Updated : 09 Aug 2022 21:10 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. ఆస్తులేవీ లేవు.. ఉన్న కాస్త స్థలాన్ని విరాళంగా ఇచ్చిన ప్రధాని!

ప్రధాని నరేంద్ర మోదీ ఆస్తులు గతేడాది కంటే కాస్త పెరిగాయి. తన వద్ద ఉన్న భూమిని విరాళంగా ఇచ్చేయడంతో ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ రూ.2.23 కోట్లుగా ఉంది. ఏటా ఆస్తులు, అప్పులు వివరాలను వెల్లడిస్తున్న మోదీ.. ఈ ఏడాది మార్చి 31 నాటికి తన ఆస్తుల వివరాలను బహిర్గతం చేశారు. పీఎంవో వెల్లడించిన వివరాల ప్రకారం..

2.  ఎయిర్‌టెల్‌ 5జీ ప్లాన్‌ ఇదే..!

ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ తన 5జీ ప్లాన్‌ను ప్రకటించింది. ఆగస్టులోనే సేవలు ప్రారంభం కానున్నాయని పేర్కొంది. 2024 మార్చి నాటికి దేశవ్యాప్తంగా ఉన్న పట్టణాలు, ముఖ్యమైన గ్రామీణ ప్రాంతాలకూ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ గోపాల్‌ విఠల్‌ తెలిపారు. అదే సమయంలో టారిఫ్‌ల పెంపునకు సంకేతాలు ఇచ్చారు.

3. ఆంబోతుల్లా తిరుగుతుంటే చూస్తూ ఉండాల్సి వస్తోంది

హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యవహారంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఓ వెధవపని చేసి బహిరంగంగా ఎవ్వరం తిరగలేమన్న ఆయన.. సిగ్గులేని వాళ్లే చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు కులమతాలను అడ్డం పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. ఆంబోతులు బట్టలిప్పి తిరుగుతుంటే చూస్తూ ఉండాల్సి వస్తోందని ధ్వజమెత్తారు.

4. బిహార్‌ సీఎంగా నీతీశ్‌ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్‌!

ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌ రాజీనామాతో బిహార్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది. భాజపాతో తెగదెంపులు చేసుకున్న జేడీయూ అధినేత నీతీశ్‌ ఆర్జేడీ-లెఫ్ట్‌-కాంగ్రెస్‌ సారథ్యంలోని మహాఘట్‌బంధన్‌తో జట్టుకట్టారు. దీంతో బిహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు ముహూర్తం ఫిక్స్‌ అయింది. బుధవారం సాయంత్రం 4గంటలకు బిహార్‌ సీఎంగా నీతీశ్‌ కుమార్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

5. ఆ 5రోజులు తిరుమల యాత్ర వాయిదా వేసుకోండి.. తితిదే విజ్ఞప్తి

తిరుమల: ఆగస్టు 11 నుంచి 15వ తేదీ వరకు వరుస సెలవుల కారణంగా తిరుమలకు అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని తితిదే అంచనా వేస్తోంది. భక్తులు ప్రణాళిక బద్ధంగా దర్శనం, వసతిని ముందుగానే బుక్‌ చేసుకుని తిరుమలకు రావాలని కోరుతోంది. అధిక రద్దీ దృష్ట్యా ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు, వికలాంగులు తిరుమల యాత్ర వాయిదా వేసుకోవాలని తితిదే అధికారులు సూచిస్తున్నారు.

6. బిహార్‌లో రాజకీయ ఉత్కంఠ.. ఆసక్తికరంగా స్పీకర్‌ కొవిడ్ రిపోర్ట్‌..!

బిహార్‌లో భాజపా, జేడీయూ బంధానికి బీటలు వారిన నేపథ్యంలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఆరోగ్య పరిస్థితిపై వచ్చిన వార్తలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే..?

7. గోరంట్ల మాధవ్‌ను మేం రక్షించడం లేదు: హోం మంత్రి వనిత

వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ వీడియో వ్యవహారంపై ఏపీ హోంశాఖ మంత్రి తానేటి వనిత స్పందించారు. ఈ వ్యవహారంలో రాజకీయ కుట్ర ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. మాధవ్‌ వీడియో ప్రస్తుతం ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ పరిశీలనలో ఉందని.. త్వరలోనే నివేదిక వస్తుందన్నారు.

8. ‘అర్ష్‌దీప్‌ రూపంలో టీమ్‌ఇండియాకు అసలైన లెఫ్టార్మ్‌ బౌలర్‌ దొరికాడు’

యువ పేసర్‌ అర్ష్‌దీప్‌ రూపంలో టీమ్‌ఇండియాకు అసలుసిసలైన లెఫ్టార్మ్‌ పేసర్‌ దొరికాడని మాజీ వికెట్‌ కీపర్‌, ఛైర్మన్‌ ఆఫ్‌ సెలెక్టర్స్‌ కిరణ్‌ మోరే అభిప్రాయపడ్డారు. తాజాగా ఆసియాకప్‌ టోర్నీకి టీమ్‌ఇండియాను ఎంపిక చేసిన జట్టులో అర్ష్‌దీప్‌ను ఎంపిక చేసిన నేపథ్యంలో ఓ క్రీడాఛానల్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మాజీ పేసర్‌ జహీర్‌ఖాన్‌ తర్వాత టీమ్‌ఇండియాకు సరైన ఎడమచేతి వాటం బౌలర్‌ లేడనే విషయం తెలిసిందే.

9. రోజర్‌ ఫెదరర్‌.. ఐదేళ్ల కిందట హామీ.. తాజాగా నెరవేర్చి..

ఇవాళ ఇచ్చిన హామీని.. రెండు రోజులకో.. వారానికో మరిచిపోతుంటాం. అలాంటిది ఎప్పుడో ఐదేళ్ల కిందట ఓ చిన్నపిల్లవాడికి ఇచ్చిన ప్రామిస్‌ను నెరవేర్చాడు టెన్నిస్‌ అగ్రశ్రేణి ఆటగాడు రోజర్ ఫెదరర్‌. తాజాగా సర్‌ప్రైజ్‌ చేస్తూ తనతో ఆడాలనే యువకుడి కోరికను ఫెదరర్‌ తీర్చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే ఓ ఐదేళ్లు వెనక్కి వెళ్లాలి.

10. వాట్సాప్‌ నుంచి ప్రైవసీ ఫీచర్లు.. ఇక మీ ‘జాడ’ కనిపించదు!

పలు కారణాలతో కొందరు వాట్సాప్‌ గ్రూపుల్లో ఇరుక్కుపోతుంటారు. బయటకి వస్తే గ్రూప్‌ సభ్యులు ఏమనుకుంటారో అనే సందేహం. ఒకవేళ వెళ్లిపోతే ‘ఎందుకెళ్లిపోయావ్‌?’ అన్ని ప్రశ్నలు. దీంతో కక్కలేక మింగలేక ఆ గ్రూప్‌లో ఉండిపోవాల్సి వస్తుంది. ఇలాంటి వారి కోసమే వాట్సాప్‌ ఓ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. గ్రూపుల్లోంచి గుట్టుచప్పుడు కాకుండా జారుకునే సదుపాయం కల్పించింది.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని