Updated : 28 Apr 2021 17:09 IST

Top 10 News @ 5 PM

1. CoronaVaccine: సైడ్‌ ఎఫెక్ట్స్‌ స్వల్పమే!

ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్న వేళ.. కొందరిలో వ్యాక్సిన్‌పై భయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ల కలిగే దుష్ప్రభావాలు (సైడ్‌ ఎఫెక్ట్స్‌) స్వల్పమేనని బ్రిటన్‌ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో తేలింది. వ్యాక్సిన్‌ తీసుకున్న నలుగురిలో ఒకరికి మాత్రమే సైడ్‌ ఎఫెక్ట్స్‌ కనిపిస్తుండగా.. అవికూడా ఒకటి లేదా రెండు రోజుల్లోనే తగ్గిపోతున్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన పరిశోధనా పత్రం ‘ది లాన్సెట్‌’ జర్నల్‌లో ప్రచురితమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Corona Medicine: నోటి మాత్రపై ఫైజర్‌ దృష్టి!

2. TS Corona: ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాలి

గత వారం రోజులుగా తెలంగాణలో పరిస్థితులు కొంతమేర కుదుటపడుతున్నాయని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాస్‌ అన్నారు. కొవిడ్‌ కేసుల పెరుగుదలలో స్థిరత్వం కనిపిస్తోందని చెప్పారు. కోఠిలోని ఆ శాఖ ప్రధాన కార్యాలయంలో డీహెచ్‌ మీడియాతో మాట్లాడారు. కొవిడ్‌పై ప్రజలందరికీ ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలు సహకరిస్తున్నారని.. వచ్చే మూడు, నాలుగు వారాలు అత్యంత కీలకమన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మెరుగైన చర్యలు తీసుకోండి: ఏపీ హైకోర్టు

కొవిడ్‌ వ్యాప్తి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని మెరుగైన చర్యలు తీసుకోవాలని ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కరోనా నివేదికలు త్వరగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. గుంటూరుకి చెందిన సామాజిక కార్యకర్త తోట సురేష్ బాబు, ఏపీసీఎల్‌ఏ దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆరుప్‌కుమార్ గోస్వామి, జస్టిస్‌ సి. ప్రవీణ్ కుమార్‌ల ధర్మాసనం విచారణ జరిపింది. సుమారు రెండు గంటల పాటు విచారణ జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

CBN on AP Govt: 3 గంటల్లో బెడ్‌ ఎక్కడైనా ఇస్తున్నారా?

4. 617 రకాన్ని నిలువరిస్తున్న Covaxin: ఫౌచీ

ప్రస్తుతం భారత్‌లో నెలకొన్న పరిస్థితులు అంతర్జాతీయ అసమానతలకు నిదర్శనమని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్‌ కల్లోలంతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న భారత్‌కు సహకరించడంలో ధనిక దేశాలు విఫలమయ్యాయని ఆయన తప్పుపట్టారు. దేశవ్యాప్తంగా కొవిడ్ మరణాలు రెండు లక్షల మార్కును దాటిన క్రమంలో.. ఫౌచీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రూ.100కోట్ల చిత్రం కంటే ప్రజాసేవతోనే సంతృప్తి

ప్రజలు ఆసుపత్రుల ముందు పడకల కోసం ఎదురు చూస్తుంటే వాళ్లను అలా చూస్తూ నిద్రపోలేనని ప్రముఖ నటుడు సోనూసూద్‌ అన్నారు. రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన సినిమాలో చేయడం కంటే ప్రజలకు సేవ చేయడంలోనే ఎక్కువ సంతృప్తి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కరోనా ఆపత్కాలంలో సోనూ.. ఎంతోమందికి సాయం చేసి ఆదుకుంటున్నారు. దీంతో ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా.. ట్విటర్‌ వేదికగా సోనూసూద్‌ను ట్యాగ్‌ చేస్తూ వేడుకుంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Seetimaar: ‘రాధే’ సీటీమార్‌ మేకింగ్‌ చూశారా?

6.  ఒకే కుటుంబం.. రూ.80వేల కోట్ల వారసత్వ పన్ను!

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం శాంసంగ్‌ మాజీ ఛైర్మన్‌ లీ కున్‌ హీ కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది. వారసత్వ పన్ను కింద అక్కడి ప్రభుత్వానికి 10.78 బిలియన్‌ డాలర్లు(సుమారు రూ.80 వేల కోట్లు) చెల్లించాలని నిర్ణయించింది. దీంతో లీ కున్‌ హీ వదిలివెళ్లిన ఆస్తుల విలువలో సగానికిపైగా వారసత్వ పన్ను రూపంలో ప్రభుత్వానికి చెందనుంది. ఈ చెల్లింపు ప్రక్రియ పూర్తయితే.. ప్రపంచంలోనే అత్యధిక వారసత్వ పన్ను చెల్లించిన వారిగా శాంసంగ్‌ వారసులు నిలుస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఏపీలో కొత్తగా 60కొవిడ్‌ కేంద్రాలు: ఆళ్లనాని

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం భేటీ ముగిసింది. కరోనా రోగులకు అందుతున్న వైద్యం, ఆక్సిజన్‌ సరఫరా, రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్ల కొరత, ఆస్పత్రుల్లో పడకల పెంపు, హెల్ప్‌డెస్క్‌పై ప్రధానంగా చర్చించారు. సమావేశం అనంతరం మంత్రి ఆళ్లనాని మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొత్తగా 60 కొవిడ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మరో 30 వేల కొవిడ్‌ పడకలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఆక్సిజన్‌ కొరత రాకుండా ముందస్తుగా అన్ని చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Lockdown: గోవాలో రేపటి నుంచి లాక్‌డౌన్

8. వరుసగా మూడోరోజూ లాభాల జోరు!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిశాయి. బుధవారం ఆద్యంతం లాభాల జోరును కనబరిచాయి. ఉదయం 49,066 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ 49,801 వద్ద గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు  789 పాయింట్ల లాభంతో 49,733 వద్ద ముగిసింది. నిఫ్టీ 211 పాయింట్లు లాభపడి 14,864  వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.89 వద్ద నిలిచింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9.  IPL: సన్‌రైజర్స్‌ నిలిచేనా.?

ఒకటేమో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో టాప్‌-2లో ఉన్న జట్టు.. మరొకటేమో ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు ఓడిపోయి పాయింట్ల పట్టికలో ఆఖరికి పడిపోయిన జట్టు.. ఐపీఎల్‌ టోర్నీలో మరో ఆసక్తికర పోరుకు చెన్నై సూపర్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సిద్ధమయ్యాయి. దిల్లీలోని అరుణ్‌జైట్లీ మైదానంలో నేటి రాత్రి 7.30 గంటలకు ఈ రెండు జట్లూ తలపడనున్నాయి. మరి ఈ ఏడాది వరుస విజయాలతో దూసుకెళ్తున్న ధోనీసేన దూకుడుకు సన్‌రైజర్స్‌ చెక్‌ పెడుతుందా..? వార్నర్‌ సేన ప్లేఆఫ్‌ ఆశలను నిలబెట్టుకుంటుందా..? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Flubot: మొబైల్‌కి ‘కొరియర్‌’ మెసేజ్‌ వచ్చిందా?

వాట్సాప్‌ను వేదికగా చేసుకుని ఇటీవల స్కామ్‌ మెసేజ్‌లు ఎక్కువగా వస్తున్నాయి. మీకు ‘పింక్‌ వాట్సాప్‌’ కావాలా? అంటూ ఈ మధ్య ఒక లింక్‌ హల్‌చల్‌ చేసింది. చాలామంది ఈ లింక్‌ క్లిక్‌ చేసి వ్యక్తిగత సమాచారాన్ని పోగొట్టుకున్నారు.  ఈ స్పామ్‌ స్కామ్‌ ఇంకా సద్దుమణగక ముందే మరోసారి మాల్వేర్‌ స్కామ్‌ బయటికొచ్చింది. అయితే ఈసారి మెసేజ్‌ల రూపంలో వస్తున్నాయి. ఈ మాల్‌వేర్‌ పేరు ‘ప్లూ బాట్‌’. అసలేంటీ ఫ్లూబాట్‌, ఎలా వస్తుంది, వస్తే ఏం చేయాలో చూద్దాం!  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

ఇవీ చదవండి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని