Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 06 Oct 2022 21:01 IST

1. సాహిత్యంలో అనీ ఎర్నాక్స్‌కు నోబెల్‌ పురస్కారం

సాహిత్యం(Literature)లో ఈ ఏడాది నోబెల్‌ పురస్కారం (Nobel Prize 2022) ఫ్రెంచ్‌ రచయిత్రి అన్నీ ఎర్నాక్స్‌ని వరించింది.  వ్యక్తిగత జ్ఞాపకాల మూలాలను, వైరుధ్యాలను, సామూహిక పరిమితులను ధైర్యంగా సూక్ష్మ పరిశీలనతో తన రచనల్లో బహిర్గత పరిచినందుకు గాను 82 ఏళ్ల ఎర్నాక్స్‌ను ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపిక చేసినట్టు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. వరల్డ్‌ కప్‌ నుంచి ఔట్.. విమర్శలకు బుమ్రా కౌంటర్‌

వెన్ను నొప్పి తిరగబెట్టడంతో టీ20 ప్రపంచకప్‌నకు దూరమైన టీమ్‌ఇండియా సీనియర్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రాపై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్‌ అయిన విషయం తెలిసిందే. ఫ్రాంచైజీ క్రికెట్‌కు అందుబాటులో ఉండే బుమ్రా టీమ్‌ఇండియా కోసం మాత్రం గాయాలను సాకుగా చూపి తప్పించుకొంటున్నాడని విమర్శలు వచ్చాయి. అయితే వాటికి కౌంటర్‌గా బుమ్రా తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో చేసిన ఓ పోస్టు నెట్టింట్లో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. కేఏ పాల్‌ .. కేసీఆర్‌ సొంత విమానం కొన్నది ఆ ఇద్దరే: బండి సంజయ్‌

కేసీఆర్‌ ప్రకటించిన జాతీయ పార్టీకి ఒక జెండా లేదు, అజెండా లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. హైదరాబాద్‌లోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... టీఆర్‌ఎస్‌ ప్రారంభించిన సందర్భంలో ఆ పార్టీలో ఎంతమంది ఉన్నారు? వారిలో ఇప్పుడు ఎంత మంది ఉన్నారని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. కాణిపాకం వినాయకుడి అభిషేకానికి రూ.5వేలా?

చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి పంచామృత అభిషేకం టికెట్ ధర పెంపు అంశం వివాదాస్పదంగా మారింది. టికెట్‌ ధర ఒకే సారి రూ.700  నుంచి రూ.5వేలకు పెంచడంతో భక్తుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో దేవాదాయశాఖ స్పందించి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. స్వామివారి అభిషేకం టికెట్‌ ధర పెంచడాన్ని ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో దళిత్‌ సదస్సు: సీఎం కేసీఆర్‌

వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలు ప్రగతిభవన్‌లో ఇవాళ సీఎం కేసీఆర్‌ను కలిశారు. తమిళనాడు వీసీకే పార్టీ అధ్యక్షుడు తిరుమావళవన్‌ సహా పలువురు నేతలు కేసీఆర్‌ను కలిసి బీఆర్‌ఎస్‌ ఏర్పాటుపై అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. ఓటీటీలో ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ వచ్చేసింది.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

ఆమీర్‌ఖాన్‌ కథానాయకుడిగా అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహించిన కామెడీ డ్రామా ‘లాల్‌ సింగ్‌ చడ్డా (Laal Singh Chaddha). ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ స్ట్రీమింగ్‌ మొదలైంది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. వన్డే క్రికెటర్‌గా ధావన్‌కు సరైన గుర్తింపు రాలేదు: బ్యాటింగ్‌ మాజీ కోచ్‌

వన్డే ఫార్మాట్‌లో టీమ్‌ఇండియాకు కీలకంగా మారిన శిఖర్ ధావన్‌కు సరైన గుర్తింపు రాలేదని బ్యాటింగ్‌ మాజీ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ పేర్కొన్నాడు. వన్డేల్లో స్థిరంగా రాణించే సామర్థ్యం కలిగిన బ్యాటర్లలో ధావన్‌ ముందుంటాడని తెలిపాడు. ప్రస్తుత ఏడాదిలో 14 వన్డేలను ఆడిన శిఖర్ 50కిపైగా సగటుతో పరుగులు చేయడం విశేషం. తాజాగా దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌కు భారత కెప్టెన్‌గా ధావన్‌ బాధ్యతలు చేపట్టాడు. కానీ.. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. 8 నగరాల్లో ఎయిర్‌టెల్‌ 5జీ ప్లస్‌ సేవలు.. అప్పటి వరకు 4జీ ప్లాన్లే!

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ (Airtel) దేశంలోని 8 నగరాల్లో 5జీ ప్లస్‌ (5G plus) సేవలను ప్రారంభించింది. ఈ సేవలను పొందేందుకు సిమ్‌ కార్డు మార్చాల్సిన అవసరం లేదని, 5జీ ఫోన్‌ ఉంటే సరిపోతుందని ఎయిర్‌టెల్‌ వెల్లడించింది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, సిలిగుడి, నాగ్‌పూర్‌, వారణాశి నగరాల్లోని వినియోగదారులు 5జీ+ సేవలను ఆనందించొచ్చని ఎయిర్‌టెల్‌ తెలిపింది. దశలవారీగా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి
 

9. వీడియో, ఇమేజ్‌, జిఫ్‌.. ఇక మూడు ఒకే ట్వీట్‌లో!

ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ ప్లాట్‌ఫాం ట్విటర్‌ (Twitter) మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. వీడియోలు, ఇమేజ్‌లు, జిఫ్‌లను.. ఇలా మూడింటినీ ఒకే ట్వీట్‌లో పొందుపరిచే సదుపాయాన్ని తాజాగా తీసుకొచ్చింది. ప్రస్తుతానికి ఇమేజ్‌లు లేదా వీడియోల్లో ఏదైనా ఒక్కటి మాత్రమే ట్వీట్‌ చేసే సదుపాయం ఉంది. ఇకపై ఈ మూడింటినీ కలిపి ఒకే ట్వీట్‌ చేయొచ్చు.అప్‌డేట్‌ ద్వారా ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ వినియోగదారులకు ఈ సదుపాయం తీసుకొచ్చినట్లు ట్విటర్‌ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. Jaishankar: మా విద్యార్థులకు వీసాలు ఇవ్వండి: జైశంకర్‌

ప్రపంచానికి స్థిరత్వాన్ని అందించే బాధ్యత భారత్‌, న్యూజిలాండ్‌ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపైనే ఉందని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ అన్నారు. న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్న ఆయన.. ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి ననైయా మహుతాతో ఇవాళ మధ్యాహ్నం సమావేశమయ్యారు. ఇండో ఫసిపిక్‌ రీజియన్‌లో భద్రత, ఉక్రెయిన్‌ సంక్షోభం తదితర అంశాలపై చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని