Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 05 Oct 2022 20:56 IST

1. బీఆర్‌ఎస్‌ మొదటి కార్యక్షేత్రం మహారాష్ట్ర, కర్ణాటక: సీఎం కేసీఆర్‌

దేశాన్ని 75 ఏళ్లుగా ఏలిన పార్టీలు ప్రజలకు చేసిందేమీ లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్‌ రాష్ట్ర సమితిగా మారుస్తున్నట్టు ప్రకటించిన అనంతరం పార్టీ శ్రేణులనుద్దేశించి కేసీఆర్‌ మాట్లాడారు. దేశ ప్రజల ప్రయోజనాల కోసమే భారాస ఆవిర్భవిస్తోందని చెప్పారు. తెలంగాణ కోసం కష్టపడినట్లే దేశం కోసం పనిచేస్తామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. బీఆర్‌ఎస్‌.. రాజకీయ నిరుద్యోగులు, కాలం చెల్లిన నేతల ఏకీకరణ మాత్రమే: లక్ష్మణ్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ పార్టీ అంటూ ఇవాళ ప్రకటించిన బీఆర్‌ఎస్‌పై భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలో తెరాసకు నూకలు చెల్లాయి... అందుకే బీఆర్‌ఎస్‌ పేరుతో కొత్త డ్రామా చేస్తున్నారని విమర్శించారు. తెరాస 8ఏళ్ల పాలనలో తెలంగాణ ప్రజలకు చేసిందేమిటో చెప్పాలన్నారు. యావత్‌ రాష్ట్రాన్ని బ్యాంకులు, కార్పొరేషన్లకు కుదువపెట్టిన కేసీఆర్‌.. ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడమే బీఆర్‌ఎస్‌ విధానమా? అని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3.  హైదరాబాద్‌ను కోల్పోయిన మనకు మళ్లీ ఆ పరిస్థితి రావొద్దు: కొడాలి నాని

రెక్కాడితే గాని, డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల కోసమే ముఖ్యమంత్రి జగన్‌  3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. 3 రాజధానులకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కాంక్షిస్తూ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరంలోని కొండాలమ్మ అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ‘ఆదిపురుష్‌’ టీజర్‌ ట్రోల్స్‌.. ఘాటుగా స్పందించిన ‘శక్తిమాన్’ ముఖేష్‌ ఖన్నా..!

ఇతిహాసగాథ రామాయణాన్ని ఇలా తీస్తే మాత్రం కుదరదని ‘శక్తిమాన్’ పాత్రధారి ముఖేష్‌ ఖన్నా అభిప్రాయపడ్డారు. ప్రభాస్‌ రాముడిగా ఓంరౌత్‌ రూపొందిస్తున్న మైథలాజికల్‌ మూవీ ‘ఆది పురుష్‌’. సీతగా కృతి సనన్‌, లంకేష్‌ పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తున్నారు. దసరా కానుకగా విడుదలైన టీజర్‌పై సోషల్‌మీడియాలో ట్రోలింగ్స్‌ వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై బాలీవుడ్‌ ప్రముఖులతో పాటు, పలువురు రాజకీయ నాయకులు సైతం స్పందిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. విరాట్‌ను గొప్ప కెప్టెన్‌ అనలేం: వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌

టీమ్‌ఇండియా దిగ్గజ ఆటగాడు విరాట్‌ కోహ్లీని గొప్ప కెప్టెన్‌గా తాను పేర్కొనలేంటూ వెస్టిండీస్‌ మాజీ పేసర్‌ విన్‌స్టన్‌ బెంజిమన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆటకు వీడ్కోలు పలికిన అనంతరం యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ వారికి శిక్షణ ఇస్తోన్న ఈ సీనియర్‌ ఆటగాడు సచిన్‌ తెందూల్కర్‌కు ఇటీవల ఓ విన్నపం చేసి వార్తల్లో నిలిచాడు. తమ కుర్రాళ్లకు అవసరమైన క్రికెట్‌ కిట్లను అందించాలని సచిన్‌ను కోరగా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Rupay క్రెడిట్‌కార్డుతో ఆ లావాదేవీలపై ఎండీఆర్‌ ఛార్జీలు ఉండవు: NPCI

రూపే క్రెడిట్‌ కార్డును ఉపయోగించి రూ.2వేల వరకు చేసే UPI లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలూ ఉండబోవని నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ (NPCI) స్పష్టంచేసింది. ఆర్‌బీఐ మార్గదర్శకాల మేరకు ఎటువంటి ఛార్జీలూ విధించడం లేదని ఎన్‌పీసీఐ తాజా సర్క్యులర్‌లో పేర్కొంది. దేశీయంగా అభివృద్ధి చేసిన పేమెంట్‌ గేట్‌వేను ప్రోత్సాహించే ఉద్దేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7.  కొవిడ్‌లో పేదలకు భారత్‌ అందించిన సాయం భేష్‌: ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు

కొవిడ్‌-19 సంక్షోభం సమయంలో పేదలు, బడుగు వర్గాలకు భారతదేశం అందించిన సాయం విశేషమైనదని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ బుధవారం కొనియాడారు. అలాగే విస్తృత రాయితీలకు బదులు భారత్‌లో అమలవుతున్న ప్రత్యక్ష నగదు బదిలీ విధానాన్ని ఇతర దేశాలు సైతం అనుసరించాలని సూచించారు. ఫలితంగా అసవరమైన లబ్ధిదారులకు మాత్రమే ఫలాలు అందుతాయన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ICC: ‘ప్లేయర్ ఆఫ్‌ ది మంత్‌’ అవార్డులు.. భారత్‌ నుంచి ముగ్గురు నామినేట్!

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రతి నెలా పురుషుల, మహిళా క్రికెట్‌ విభాగంలో ఒకరికి ‘ప్లేయర్ ఆఫ్‌ ది మంత్ అవార్డు’ ప్రకటిస్తుంది. తాజాగా ఆసీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ పురుషుల ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్  (సెప్టెంబర్) అవార్డు కోసం నామినేట్ అయ్యాడు. అక్షర్‌తోపాటు పాకిస్థాన్‌ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్, ఆస్ట్రేలియా ఆటగాడు కామెరూన్ గ్రీన్‌ కూడా నామినేట్‌ కావడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Amit Shah: పాకిస్థాన్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదు: అమిత్‌ షా

దాయాది పాకిస్థాన్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పునరుద్ఘాటించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తుందని చెప్పారు. జమ్ముకశ్మీర్‌ని దేశంలోనే అత్యంత శాంతియుతమైన ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. జమ్ముకశ్మీర్‌ పర్యటనలో ఉన్న అమిత్‌ షా.. రెండో రోజు  బారాముల్లాలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. James Bond: అమెజాన్‌ ప్రైమ్‌ అరుదైన అవకాశం.. అందుబాటులోకి 25 బాండ్‌ చిత్రాలు

భాష, వయసుతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా అశేష ప్రేక్షకులను సొంతం చేసుకున్న పాత్ర జేమ్స్‌బాండ్‌. తొలి జేమ్స్‌బాండ్‌ వెండితెరకు పరిచయమై 60ఏళ్లు పూర్తయ్యాయి. హాలీవుడ్‌తో పాటు, అన్ని భాషల సినిమాల్లో జేమ్స్‌బాండ్‌ మూవీలు వచ్చాయి. ఈ సందర్భంగా ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో బాండ్‌ అభిమానుల కోసం అరుదైన అవకాశాన్ని కల్పిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని