Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 28 Jun 2024 09:00 IST

1. అక్షరమే ఆయుధంగా పోరాడిన అసమాన యోధుడు

అసాధారణ వ్యక్తిత్వం, అకుంఠిత దీక్షతో ఎంచుకున్న ప్రతి రంగంలోనూ ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహోన్నత వ్యక్తి, సమాజ శ్రేయస్సే లక్ష్యంగా జీవించిన కర్మయోగి, ప్రజాకంటక పాలకులపై తుది శ్వాస వరకూ అక్షరమే ఆయుధంగా పోరాడిన అసమాన యోధుడు, విలువలకు నిలువెత్తు శిఖరం... రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావుకు ఆయన పుట్టినగడ్డ ఘన నివాళులర్పించింది. పూర్తి కథనం

2. తితిదేలో అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ

తితిదే నుంచే ప్రక్షాళన మొదలుపెడతామని తిరుమల తొలి పర్యటన సందర్భంగా స్పష్టం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. దానికి అనుగుణంగానే చర్యలు ప్రారంభించారు. తొలుత ఈవో ధర్మారెడ్డిని సాగనంపి.. ఆపై వైకాపా హయాంలో చేసిన ఖర్చులతోపాటు టికెట్ల కేటాయింపులో జరిగిన అక్రమాలను వెలుగులోకి తెచ్చేందుకు  ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. పూర్తి కథనం

3. 7,092 కిలోమీటర్ల మేర.. రోడ్లు గుంతలమయం

జగన్‌ ప్రభుత్వం గద్దె దిగిపోయినా.. వారి నిర్వాకం ఇంకా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూనే ఉంది. రహదారుల మరమ్మతులకు ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌లో ఆయా పద్దుల కింద నిధులేవీ కేటాయించకుండా వైకాపా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపింది. పూర్తి కథనం

4. తీరని ధరణి సమస్యలు!

భూ సమస్యల సమగ్ర పరిష్కారానికి కొత్త రెవెన్యూ చట్టం తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలులో ఉన్న ధరణి పోర్టల్‌ దరఖాస్తుల పరిష్కారంపైనా దృష్టి పెట్టింది.. ఈ క్రమంలో గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉంచిన అన్ని దరఖాస్తులను పరిష్కరించే దిశగా ఇప్పటికే కలెక్టర్‌లకు ఆదేశాలు జారీ చేసింది.  పూర్తి కథనం

5. సీతారామ ప్రాజెక్టు ట్రయల్‌ రన్‌ విజయవంతం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం భీమునిగుండం కొత్తూరు వద్ద నిర్మించిన సీతారామ ప్రాజెక్టు ఫేజ్‌-1 పంప్‌హౌస్‌ ట్రయల్‌ రన్‌ విజయవంతమైంది. ఈనెల 13న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు సీతమ్మసాగర్, సీతారామ ప్రాజెక్టులను సందర్శించిన సంగతి తెలిసిందే.  పూర్తి కథనం

6. అమర్‌నాథ్‌ యాత్రకు స్పాట్‌ రిజిస్ట్రేషన్‌ కేంద్రం ప్రారంభం

దక్షిణ కశ్మీర్‌ హిమాలయాల్లోని అమర్‌నాథ్‌ గుహాలయాన్ని సందర్శించేందుకు వచ్చే యాత్రికుల కోసం గురువారం నుంచి స్పాట్‌ రిజిస్ట్రేషన్ల కార్యక్రమం మొదలైంది. ఇందుకు జమ్మూలోని పురానీ మండి వద్ద రామమందిరం కాంప్లెక్స్‌లో కేంద్రాన్ని ప్రారంభించారు. పూర్తి కథనం

7. వనరుల దోపిడీకి వత్తాసు

వైకాపా పాలనలో పోలీసులే కాదు రెవెన్యూ, ఇంజినీరింగ్, అటవీ అధికారుల్లో చాలామంది అప్పటి నేతలతో అంటకాగి తిరిగారు. తమ పరిధిలో భూములు, సంపదను చేతనైనంతగా దోచిపెట్టారు. అక్రమ సంపాదనకు మార్గాలను చూపారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి నుంచి ఇంజినీరింగ్‌ విభాగంలో ఈఎన్సీ వరకు అంతా వైకాపా నేతలు చెప్పినట్టే తలూపారు.  పూర్తి కథనం

8. ఆర్‌యూలో అక్రమాల పర్వం

రాయలసీమ విశ్వవిద్యాలయం అక్రమాలకు అడ్డాగా మారింది.. వైఎస్సార్‌ జిల్లాకు చెందిన నేతలకు సన్నిహిత సంబంధాలున్న వారు పెత్తనం చేస్తున్నారు. వర్సిటీ పాలనలో కీలక పాత్ర పోషిస్తున్న ఉన్నతాధికారులు వైకాపా హయాంలో అడ్డగోలుగా పోస్టింగులు పొందారు. పూర్తి కథనం

9. ‘ఓ రాణీ’ వసూళ్ల పురాణం

ఆన్‌లైన్‌ మోసాలకు పశ్చిమ ప్రకాశం పుట్టినిల్లుగా మారింది. పదేళ్ల క్రితం హిమ్‌ సంస్థ ప్రజలను నమ్మించి నట్టేట ముంచింది. రెండు నెలల క్రితం ఆదాని అనే పేరుతో విస్తృతంగా చలామణి అయిన ఓ చరవాణి యాప్‌ కూడా జనాల జేబులను ఖాళీ చేసింది. పూర్తి కథనం

10. మా ఊరికి పెద్ద దిక్కు రామోజీరావు

‘మా పెదపారుపూడికి రామోజీరావే పెద్ద దిక్కు. ఆయన లేరంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం. ఆయన సొంతూరి గురించి ఎంతో ఆలోచించేవారు. మేం తరచూ ఆయనను కలిసేవాళ్లం. ఎప్పుడు కలిసినా ఊరిలో సౌకర్యాల గురించి, రామోజీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనుల గురించే అడిగేవారు. పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని