Published : 16 Aug 2022 21:04 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. ప్రపంచంపై ‘పెత్తనం’ కోసమే అమెరికా ప్రయత్నాలు: పుతిన్‌

ప్రపంచంపై పెత్తనం చలాయించేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin) మరోసారి మండిపడ్డారు. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లో శత్రుత్వాన్ని మరింత ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఆఫ్రికా, ఆసియా, లాటిన్‌ అమెరికా దేశాల సైనికాధికారుల సమావేశంలో మాట్లాడిన పుతిన్‌.. ఉక్రెయిన్‌ను (Ukraine Crisis) రష్యా వ్యతిరేక స్థావరంగా అమెరికా మార్చుతున్నందునే అక్కడికి తమ దళాలను పంపామని ఉద్ఘాటించారు.

2. సరిహద్దుల్లో చైనా కవ్వింపులకు చెక్‌..

దేశ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా సైన్యం అమ్ములపొదిలో మరిన్ని ఆయుధాలు చేరాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆయుధాలు, సాంకేతిక వ్యవస్థలను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేడు ఆర్మీకి అందజేశారు. ఫ్యూచర్‌ ఇన్‌ఫాంట్రీ సోల్జర్‌ యాజ్‌ ఏ సిస్టమ్‌(F-INSAS), కొత్త తరం యాంటీ పర్సనల్‌ మైన్‌ ‘నిపున్‌’, ఆటోమేటిక్‌ కమ్యూనికేషన్ సిస్టమ్‌, ట్యాంకులకు ఆధునీకరించిన సైట్‌ సిస్టమ్‌, అడ్వాన్స్‌డ్‌ థర్మల్‌ ఇమేజర్స్‌తో పాటు ఇన్‌ఫాంట్రీ ప్రొటెక్టెడ్‌ వెహికల్స్‌, ల్యాండింగ్‌ క్రాఫ్ట్‌ అసల్ట్ బోట్స్‌ను రాజ్‌నాథ్‌ అందజేశారు.

3. దుష్ట శక్తులకు బుద్ధి చెప్పాలి: వికారాబాద్‌ సభలో సీఎం కేసీఆర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం సాయంత్రం వికారాబాద్‌ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా వికారాబాద్‌లో రూ.61 కోట్లతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని సీఎం ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Video: ఆ ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోండి: మంత్రి బొత్స

4. ఘోర ప్రమాదంలో 20మంది సజీవ దహనం

పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయిల్‌ ట్యాంకర్‌, బస్సు ఢీకొన్న ఘటనలో 20 మంది సజీవ దహనమయ్యారు. మరో ఆరుగురు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రం ముల్తాన్‌లో జరిగింది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పాకిస్థాన్ ​రెస్క్యూ 1122 విభాగం అధికార ప్రతినిధి ఈ దర్ఘటనకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించారు.

5. దీపక్‌కు అంత సులువేం కాదు.. కోహ్లీకి ఒక్క ఇన్నింగ్స్ చాలు!

ఇంకో రెండు రోజుల్లో జింబాబ్వేతో టీమ్‌ఇండియా మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది. సీనియర్‌ బ్యాటర్ విరాట్‌ కోహ్లీతోపాటు రెగ్యులర్‌ సారథి రోహిత్ శర్మ, రిషభ్‌ పంత్, దినేశ్‌ కార్తిక్‌ తదితరులకు యాజమాన్యం విశ్రాంతినిచ్చింది. కేఎల్ రాహుల్‌, శిఖర్‌, రుతురాజ్‌, గిల్, హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్‌ కిషన్‌, సంజూ శాంసన్‌ వంటి బ్యాటర్లు ఉన్నారు. అదేవిధంగా చాలా కాలం తర్వాత గాయం నుంచి కోలుకుని దీపక్‌ చాహర్‌ జట్టులోకి వచ్చాడు.

6. అభిమానికి క్యాన్సర్‌.. అండగా నిలిచిన చిరంజీవి

క్యాన్సర్‌తో బాధపడుతున్న తన అభిమానిని చూసి ప్రముఖ నటుడు చిరంజీవి చలించిపోయారు. అతడిని కలిసి అండగా ఉంటానంటూ భరోసానిచ్చారు. ఆ అభిమాని.. కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గానికి చెందిన దొండపాటి చక్రధర్‌. క్యాన్సర్‌ బారిన పడటంతో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. విషయం తెలుసుకున్న చిరంజీవి మెరుగైన వైద్యం కోసం చక్రధర్‌ని హైదరాబాద్‌కు రప్పించి...

Video: జగన్‌వి డిగ్రీ ఫెయిల్‌ తెలివితేటలు: నారా లోకేశ్‌

 7. వచ్చే ఏడాది వేతనాలు పెరగనున్నాయ్‌..

తన జీవులకు గుడ్‌న్యూస్‌. వచ్చే ఏడాది ఉద్యోగుల వేతనాలు 10 శాతం పెరగనున్నాయి. సంస్థలను వీడి ఉద్యోగులు వలసపోతున్న వేళ కంపెనీలు ఆ మేర వేతనాలు పెంచాలని నిర్ణయించినట్లు ఓ నివేదిక తెలిపింది. శాలరీ బడ్జెట్‌ ప్లానింగ్‌ పేరిట గ్లోబల్‌ అడ్వైజరీ, బ్రోకింగ్‌, సొల్యూషన్‌ కంపెనీ విల్లీస్‌ టవర్స్‌ వాట్సన్‌ ఓ నివేదికను విడుదల చేసింది. భారత్‌లో అధిక శాతం కంపెనీలు 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి..

8. ప్రజలు పేదలుగా ఉంటే.. దేశం ధనికంగా మారదు.. కేంద్రంపై కేజ్రీవాల్‌ కౌంటర్‌

దేశంలో వైద్యం, విద్యా సౌకర్యాలను  మెరుగుపర్చాలని కేంద్రం భావిస్తే వారితో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఉచిత విద్య, వైద్యం పథకాలను ‘‘ఉచితాలు’’గా పరిగణించకూడదని కేంద్ర ప్రభుత్వానికి మరోసారి సూచించారు. పేదలకు మంచి విద్య అందకుంటే.. వారు పేదలుగానే మిగిలిపోతారని, దేశం ధనికంగా మారదన్నారు.

9. Ratan Tata: ఒంటరితనం ఎలా ఉంటుందంటే..

అంకురాల్లో పెట్టుబడి పెట్టి.. కొత్త ఆలోచనలకు అండగా నిలుస్తుంటారు టాటా గ్రూప్‌ మాజీ ఛైర్మన్ రతన్‌ టాటా. తాజాగా ఆయన ‘గుడ్‌ఫెల్లోస్’ అనే అంకుర సంస్థలో పెట్టుబడిపెట్టారు. పిల్లలకు దూరంగా ఉన్న వయసు మళ్లిన వృద్ధులకు ఆసరాను అందించే లక్ష్యంతో ఇది ఏర్పాటైంది. దీనిని శంతను నాయుడు ప్రారంభించారు. ‘గుడ్‌ ఫెల్లోస్’ లాంచింగ్ కార్యక్రమంలో రతన్‌ టాటా మాట్లాడుతూ..

Extra Jabardasth: ఒకేసారి ముగ్గురు చంద్రముఖిలు..

10. మంత్రి ఆడియో లీక్‌ కలకలం.. సీఎం బొమ్మైకి కొత్త తలనొప్పి!

కర్ణాటక(Karnataka)లో నాయకత్వ మార్పు జరిగే అవకాశం ఉందంటూ గత కొంతకాలంగా పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తోన్న వేళ సీఎం బసవరాజ్‌ బొమ్మై (Basavaraj Bommai)కి కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. తాజాగా న్యాయశాఖ మంత్రి జేసీ మధుస్వామి చేసిన వ్యాఖ్యల ఆడియో క్లిప్‌ వైరల్‌గా మారడం ముఖ్యమంత్రికి తలనొప్పి వ్యవహారంగా మారింది.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని