాస్తుల క్రయవిక్రయాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈనెల 8న జారీ చేసిన ఉత్తర్వులు ఈరోజు మధ్యాహ్నం వెలుగులోకి వచ్చాయి. అప్పటి నుంచి రాష్ట్రంలో రాజకీయ దుమారంతో పాటు ఉపాధ్యాయుల్లో ఆందోళన మొదలైంది.
2. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు షెడ్యూల్ ఖరారు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. జులై 2న మోదీ హైదరాబాద్ రానున్నారు. ఆరోజు మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు వెళ్తారు. రాజ్‌భవన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా నోవాటెల్ హోటల్‌కు చేరుకుంటారు. జులై 2, 3 తేదీల్లో మోదీ నగరంలోనే ఉండి రాజ్‌భవన్‌లో బస చేస్తారు. తిరిగి 4వ తేదీ ఉదయం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తారు.
3. కేసీఆర్ పాలనపై ‘సాలు దొర.. సెలవు దొర’ వెబ్సైట్ ప్రారంభిస్తున్నాం: తరుణ్ చుగ్
తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబం చేతిలో బందీ అయ్యిందని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్ ఆరోపించారు. రాష్ట్రంలో కేసీఆర్, ఆయన కుటుంబం మొత్తం పెత్తనం చేస్తున్నారని దుయ్యబట్టారు. పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించినా, కేసీఆర్ ప్రభుత్వం కుంభకర్ణుడి నిద్రలో ఉందని ఎద్దేవా చేశారు. కేసీఆర్, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా అలీబాబా 40దొంగల తీరుగా మారి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు.
4. సెర్ప్‌తో ఫ్లిప్‌కార్ట్ ఒప్పందం.. మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో సంతకాలు
తెలంగాణ రాష్ట్రంలో స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులు, ఆహార పదార్థాలను ఇకపై ఫ్లిప్‌కార్ట్ సంస్థ ద్వారా ఆన్లైన్లో విక్రయించనున్నారు. ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్‌తో రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ- సెర్ప్ ఒప్పందం చేసుకొంది. హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో శనివారం జరిగిన కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో సెర్ప్ సీఈఓ సందీప్ కుమార్ సుల్తానియా, ఫ్లిప్‌కార్ట్ సంస్థ ఉపాధ్యక్షురాలు స్మృతి రవిచంద్రన్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
5. అమ్మకానికి అమరావతి భూములు.. రూ.2,480 కోట్ల సమీకరణకు సీఆర్డీఏ ప్రణాళిక
హైకోర్టు ఆదేశాల మేరకు రాజధాని అమరావతిలో నిర్మాణాలు, మౌలిక సదుపాయలను కల్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నిధుల సేకరణకు రాజధానిలో ఉన్న భూములను విక్రయించేందుకు సీఆర్డీఏ ప్రణాళిక రూపొందించింది. తొలి విడతలో 248.34 ఎకరాలు విక్రయించాలని నిర్ణయించింది. ఎకరానికి రూ.10కోట్ల చొప్పున రూ.2480 కోట్లు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వేలం ద్వారా భూముల విక్రయానికి అనుమతిస్తూ ఇటీవల 389 జీవోను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది.
6. ప్రతిపక్ష పార్టీల నేతలను వేధించొద్దు: వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు
అధికారం తలకెక్కితే ప్రజలు పెట్టాల్సిన చోట వాతలు పెడతారని నెల్లూరు రూరల్ వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వైకాపా నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ ప్లీనరీ సమావేశం శనివారం అన్నమయ్య సర్కిల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనుల గురించి వివరించారు.
7. ఆర్థిక సంక్షోభ నివారణకు పాక్ ‘లస్సీ’ మంత్రం!
ఆర్థిక సంక్షోభం అంచులకు చేరిన పాకిస్థాన్‌ను గట్టెక్కించేందుకు ఆ దేశ మేధావి వర్గం అన్ని మార్గాలనూ అన్వేషిస్తోంది. ఇప్పటికే దిగుమతుల బిల్లును తగ్గించుకోవాలంటే రోజుకి 1 లేదా 2 కప్పుల టీ మాత్రమే తాగాలని స్వయంగా ఆ దేశ మంత్రే ప్రజలకు సూచించారు. ఫలితంగా ‘టీ’ పొడి దిగుమతి తగ్గి విదేశీ మారక నిల్వలను ఆదా చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. తాజా ‘టీ’ని తాగడం మానేసి లస్సీ, సత్తు వంటి స్థానిక పానీయాలను సేవించాలని ఓ అత్యున్నత విద్యా సంస్థ సూచించింది.
