Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 27 Jun 2024 09:03 IST

1. రాజకీయ ప్రేరేపిత రౌడీషీట్లు ఎత్తేయండి

వైకాపా ఐదేళ్ల పాలనలో తెదేపా నేతలపై ఇష్టారాజ్యంగా పెట్టిన రౌడీషీట్లను ఎత్తేయాలని పోలీసు అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. నిజమైన రౌడీషీటర్ల విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించాలన్నారు. రాష్ట్రంలో నేరాల శాతం సున్నాగా ఉండాలన్నదే తన లక్ష్యమని ముఖ్యమంత్రి ప్రకటించారు. పూర్తి కథనం

2. హెల్మెట్‌ వినియోగాన్ని తప్పనిసరి చేయండి: ఏపీ ప్రభుత్వం, పోలీసులకు హైకోర్టు ఆదేశం

హెల్మెట్లు ధరించకపోవడంతో  ప్రమాదాలు జరిగినప్పుడు వాహన దారులు ప్రాణాలను కోల్పోతుండటాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. హెల్మెట్లు ధరించడం తప్పనిసరి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులను ఆదేశించింది. మోటారు వాహన చట్ట నిబంధనలు తు.చ. తప్పకుండా అమలయ్యేలా చూడాలని స్పష్టంచేసింది. పూర్తి కథనం

3. డ్రగ్స్, గంజాయి రక్కసి కోరలు పీకాల్సిందే

జగన్‌ జమానాలో మాదక ద్రవ్యాలకు, గంజాయికి కేంద్రంగా మారిపోయిన ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఆ మహమ్మారిని తరిమికొట్టాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వంపై ఉంది. ఊరూరా వేళ్లూనుకుపోయిన ఈ రక్కసి కోరలు పీకేందుకు పటిష్ఠ కార్యాచరణ అమలుచేయాలి. ఈ అంశంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం... సాగు నుంచి రవాణా, విక్రయం వరకూ ప్రతి దశలోనూ అష్టదిగ్బంధం చేస్తేనే గంజాయి లభ్యత, వినియోగం తగ్గుతాయి. పూర్తి కథనం

4. మీ కరెంటు బిల్లు ఎంతో తెలుసుకోండి ఇలా..

వినియోగించిన కరెంటుతో పోలిస్తే జారీచేసిన బిల్లు ఎక్కువ వచ్చిందనే అనుమానం ఉన్నవారు డిస్కం డిజిటల్‌ కాలిక్యులేటర్‌లో సరిచూసుకునే అవకాశం కల్పించినట్లు దక్షిణ తెలంగాణ పంపిణీ సంస్థ(డిస్కం) సీఎండీ ముషారఫ్‌ ఫరూఖి తెలిపారు.  పూర్తి కథనం

5. ముంబయి రైళ్లలో పశువుల తరలింపులా ప్రయాణాలు సిగ్గుచేటు : హైకోర్టు

లోకల్‌ రైళ్లలో ముంబయి ప్రయాణికులు పశువులను తరలిస్తున్నట్టుగా చేస్తున్న బలవంతపు ప్రయాణాలు చూసి సిగ్గు పడుతున్నట్లు బాంబే హైకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. అధిక రద్దీతో కూడిన బోగీల నుంచి కిందపడి రైల్వే ప్రయాణికులు మరణిస్తున్న ఉదంతాలు పెరుగుతున్న తీరుపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) వాదనలు విన్న ధర్మాసనం ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అంశంగా పేర్కొంది.  పూర్తి కథనం

6. ఎన్నాళ్లకెన్నాళ్లకు...!

అగనంపూడి టోల్‌గేటు వద్ద రుసుము వసూలు భారం నుంచి ఎట్టకేలకు నగరవాసులకు ఉపశమనం కలిగింది. జీవీఎంసీ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ఏళ్ల నుంచి సాగుతున్న అక్రమ దందాకు తెరపడడంతో ఇతర ప్రాంత వాహనదారులతో పాటు నగర ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి కథనం

7. చూద్దాంలే.. ఇద్దాంలే..!

వ్యవసాయ కనెక్షన్ల మంజూరులో తీవ్ర జాప్యం రైతులకు శాపంగా మారింది. బోర్లలో పుష్కలంగా నీరున్నా సకాలంలో విద్యుత్తు కనెక్షన్లు రాకపోవడంతో అన్నదాతకు అవస్థలు తప్పడం లేదు.. నియంత్రికలు ఉన్నప్పటికీ అనుబంధ పరికరాల కొరతతో కనెక్షన్లు ఇచ్చినా ప్రయోజనం లేదంటూ ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. పూర్తి కథనం

8. రూ.4కోట్ల 14లక్షల ఖర్చు.. ఉపయోగం సున్నా!

రైతులకు గ్రామస్థాయిలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలన్న లక్ష్యాన్ని నీరుగార్చారు వైకాపా ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, అధికారులు. ఉమ్మడి అనంత జిల్లాలో రైతులకు సీజన్‌ల వారీగా పంటల సాగు విత్తు నుంచి పంట కోత వరకు అవగాహన కల్పించేందుకు, డిజిటల్‌ లైబ్రరీకి సంబంధించిన సమాచారాన్ని అన్నదాతకు అందించేందుకు పలు ఆర్బీకేల్లో ఒక టీవీ, పెన్‌డ్రైవ్‌ ఇచ్చారు. పూర్తి కథనం

9. వీళ్లది భూదాహం.. ఆయనది ఎన్నికల వ్యూహం

కాకినాడ నగరంలోని కీలక ప్రాంతంలో ఉన్న భూదాన భూమిని కొట్టేయాలని వైకాపా నేతలు విశ్వప్రయత్నాలు చేశారు. ఇక్కడి చీడీలపొర ప్రాంతంలోని అయిదు ఎకరాల ఈ భూమిని పంచేసుకోవాలని పథక రచన చేశారు. నగరపాలక సంస్థ పాలక మండలి(2017-22)లో తెదేపా మేయర్‌ మార్పునకు సహకరిస్తే పలు ప్రయోజనాలు కల్పించడంతోపాటు ఆ స్థలాన్ని కట్టబెడతామని అప్పటి వైకాపా నేత ఆశ చూపారు. పూర్తి కథనం

10. పులివెందులకే రుణ సంతర్పణ!

మాజీ సీఎం జగన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులపై డీసీసీబీ అధికారులు తమ ప్రేమను చాటుకున్నారు. ఇతర ప్రాంతాల కంటే ఎక్కువగా రుణాలిచ్చి స్వామిభక్తిని ప్రదర్శించారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో పులివెందుల నియోజకవర్గంలోని మండలాల్లోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల పరిధిలో విరివిగా రుణాలు మంజూరు చేశారు. పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని