
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన 10 వార్తలు
1. ఏపీలో ఇంటర్ ద్వితీయ ఫలితాలు విడుదల
ఏపీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. కరోనా విజృంభణతో ఈ ఏడాది పరీక్షలను రద్దు చేసిన ఇంటర్ విద్యామండలి.. పదో తరగతి మార్కులకు 30శాతం, ఇంటర్ ప్రథమ సంవత్సరానికి 70% వెయిటేజీతో మార్కులను కేటాయించింది.
ఏపీలో పాఠశాలలు పునఃప్రారంభం ఎప్పుడంటే..
2. ఏరోస్పేస్ రంగంలో అద్భుత అవకాశాలు: కేటీఆర్
రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో ఎదిగేందుకు తెలంగాణ రాష్ట్రంలో అద్భుత అవకాశాలున్నాయని.. ఈ రంగాల్లో మరిన్ని పెట్టుబడులకు కంపెనీలు ముందుకు రావాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదారాబాద్ తాజ్‌కృష్ణలో టాటా బోయింగ్ డిఫెన్స్ ఏరోస్పేస్ కంపెనీ విజయోత్సవ సభలో కేటీఆర్ పాల్గొన్నారు. టాటా బోయింగ్ హైదారాబాద్ ఫెసిలిటీలో తయారైన 100 AH-64 అపాచి ఫ్యూస్ లైజ్ డెలివరీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
3. విజయసాయి, జగతి పబ్లికేషన్స్ పిటిషన్లపై తీర్పు రిజర్వ్
జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఎంపీ విజయసాయి రెడ్డి, జగతి పబ్లికేషన్స్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. విజయసాయి రెడ్డి, జగతి పబ్లికేషన్స్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులు మొదట విచారణ జరపాలన్న సీబీఐ, ఈడీ కోర్టు ఉత్తర్వులు కొట్టివేయాలని కోర్టును కోరారు.
4. ఏపీ అప్పులపై కాగ్ ఆడిట్ జరిపించాలి: రఘురామ
ఆంధ్రప్రదేశ్‌లో అప్పుల విధానంపై కాగ్ ఆడిట్ జరిపించాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రధాని మోదీని కోరారు. రూ. 25వేల కోట్ల అప్పుపై పూర్తి స్థాయిలో కాగ్‌తో ఆడిట్ జరిపించాలని కోరుతూ ప్రధానికి లేఖ రాశారు. ప్రభుత్వం ఖర్చు చేసే నిధులకు రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ పేరిట ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు.
5. పెళ్లి గురించి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఫన్నీ సలహా
నెటిజన్లను ఆలోచింపజేసే సందేశాలతో ఎప్పుడు ఏదో ఒకటి పోస్ట్ చేస్తుంటారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. గతంలో ‘చిన్ని చిన్ని ఆశ.. చిన్నదాని ఆశ ’ అంటూ ఓ చిన్నారి మది కోరుకుంటున్న విషయాన్ని ఓ పవర్ ఫుల్ సందేశం ద్వారా వినిపించారామె. తాజాగా వివాహం, జీవితానికి సంబంధించిన ఫన్నీ సలహాలను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్టు చేశారు.
6. భారత్‌లో పోర్నోగ్రఫీ కట్టడికి చేసిన చట్టాలివే!
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను పోర్న్ రాకెట్లో కీలక సూత్రధారిగా పేర్కొంటూ ఇటీవల ముంబయి క్రైం బ్రాంచి పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ‘హాట్‌షాట్స్’ అనే పోర్న్ యాప్‌ను ఆయన నడుపుతున్నారనేది అభియోగం. ఇంతకీ మన దేశంలో పోర్నోగ్రఫీ కట్టడికి సంబంధించి ఎలాంటి చట్టాలు ఉన్నాయి. వాటికి ఎలాంటి శిక్షలు ఉన్నాయో చూద్దాం..
7. చేతులు కలిపిన కెప్టెన్-సిద్ధూ.. రాహుల్ హర్షం!
గతకొన్ని రోజులుగా పంజాబ్ కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత సంక్షోభానికి తెరపడింది. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన నవజోత్ సింగ్ సిద్ధూ ఎట్టకేలకు చేతులు కలిపారు. పార్టీ అధిష్ఠానం సూచనల మేరకు ఒకేతాటిపైకి వచ్చిన ఇద్దరు నేతలు మాటలు కలిపారు. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఇచ్చిన తేనీటి విందుకు సిద్ధూ హాజరయ్యారు.
టిబెట్‌లో అడుగుపెట్టిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్..!
హైదరాబాద్‌లో ఓవైపు జోరువాన కురుస్తోంది. మరోవైపు అదే జోరులో సినిమా షూటింగ్‌లూ కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సినిమా ప్రియులు ఎదురుచూస్తున్న భారీ సినిమాల చిత్రీకరణలు హైదరాబాద్‌లోనే జరుగుతున్నాయి. కేవలం టాలీవుడ్ సినిమాకే పరిమితం కాకుండా.. కోలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని పరిశ్రమల సినిమాలకు భాగ్యనగరం వేదికైంది. ఇంతకీ ఇక్కడ ఏ సినిమాలు చిత్రీకరణ జరుపుకొంటున్నాయో తెలుసా..?
9. లాభాల్లో ముగిసిన సూచీలు.. దుమ్మురేపిన జొమాటో!
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు ఓ దశలో నష్టాల్లోకి జారుకున్నాయి. కానీ, కీలక రంగాల నుంచి మద్దతు లభించడంతో తిరిగి పుంజుకుని ఇంట్రాడే గరిష్ఠాలను నమోదు చేశాయి. చివరకు సెన్సెన్స్ 138 పాయింట్ల లాభంతో 52,975 వద్ద స్థిరపడింది.
10. టాస్ గెలిచిన గబ్బర్.. ఐదుగురు ఆటగాళ్లు అరంగేట్రం
భారత్, శ్రీలంక మూడో వన్డే టాస్ వేశారు. టాస్ గెలిచిన టీమ్ఇండియా సారథి శిఖర్ ధావన్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అనుకున్నట్టుగానే ఈ పోరులో ఐదుగురు ఆటగాళ్లు అరంగేట్రం చేస్తున్నారు. సంజు శాంసన్, నితీశ్ రాణా, చేతన్ సకారియా, కృష్ణప్ప గౌతమ్, రాహుల్ చాహర్ తొలి వన్డే ఆడబోతున్నారు.