8. తేలని ‘మహా’ ఉత్కంఠ.. టాప్-10 అప్డేట్స్
మహారాష్ట్రలోని (Maharashtra) సంకీర్ణ ప్రభుత్వంలోని కీలక భాగస్వామి శివసేనలో (shiv sena) అంతర్గత సంక్షోభం తారస్థాయిలో కొనసాగుతోంది. దీంతో వరుసగా ఐదో రోజూ మరాఠా రాజకీయం క్షణం క్షణం ఉత్కంఠ రేపుతోంది. అటు సీఎం ఉద్ధవ్ ఠాక్రే శివసేన, ఏక్నాథ్ శిందే రెబల్ ఎమ్మెల్యేల బృందాలు వరుస భేటీలు నిర్వహిస్తున్నా ప్రతిష్టంభన వీడటంలేదు. మరోవైపు, శివసేన జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆరు కీలక తీర్మానాలను ఆమోదించారు.
9. ‘ఈ ద్రోహాన్ని మర్చిపోలేం.. ఇది నిజం, అబద్ధం మధ్య పోరు’
మహారాష్ట్రలో (Maharashtra) రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఏక్నాథ్ శిందే (Eknath Shinde) వర్గం తిరుగుబాటు చేయడంతో శివసేన రెండు వర్గాలుగా విడిపోయింది. ఈ నేపథ్యంలోనే మంత్రి, సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే (Aaditya Thackeray) రెబల్ అభ్యర్థులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది నిజం, అబద్ధం మధ్య సాగుతోన్న పోరు అని.. ఈ ద్రోహాన్ని మర్చిపోలేనని పేర్కొన్నారు.
10. టెస్టుల్లో 100 సిక్సర్లు..అరుదైన క్లబ్లో బెన్ స్టోక్స్
టీ20, వన్డే క్రికెట్లో బ్యాటర్లు తరచుగా సిక్సర్లు బాదేస్తుంటారు. అయితే టెస్టు మ్యాచ్‌లో చాలా అరుదుగా సిక్సర్లు చూస్తుంటాం. ఇప్పటివరకు టెస్టు క్రికెట్లో విధ్వంసకర బ్యాటర్లు బ్రెండన్ మెక్కల్లమ్, ఆడమ్ గిల్‌క్రిస్ట్ మాత్రమే ఈ ఫార్మాట్లో 100 సిక్సర్లు కొట్టారు. తాజాగా హెడింగ్లీ వేదికగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతోన్న మూడో టెస్టులో సౌథీ బౌలింగ్‌లో సిక్సర్ కొట్టి ఈ అరుదైన క్లబ్లో ఇంగ్లాండ్ సారథి బెన్ స్టోక్స్ చేరాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Naga Chaitanya: సినిమా మధ్యలోనే ప్రేక్షకులు బయటకు వచ్చేశారు.. బాధేసింది: నాగచైతన్య
-
General News
Burning Wounds: కాలిన గాయాలయ్యాయా..? ఏం చేయాలో తెలుసా..!
-
Sports News
Cheteshwar Pujara: 73 బంతుల్లోనే పుజారా సెంచరీ.. ఒకే ఓవర్లో 22 పరుగులు!
-
India News
Har Ghar Tiranga: ఇంటింటా హర్ ఘర్ తిరంగా.. సతీమణితో కలిసి జెండా ఎగరవేసిన అమిత్ షా
-
Movies News
Vikram: నిజంగా నేనే వచ్చా.. డూపు కాదు: విక్రమ్
-
General News
Chandrababu: హర్ ఘర్ తిరంగా.. ఓ పవిత్రమైన కార్యక్రమం: చంద్రబాబు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Rishi Sunak: ఆయన నా ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదు: రిషి సునాక్
- Offbeat: ఆ విమానంలో జర్నీ కేవలం ఒక్క నిమిషమే.. ధరెంతో తెలుసా..?
- Himanta Biswa Sarma: ఆమిర్ ఖాన్.. మీరు మా రాష్ట్రానికి ఆగస్టు 15 తర్వాతే రండి..!
- Best catches: విండీస్ ఆటగాళ్ల మెరుపు ఫీల్డింగ్.. ఒకే మ్యాచ్‌లో మూడు సంచలన క్యాచ్‌లు!
- Ranveer singh: న్యూడ్ ఫొటోషూట్.. రణ్‌వీర్‌సింగ్ ఇంటికి పోలీసులు!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (13/08/2022)
- SCR: చుట్టూ చూడొచ్చు.. చుక్కలూ లెక్కెట్టొచ్చు.. ద.మ.రైల్వేలో తొలి రైలు
- Hyderabad: మహిళ చెర నుంచి నా కుమారుడిని కాపాడండి.. హెచ్ఆర్సీని ఆశ్రయించిన తండ్రి
- Crime News: సినిమా చూసి.. మూఢవిశ్వాసంతో బలవన్మరణం
- Aadhi Pinisetty: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీల పెళ్లి సందడి.. టీజర్ చూశారా!