Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 26 Nov 2022 21:04 IST

1. తెలంగాణ స్టార్టప్‌ చరిత్ర లిఖించింది.. ఉపగ్రహాల ప్రయోగంపై కేసీఆర్‌ హర్షం

‘ధృవ’ స్పేస్ టెక్ ప్రైవేటు సంస్థ ద్వారా, శనివారం శ్రీహరికోట నుంచి ప్రయోగించిన రెండు నానో ఉపగ్రహాల ప్రయోగం విజయవంతం కావడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రోకు చెందిన పీఎస్‌ఎల్వీసీ-54తోపాటు హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ ‘ధృవ’ సంస్థ పంపిన ‘తై బోల్ట్ 1, తై బోల్ట్ 2’ ఉపగ్రహాలు వాటి కక్ష్యల్లోకి చేరడం దేశ అంకుర సంస్థల చరిత్రలో ఓ శుభ దినమన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మాతా శిశు సంరక్షణకు మూడంచెల వ్యూహం: మంత్రి హరీశ్‌రావు

రాష్ట్రంలో మాతా శిశు సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం మూడంచెల వ్యూహాన్ని అమలు చేస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 44 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 56 టిఫా (టార్గెటెడ్‌ ఇమేజింగ్‌ ఫర్‌ ఫీటల్‌ అనామలీస్‌) స్కానింగ్‌ మిషన్లను శనివారం ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. హైదరాబాద్‌లోని పేట్ల బురుజు ఆసుపత్రిలో హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ టిఫా స్కానింగ్‌ మిషన్లను నేరుగా ప్రారంభించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. యోగి X కేజ్రీవాల్‌.. ట్విటర్‌ వేదికగా ప్రచార విమర్శలు!

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది గుజరాత్‌(Gujarat)లో ప్రచార వేడి పెరుగుతోంది. భాజపా, కాంగ్రెస్‌, ఆప్‌ ఇతరత్రా పార్టీల నేతలు తమదైన ప్రచార శైలిలో ప్రజల్లో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath)‌, ఆప్‌ అధినేత, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal)లు తాజాగా ట్విటర్‌ వేదికగా పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. హత్య తర్వాత ఆఫ్తాబ్‌ ఇంటికి యువతి.. ఆమె ఓ సైకాలజిస్ట్‌ అట..!

శ్రద్ధా వాకర్ హత్య కేసుకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. నిందితుడు ఆఫ్తాబ్‌ ఓ పక్క ప్రియురాలి శవాన్ని ఫ్రిజ్‌లో ఉంచి.. మరో యువతిని పలు మార్లు తన అపార్ట్‌మెంట్‌కు పిలిచినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అలా ఇంటికి వచ్చిన యువతి ఒక డాక్టర్ అని,  సైకాలజిస్ట్‌ అని పోలీసులు గుర్తించారు. శ్రద్ధాతో పరిచయం ఏర్పడిన డేటింగ్ యాప్‌ ద్వారానే ఆమె కూడా కలిసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఉమ్రాన్‌ మాలిక్‌ టీ20ల కంటే వన్డేలకే సరిపోతాడు: వసీం జాఫర్‌

టీమ్‌ఇండియా యువ ఫాస్ట్‌బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్ టీ20ల కంటే వన్డేలకే సరిపోతాడని భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్‌ అభిప్రాయపడ్డాడు. శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఉమ్రాన్‌ వన్డేల్లోకి అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తన మొదటి ఐదు ఓవర్లలో 19 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టిన ఉమ్రాన్‌ తర్వాతి ఐదు ఓవర్లలో మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. వాట్సప్‌ డేటా లీక్‌.. అమ్మకానికి 50కోట్ల మంది ఫోన్‌ నంబర్లు!

ఫేస్‌బుక్‌కు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సప్‌ (WhatsAPP) నుంచి భారీగా డేటా లీక్‌ (Data Breach) అయ్యింది. దాదాపు 50కోట్ల మంది వాట్సప్‌ యూజర్ల ఫోన్‌ నంబర్లు ఆన్‌లైన్‌లో విక్రయానికి ఉంచినట్లు తాజాగా సైబర్‌న్యూస్‌ నివేదిక వెల్లడించింది. అమెరికా సహా పలు దేశాలకు చెందిన యూజర్ల నంబర్లను హ్యాకర్లు అమ్మకానికి ఉంచినట్లు తెలిసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఆ ఆస్ట్రేలియా యువతి హత్య వెనక అసలు కారణమదే..!

నాలుగేళ్ల క్రితం ఆస్ట్రేలియాలో ఓ యువతిని హత్య చేసి భారత్‌లో తలదాచుకుంటున్న నిందితుడు రాజ్‌విందర్‌ సింగ్‌ను దిల్లీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అసలు ఆ యువతిని హత్య చేయడానికి గల కారణాలను దర్యాప్తు బృందం వెల్లడించింది. తన భార్యతో గొడవపడి నిందితుడు రాజ్‌విందర్ సింగ్‌(38) క్వీన్స్‌లాండ్‌లోని వాంగెట్టి బీచ్‌కు వెళ్లాడు. ఆ సమయంలో వెంట కొన్ని పండ్లు, కూరగాయల కత్తిని తీసుకెళ్లాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అదే జరిగితే.. నేనే ఓ స్మార్ట్‌ఫోన్‌ తీసుకొస్తా!: మస్క్‌

ట్విటర్‌ చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌ మరో ట్వీట్‌తో వార్తల్లో నిలిచారు. ఒకవేళ గూగుల్‌, యాపిల్‌ కంపెనీలు తమ యాప్‌ స్టోర్‌ల నుంచి ట్విటర్‌ను తొలగిస్తే.. ప్రత్యామ్నాయంగా తానే స్మార్ట్‌ఫోన్‌ తీసుకొస్తానని తెలిపారు. యాపిల్‌, గూగుల్‌ల మార్గదర్శకాలను పాటించడంలో విఫలమైతే.. వాటి యాప్ స్టోర్‌ల నుంచి ట్విటర్‌ను తొలగించే అవకాశం ఉందని ట్విటర్‌ ట్రస్ట్‌, సేఫ్టీ విభాగం మాజీ అధిపతి యేల్‌ రోత్‌ ఇటీవల వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ‘వారి మృతికి కరోనా ఆంక్షలే కారణం’..! చైనాలో భగ్గుమన్న నిరసనలు

కరోనా కఠిన ఆంక్షలపై చైనాలోని షింజియాంగ్‌ ప్రాంతం భగ్గుమంది! జీరో కొవిడ్‌ చర్యలను నిరసిస్తూ.. ఇక్కడి రాజధాని నగరం ఉర్ముచీలో పౌరులు భారీ నిరసనలకు దిగారు. కొవిడ్‌ లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలంటూ నినాదాలు చేశారు. గురువారం రాత్రి స్థానికంగా ఓ అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగి దాదాపు 10 మంది మృతి చెందారు. అయితే, కరోనా ఆంక్షల కారణంగానే వారు బయటకు రాలేని పరిస్థితుల్లో అగ్నికి ఆహుతయ్యారని ఆరోపణలు రావడం.. పౌరుల ఆగ్రహానికి కారణమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఆరోగ్య బీమాలో సబ్‌ లిమిట్స్‌తో షాక్‌ తగలొచ్చు.. జాగ్రత్త!

ఆరోగ్య బీమా ప్రస్తుతం తప్పనిసరి అవసరంగా మారింది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చినప్పుడు డబ్బు కోసం ఇబ్బంది పడకుండా ఆరోగ్య బీమా సాయపడుతుంది. చాలా మంది పాలసీనయితే కొనుగోలు చేస్తున్నారు కానీ పాలసీకి వర్తించే నియమనిబంధనలను మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ఒక్కోసారి అధిక మొత్తంలో బీమా కవరేజీ ఉన్నా క్లెయిం సమయంలో కొంత జేబు నుంచి ఖర్చు చేయాల్సి వస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు