Updated : 25 Apr 2021 17:10 IST

Top 10 News @ 5 PM

1. TS: ఎల్లుండి నుంచి పాఠశాలలకు సెలవులు

తెలంగాణలోని పాఠశాలు, జూనియర్‌ కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఏప్రిల్‌ 27నుంచి మే 31 వరకు సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. వేసవి సెలవుల నిర్ణయంపై సీఎస్‌, విద్యాశాఖ అధికారులతో సీఎం సమీక్షించినట్లు మంత్రి తెలిపారు. కరోనా విస్తరించిన నేపథ్యంలో సీఎం ఆదేశాల మేరకు ఇప్పటికే పదో తరగతి పరీక్షలను రద్దు చేసి 5,21,392 మంది విద్యార్థులను పాస్‌ చేసినట్లు గుర్తు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. పీఎంకేర్స్ ​నిధులతో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ ​ప్లాంట్లు

దేశంలో మెడికల్ ఆక్సిజన్ కొరతను అధిగమించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. దేశవ్యాప్తంగా 551 పీఎస్ఏ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం పీఎం కేర్స్ నిధులను వినియోగించనుంది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఆదివారం ప్రకటన విడుదల చేసింది. అన్ని జిల్లాలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రులలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* సీజేఐకు సుప్రీం బార్‌ అసోసియేషన్‌ లేఖ

3. CT Scan ధర నిర్ణయించిన ఏపీ సర్కార్‌

కొవిడ్‌ సంక్షోభాన్ని ఆసరాగా తీసుకుని ప్రైవేటు ఆస్పత్రులు, స్కానింగ్ కేంద్రాల్లో చేసే పరీక్షలపై అధికంగా వసూలు చేస్తున్న వారిపై ఏపీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. కరోనా బాధితులకు చేసే సీటీ స్కాన్‌, హెచ్‌ఆర్‌ సీటీ స్కాన్‌ల పేరుతో చేసే దోపిడీకి అడ్డుకట్ట వేసింది. ఈ మేరకు సీటీ స్కాన్‌ ధరను నిర్ణయిస్తూ రాష్ట్ర సర్కార్‌ ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్ అనుమానితులకు సీటీ లేదా హెచ్‌ఆర్‌ సీటీ స్కానింగ్‌కు గరిష్ఠంగా రూ.3వేలుగా ధరను నిర్ణయించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Vaccine: ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవు

అందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తయితే క్షేమంగా ఉండొచ్చని ఏఐజీ ఆస్పత్రుల ఛైర్మన్‌ డా.నాగేశ్వర్‌రెడ్డి అన్నారు. దేశంలో వ్యాక్సిన్‌ ఇవ్వడం కొంత ఆలస్యమైందని.. ప్రభుత్వాలు కూడా దీనిపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరముందన్నారు. ఈటీవీ ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది చివరినాటికి వ్యాక్సినేషన్‌ బాగా జరిగితే హెర్డ్‌ ఇమ్యూనిటీ వచ్చేస్తుందన్నారు. అపోహలు వీడి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని నాగేశ్వర్‌రెడ్డి సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

100% Vaccinated: వెల్‌డన్‌ మై బాయ్స్‌!

5. రోగనిర్థారణ కెమేరాలుగా శామ్‌సంగ్‌ గెలాక్సీ ‌ఫోన్లు!

పాత గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లను రోగ నిర్థారణ (మెడికల్‌ డయాగ్నోసిస్‌) కెమేరాలుగా మార్చనున్నట్లు టెక్‌ దిగ్గజం శామ్‌సంగ్‌ తెలిపింది. భారత్, వియత్నాం, మొరాకో, పపువా న్యూగినియా వంటి దేశాల్లో కంటి ఆరోగ్య సంరక్షణ మెరుగు పరచడానికి వీటిని వినియోగిస్తామని సంస్థ తెలిపింది. నేత్ర సమస్యలను గుర్తించే వైద్య పరికరాలను తయారు చేసేందుకు ఇంటర్నేషనల్‌ ఏజెన్సీ ఫర్‌ ది ప్రివెన్షన్‌ ఆఫ్‌ బ్లైండ్‌నెస్‌ (ఐఏపీబీ), యోన్సే యూనివర్సిటీ హెల్త్‌ సిస్టమ్‌ (వైయూహెచ్‌ఎస్‌)లతో శామ్‌సంగ్‌ భాగస్వామ్యం కుదుర్చుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Karthi Sardar: ‘సర్దార్‌’గా మారిన కార్తి

పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో కార్తి ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. నాలుగైదు నెలల క్రితం మొదలైన ఈ సినిమా పేరును చిత్రబృందం తాజాగా ప్రకటించింది. సినిమాకు ‘సర్దార్‌’ అనే పేరును ఖరారు చేస్తూ కర్టన్‌ రైజర్‌ను ఆవిష్కరించింది. ఈ ఫస్ట్‌లుక్ మోషన్‌ పోస్టర్‌ వీడియోను సామాజిక మాధ్యమాల వేదికగా దర్శకనిర్మాతలు విడుదల చేశారు. పొడవాటి జుట్టు, గుబురు తెల్ల గడ్డంతో సీరియస్‌ లుక్‌లో దర్శనమిచ్చి ఆసక్తి పెంచాడు కార్తి. జీవీ ప్రకాశ్‌ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ‘ధక్‌ ధక్‌ ధక్‌’.. ఇలా తెరకెక్కించారు

7. భారత్‌కు అదనపు సహకారం అందిస్తాం: యూఎస్‌

భారత్‌లో కరోనావైరస్‌ రెండో దశ ఉద్ధృతి చూస్తే హృదయం విదారకంగా ఉందని యూఎస్‌ ఆందోళన వ్యక్తం చేసింది. భారత ప్రభుత్వానికి తక్షణం అదనపు సహకారాన్ని అందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటొనీ బ్లింకెన్‌ శనివారం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ‘భారత్‌లో కరోనా కల్లోలం చూస్తుంటే హృదయ విదారకంగా అనిపిస్తోంది. కొవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వంలోని మా భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నాం’ అని బ్లింకెన్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Immunity కోసం ఈ ఆహారం తీసుకోవాలి!

కరోనా మహమ్మారిని పూర్తిగా నిర్మూలించేందుకు ఇప్పటి వరకు ఎలాంటి మందులూ రాలేదు. కొన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన మళ్లీ బూస్టర్‌ డోసు వేసుకోవాల్సి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ప్రాణాంతక విషపు వైరస్‌ నుంచి బయటపడాలంటే..మన ఒంట్లోని వ్యాధినిరోధక యంత్రాంగాన్ని బలోపేతం చేసుకోవడమే మార్గం. ఇమ్యూనిటీ బలంగా ఉంటే కరోనా వైరస్‌ మాత్రమే కాదు. ఇతరాత్ర చాలా జబ్బుల నుంచి కూడా కాపాడుకోవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

TIMSలో ఆక్సిజన్ కొరత లేదు: కిషన్‌రెడ్డి

9. మేడారం మహాజాతర తేదీలు ఖరారు

ఆసియా ఖండంలో జరిగే అతిపెద్ద ఆదివాసి మహాసమ్మేళనంగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర తేదీలు ఖరారయ్యాయి. మాఘమాసంలో నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా సమ్మక్క-సారలమ్మ మహాజాతరను నిర్వహిస్తారు. 2022లో జరగనున్న మేడారం మహాజాతర తేదీలను ఆలయ పూజారులు ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. డబ్బులు తిరిగి రావడానికి ఆలస్యమవుతోంది

కరోనా కారణంగా కంపెనీల మూలధన నిర్వహణపై ప్రభావం పడుతోంది. అగ్రగామి-500 నమోదిత కంపెనీల నగదు చక్రం ఆరు రోజుల పాటు పెరిగిందని కన్సల్టెన్సీ సంస్థ ఈవై అంటోంది. ‘ఒక కంపెనీ ముడి పదార్థాలు, ఇతర వనరులపై పెట్టిన పెట్టుబడులు.. విక్రయాల అనంతరం నగదు రూపంలో తిరిగి కంపెనీకి వచ్చే కాలాన్ని’ నగదు చక్రం (క్యాష్‌-టు-క్యాష్‌ )గా పరిగణిస్తారు. ఈవై నిర్వహించిన సర్వే ప్రకారం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

లైవ్‌బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని