Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 10 Aug 2022 20:57 IST

1. విమాన టికెట్‌ ధరలపై పరిమితులు ఎత్తివేత

దిల్లీ: విమాన టికెట్ ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ మార్గాల్లో విమాన ఛార్జీలపై పరిమితులను తొలగించింది. ఈ మేరకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నేడు ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ఈ నిర్ణయం ఆగస్టు 31 నుంచి అమల్లోకి రానుంది. అంటే ఇకపై, ప్రయాణికుల ఛార్జీలపై విమానయాన సంస్థలే స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చు.

2. కొత్త సీజేఐగా జస్టిస్‌ యు.యు.లలిత్ నియామకం

భారత సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి (CJI)గా జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ (యు.యు.లలిత్‌) నియమితులయ్యారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్‌. ఎన్‌.వి.రమణ ఈ నెల 26న పదవీ విరమణ చేయనుండటంతో తన స్థానంలో జస్టిస్‌ యు.యు.లలిత్‌ పేరును ఆయన సిఫారసు చేసిన విషయం తెలిసిందే. దీంతో బుధవారం యు.యు.లలిత్‌ను భారత 49వ సీజేఐగా నియామకానికి సంబంధించిన దస్త్రంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ సంతకం చేశారు.

3.  అధ్యక్ష ఎన్నికకు కాంగ్రెస్‌ సిద్ధం.. పోటీపై మౌనంగానే రాహుల్‌..?

వరుస పరాజయాలతో సతమతమవుతోన్న కాంగ్రెస్‌ పార్టీని.. నాయకత్వ సంక్షోభం కూడా వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ పూర్తిస్థాయి అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు (Congress President) సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియను ఆగస్టు 21వ తేదీ నుంచి మొదలు పెట్టనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే, కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ పోటీలో అగ్రనేత రాహుల్‌ గాంధీ ఉంటారా లేదా..?

Video: గ్రామ సచివాలయ సిబ్బందిపై సర్పంచ్‌ కుమారుడి దౌర్జన్యం

4. మాధవ్‌ న్యూడ్‌ వీడియో ఫేకో.. రియలో ప్రజలే తేలుస్తారు

అమరావతి: హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌ వీడియో ఫేకో.. రియలో ప్రజలే తేలుస్తారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. ఫేక్‌ వీడియో అయితే.. నాలుగు గోడల మధ్య జరిగితే తప్పేంటి అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల ఎలా అంటారని ప్రశ్నించారు. అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్‌ల వాయిస్‌  కూడా ఫేక్‌ అని తేల్చేశారా? అని నిలదీశారు.

5. నేను అబ్బాయిని అయితే.. ఆటను వదిలిపెట్టేదాన్నే కాదు..!

న్యూయార్క్‌: గెలుపే లక్ష్యంగా టెన్నిస్‌ కోర్టులో అడుగుపెట్టిన అమెరికా టెన్నిస్ తార సెరెనా విలియమ్స్‌.. 23 గ్రాండ్‌ స్లామ్‌లను తన ఖాతాలో వేసుకుంది. అలా గెలుస్తూనే.. స్టెఫీగ్రాప్‌, క్రిస్‌ ఎవర్ట్‌, మార్టినా నవ్రతిలోవా వంటి దిగ్గజాలను అధిగమించింది. 2017లో రెండు నెలల గర్భిణిగా ఆస్ట్రేలియా ఓపెన్‌ను దక్కించుకుంది. అది ఆమెకు 23వ టైటిల్‌. క్లిష్టతరమైన కాన్పు తర్వాత నుంచి మునుపటిలా సత్తా చాటి..

6. జియో ఫ్రీడమ్‌ ఆఫర్‌..

ఏటా స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చే రిలయన్స్‌ జియో.. ఈసారి ఓ లాంగ్‌ టర్మ్‌ ప్లాన్‌ను ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్‌ కింద రూ.2999 రీఛార్జిపై ఏడాది వ్యాలిడిటీతో రూ.3వేలు విలువైన ప్రయోజనాలను కూపన్ల రూపంలో ప్రకటించింది. ఆగస్టు 9 నుంచి ఈ ప్లాన్‌ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు జియో పేర్కొంది. ఏడాది వ్యాలిడిటీ ప్లాన్‌ కోసం చూసేవారు దీన్ని ఎంపిక చేసుకోవచ్చు.

Video: వచ్చేది నిమిషమే అయినా.. అదే హైలైట్: నితిన్‌

7. మునుగోడు తెరాసలో అసమ్మతి స్వరం..

ఉపఎన్నికకు సిద్ధమవుతున్న మునుగోడులో తెరాస నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికే మళ్లీ అవకాశం ఇవ్వనున్నట్టు తెరాస కీలక నేతలు సంకేతాలు ఇవ్వడంతో పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కూసుకుంట్లకు టికెట్ ఇవ్వొద్దని సీఎం కేసీఆర్‌కు కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు లేఖ రాశారు..

8. ఎర్రకోట వేడుకల్లో.. అత్యాధునిక తుపాకులతో ‘గన్‌ సెల్యూట్‌’

స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకొనేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఆగస్టు 15న ఎర్రకోటలో నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో 21 తుపాకులతో చేసే గన్‌ సెల్యూట్‌కు స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన అధునాతన తుపాకులను ఉపయోగించనున్నారు.

9. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై హత్యాయత్నం.. మరో నలుగురి అరెస్టు

తెరాస ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని హత్య చేసేందుకు యత్నించిన మరో నలుగురిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రసాద్‌కు సహకరించిన సంతోష్, సుగుణ, సురేందర్, సాగర్‌లను అరెస్టు చేసినట్లు డీసీపీ జోయల్‌ డేవిస్‌ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ మీడియాకు వెల్లడించారు. ఈ నెల 6న ప్రధాన నిందితుడు ప్రసాద్‌ను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.

10. 12న తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు వెల్లడి?

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు ఈనెల 12న విడుదలయ్యే అవకాశముంది. ఎంసెట్‌ కమిటీ రేపు ఫలితాలను విశ్లేషించి ఆమోదించనుంది. గత నెల 18 నుంచి 21 వరకు ఇంజినీరింగ్‌, 30, 31న అగ్రికల్చర్‌, ఫార్మా ఎంసెట్‌ నిర్వహించారు. ఇంజినీరింగ్‌కు 1,56,812 మంది, అగ్రికల్చర్‌, ఫార్మా కోర్సుల కోసం 80,575 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ప్రాథమిక సమాధానాలు విడుదల చేసి విద్యార్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. తుది సమాధానాలతో పాటు ఫలితాలను ఎంసెట్‌ కమిటీ విశ్లేషించి నిర్ణయం తీసుకోనుంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమయాన్ని బట్టి ఈనెల 12 లేదా 13న ఫలితాలను ప్రకటించనున్నారు.

Video: రోజువారీ ఆహారంలో షడ్రుచులు.. ఎంత ఆరోగ్యకరమంటే..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని