Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 09 Jul 2024 08:59 IST

1. ఒకే గదిలో.. 2 పాఠశాలలు.. 10 తరగతులు.. 70 మంది విద్యార్థులు

ఒక గదిలో రెండు తరగతులు నిర్వహించడం అక్కడక్కడ జరుగుతుంటుంది. మంచిర్యాల జిల్లా భీమిని మండలం కేస్లాపూర్‌ అనుబంధ గ్రామం గట్టుపల్లిలో మాత్రం ఒకే గదిలో ఏకంగా రెండు పాఠశాలలను నిర్వహిస్తున్నారు. కేస్లాపూర్‌ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో కూల్చేశారు. అక్కడి విద్యార్థులను అదే పంచాయతీలోని గట్టుపల్లి పాఠశాలకు తరలించారు. పూర్తి కథనం

2. ఐటీఐల్లో బోధకుల కొరత

మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రం(ఐటీఐ)లో మొత్తం 11 ట్రేడ్‌లు ఉన్నాయి. ఇక్కడ ఏటా 360 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మంజూరైన బోధకుల పోస్టులు 26 కాగా.. పనిచేస్తున్నవారు 11 మంది మాత్రమే. కీలకమైన డిప్యూటీ టెక్నికల్, సహాయ టెక్నికల్‌ అధికారుల పోస్టులు 21 ఉండగా.. తొమ్మిది మందే ఉన్నారు. పూర్తి కథనం

3. పోలీసులకే కష్టమొస్తే..!

సామాన్యులకు సమస్యలుంటే పోలీసులకు చెప్పుకొంటారు. మరి వారికే కష్టమొస్తే..? అది కూడా పైఅధికారుల నుంచైతే..? ఆ బాధ ఎవరితో పంచుకోవాలి, ఎలా బయటపడాలి? ధైర్యం ఉన్నవాళ్లు బదిలీ చేయించుకుని వెళ్లిపోవడమో, సెలవు పెట్టడమో చేస్తుంటారు. పూర్తి కథనం

4. ప్రకృతి గుండెలపై విషం

నకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదముషిడివాడలోని బచ్చలబందలో ఫార్మా వ్యర్థ రసాయనాల పారబోత సోమవారం కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు సుమారు 35కు పైగా డ్రమ్ములతో రసాయన వ్యర్థాలను ఆదివారం అర్ధరాత్రి తీసుకొచ్చి బచ్చలబందలో పారబోశారు. భరించలేని దుర్వాసనతో పాటు వికారంగా ఉండడంతో గ్రామస్థులు, పశువుల కాపరులు ఇబ్బందులు పడ్డారు.  పూర్తి కథనం

5. కర్నూలు అడవుల్లో పర్యావరణ విధ్వంసం

ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలోని ఓర్వకల్లు, పాణ్యం మండలాల పరిధిలోని గని అడవుల్లో గ్రీన్‌కో సంస్థ హైడల్‌ ప్రాజెక్టు నిర్మాణం పేరిట పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతోందని అధికారులు గుర్తించారు. అటవీప్రాంతాన్ని నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఆక్రమించినట్లు గుర్తించారు.  పూర్తి కథనం

6. నిర్లక్ష్యం నిప్పై.. నిలువెల్లా ముప్పై..

న్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం బూదవాడలోని అల్ట్రాటెక్‌ యాజమాన్యం వైఖరికి నిరసనగా గ్రామస్థులు కర్మాగారం వద్దకు దూసుకొచ్చారు. పరిహారం ప్రకటనపై సాచివేత ధోరణిపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద సంఖ్యలో సోమవారం ఉదయం ఫ్యాక్టరీని చుట్టుముట్టి.. లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.  పూర్తి కథనం

7. అభయారణ్యంలో అరుదైన జాతి

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల పరిధిలోని కోరింగ వన్యప్రాణి అభయారణ్యంలో నీటి పిల్లుల (ఫిషింగ్‌ క్యాట్‌) గణనపై అటవీశాఖ దృష్టిసారించింది. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఇటీవల కాకినాడ కలెక్టరేట్‌లో అటవీశాఖపై సమీక్ష నిర్వహించారు. అరుదైన నీటి పిల్లులు కోరింగలో ఉన్నాయని ఆ శాఖ అధికారులు తెలపడంతో వాటి పూర్వాపరాలను పవన్‌ ఆసక్తిగా తెలుసుకున్నారు. వీటి గణన తేల్చి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని ఆదేశించారు.  పూర్తి కథనం

8. మద్యం, మాంసాహారానికి మత్స్యకారులు దూరం..

మద్యం, మాంసాహారానికి మత్స్యకారులు దూరమవుతున్నారు. ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తున్నారు. గుండెల్లో గుడి కట్టి, శ్వాసమీద ధ్యాస ఉంచి ధ్యానం వైపు అడుగుల వేయడమే నిజమైన భక్తిగా చెబుతున్నారు. పూర్తి కథనం

9. కుర్చీ వదలరు.. డీజిల్‌ తాగేస్తారు

పదోన్నతి వస్తే ఎగిరి గంతేసే అధికారులను చూస్తుంటాం. జీహెచ్‌ఎంసీ దోమల విభాగంలో పని చేస్తోన్న సీనియర్‌ ఎంటమాలజిస్టుల(ఎస్‌ఈ) తీరు అందుకు విరుద్ధంగా ఉంది. రెండేళ్ల కిందట.. ఓ అధికారికి రంగారెడ్డి జిల్లా, మరో అధికారికి ఖమ్మం జిల్లా డీఎంఓలుగా పదోన్నతి వచ్చింది. పూర్తి కథనం

10. రామప్ప సోమసూత్రం మళ్లీ మొదటికి..

రామప్ప ఆలయ నిర్మాణం అద్భుతం. కాకతీయుల కాలంలో 40 ఏళ్ల పాటు శ్రమించి ఇసుక రాయి (సాండ్‌స్టోన్‌), కృష్ణశిలతో నిర్మించారు. రాతిస్తంభాలు, పైకప్పు, గోడలు, ప్రహరీ, శిల్పాలు ఇంటర్‌ లాకింగ్‌ వ్యవస్థతో అమర్చారు. గర్భగుడిలోని రామలింగేశ్వరుడిని (శివలింగం) అభిషేకించిన జలాలు బయటకు వెళ్లేలా ఏర్పాటు చేసిన సోమసూత్రాన్ని (శివలింగ అభిషేక జలాలు బయటకు వెళ్లే మార్గం) సైతం రాతితోనే నిర్మించారు. పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు