Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 24 Jun 2024 16:59 IST

1. ఏపీ క్యాబినెట్‌ నిర్ణయాలివీ

మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్‌ చట్టం రద్దు, ఏప్రిల్‌ నుంచి పింఛను రూ.4వేలకు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన అంశాలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్తగా టెట్‌ నిర్వహణ, టెట్‌ లేకుండా డీఎస్సీ నిర్వహణ ప్రతిపాదనలపై చర్చించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. పవన్‌ కల్యాణ్‌తో తెలుగు సినీ నిర్మాతల భేటీ

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో తెలుగు సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. చిత్ర పరిశ్రమ సమస్యలు, రాష్ట్రంలో సినీరంగం విస్తరణకు ఉన్న అవకాశాలు, తదితర కీలక అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకొన్న నిర్మాతలు.. అక్కడి నుంచి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఓఆర్‌ఆర్‌ లోపల ఐటీ కంపెనీలకు ప్రాధాన్యం: మంత్రి శ్రీధర్‌బాబు

తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో మహిళా పారిశ్రామికవేత్తల పాత్ర ఎంతో కీలకమని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. హైదరాబాద్‌లో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ‘సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు - సమ్మిళిత అభివృద్ధి’ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.ఓఆర్‌ఆర్‌ లోపల ఐటీ కంపెనీలకు ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. జీవన్‌రెడ్డి తీవ్ర మనస్తాపం.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా యోచన!

ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ కాంగ్రెస్‌లో చేరిక ఆ పార్టీలో చిచ్చురేపింది. ఎమ్మెల్సీ పదవికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. ఈ విషయంపై తన అనుచరులు, పార్టీ శ్రేణులతో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు ఆయన్ను బుజ్జగించేందుకు ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ నేతలు జీవన్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పంచెకట్టు.. తెలుగులో ప్రమాణం: లోక్‌సభలో ఆకట్టుకున్న ఏపీ, తెలంగాణ ఎంపీలు

18వ లోక్‌సభ తొలి సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌ నిర్వహించారు. ఈసందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ (AP), తెలంగాణ రాష్ట్రాల ఎంపీలు తెలుగులో ప్రమాణం చేయడం విశేషం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఎమర్జెన్సీ ప్రకటించకుండానే కొనసాగింపు: ఖర్గే

ఎమర్జెన్సీపై పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధినేత మల్లిఖార్జున ఖర్గే స్పందించారు. ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధిస్తున్నామని ప్రకటించిన అనంతరం ప్రభుత్వం దానిని అమలుచేసిందన్నారు. కాని భాజపా పాలనలో ప్రధాని మోదీ ఎమర్జెన్సీని ప్రకటించకుండానే దానిని కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘హైకోర్టు తీర్పు వచ్చాకే..’ - కేజ్రీవాల్‌కు సుప్రీంలో లభించని ఊరట

మద్యం విధానానికి సంబంధించి మనీ లాండరింగ్‌ కేసులో బెయిల్‌ అంశంపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఈ అంశంపై హైకోర్టు నిర్ణయం వెలువడ్డాకే తమ తీర్పు ఉంటుందని.. అప్పటివరకు వేచి ఉండాలని న్యాయస్థానం సూచించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. బైజూస్‌లో ₹4 వేల కోట్ల పెట్టుబడి.. ఇప్పుడు సున్నా..!

ఆర్థికంగా కుదేలైన ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌లో భారీగా పెట్టుబడులు కుమ్మరించిన ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ ప్రోసస్‌ ఎన్‌వీ నిండా మునిగింది. ఆ కంపెనీ పెట్టుబడి ఇప్పుడు సున్నాకు చేరింది. తమకు 493 మిలియన్‌ డాలర్లు (భారతీయ కరెన్సీలో రూ.4 వేల కోట్ల పైమాటే) మేర నష్టం వాటిల్లినట్లు ఆ కంపెనీ నెదర్లాండ్స్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. హీరో మోటోకార్ప్‌ వాహన ధరలు పెంపు.. 1 నుంచి కొత్త ధరలు

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన వాహనాల ధరలను పెంచనుంది. ఎంపిక చేసిన మోటార్‌ సైకిళ్లు, స్కూటర్ల ధరలు పెంచుతున్నట్లు హీరో మోటోకార్ప్‌ సోమవారం తెలిపింది. గరిష్ఠంగా రూ.1500 వరకు ఈ పెంపు చేపడుతున్నట్లు పేర్కొంది. జులై 1 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఆసీస్‌ను కలవరపెడుతున్న వరుణుడు.. భారత్‌తో మ్యాచ్‌ రద్దైతే పరిస్థితేంటి?

సూపర్‌ 8 పోరులో (T20 World Cup Super-8) తమ చివరి మ్యాచ్‌లో తలపడేందుకు భారత్‌, ఆస్ట్రేలియా సిద్ధమవుతున్నాయి. మ్యాచ్‌ జరిగే ప్రాంతంలో రోజంతా వర్షం పడే అవకాశం ఉన్నట్లు ఆక్యూ వెదర్‌ రిపోర్టు అంచనా వేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దయితే.. పరిస్థితేంటి? పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని