Updated : 27/11/2021 17:12 IST

Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. IND vs NZ : మూడోరోజు ఆధిక్యం టీమ్‌ఇండియాదే.. కానీ చివర్లో కాస్త తడబాటు

కివీస్‌ను కట్టడి చేసి స్వల్ప ఆధిక్యం సాధించామన్న ఆనందం టీమ్‌ఇండియాకు కాసేపు కూడా లేదు. 49 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (1)ను కివీస్‌ బౌలర్‌ జేమీసన్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. జేమీసన్‌కిది 50వ టెస్టు వికెట్‌ కావడం విశేషం. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ వికెట్‌ నష్టానికి 14 పరుగులు చేసింది. దీంతో ఇప్పటివరకు టీమ్‌ఇండియా 63 పరుగుల లీడ్‌లో కొనసాగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Omicron: దక్షిణాఫ్రికా నుంచి వచ్చే విమానాల్లో డజన్ల కొద్దీ కరోనా కేసులు..!

దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దీంతో అప్రమత్తమైన దేశాలు.. మళ్లీ ప్రయాణ ఆంక్షల బాటపట్టాయి. దక్షిణాఫ్రికా నుంచి వచ్చే విమానాల్లో ప్రయాణికులకు విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తున్నాయి. అయితే ఈ విమానాల్లో డజన్ల కొద్దీ కరోనా కేసులు బయటపడుతుండటం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్‌ బయటపడగానే నెదర్లాండ్స్‌ ప్రభుత్వం ఆ దేశం నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Omicron strain: ‘దక్షిణాఫ్రికా నుంచి వచ్చారా.. క్వారంటైన్‌లో ఉండండి’

3. Center: రైతు సమస్యలు వినేందుకు కమిటీ..కేంద్రం కీలక ప్రకటన 

రైతు సమస్యలపై చర్చించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం శనివారం ప్రకటించింది. దానికింద పంటల వైవిధ్యీకరణ, జీరో బడ్జెట్ ఫార్మింగ్, కనీస మద్దతు ధర వంటి పలు సమస్యలపై చర్చించనున్నారు. ఈ కమిటీలో రైతు సంఘాలకు చెందిన ప్రతినిధులు కూడా భాగమవుతారని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ వెల్లడించారు. రైతు సమస్యలపై చర్చించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారని తోమర్ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. సింపథీ పని చేయదు.. అందుకోసం ఆయన ఏడ్చేశారంటే నమ్మను: ఉండవల్లి

ఇటీవల ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబంపై  వైకాపా మంత్రులు చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ స్పందించారు. చంద్రబాబు కన్నీరు పెట్టుకోవడం ఓ డ్రామాగా తాను భావించడంలేదన్నారు. అయితే ఆయన అంతగా స్పందించాల్సిన అవసరమూ లేదని అభిప్రాయపడ్డారు. మంత్రుల మాటలు పూర్తి అవాస్తవమని రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసన్నారు. చంద్రబాబు కేవలం సానుభూతి కోసమే అలా చేశారని అందరూ భావిస్తున్నారని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

AP News: పాలనలో సీఎం జగన్‌ పెద్ద ఫెయిల్యూర్‌: ఉండవల్లి

5. corona virus: ఆ కాలేజీలో 281మంది విద్యార్థులకు కరోనా!

కర్ణాటక వాణిజ్య నగరి ధార్వాడలోని ఎస్‌డీఎం వైద్య కళాశాల ప్రాంగణం కరోనాతో హడలిపోతోంది. ఈ కళాశాలలో కొత్తగా మరో 77మందికి వైరస్‌ సోకింది. దీంతో ఇప్పటివరకు ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 281కి చేరింది. కేసులు పెరుగుతుండటంతో కళాశాలలో కొత్త అడ్మిషన్లను తాత్కాలికంగా రద్దు చేశారు. కళాశాల ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల్ని మూసివేశారు. కొవిడ్ నెగెటివ్‌ వచ్చిన వారిని డిశ్చార్జి చేయనున్నారు. కొవిడ్‌ సోకినవారిలో అత్యధికులు టీకా రెండు డోసులూ తీసుకున్నవారే ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. TS News: వరి కొనకపోతే తెరాస, భాజపాకు ఉరే : రేవంత్‌రెడ్డి

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్‌ పోరు కొనసాగిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో వినతి పత్రాలు, కల్లాల్లో కాంగ్రెస్‌ పేరిట నిరసనలు తెలిపిన ఆ పార్టీ వరి దీక్ష పేరుతో మరోసారి ఆందోళన చేపట్టింది. కిసాన్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్‌లో రెండ్రోజుల పాటు దీక్ష కొనసాగనుంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... ధాన్యం రాశుల వద్ద చనిపోయిన రైతులకు కనీసం రైతు బీమా కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. రూ.లక్ష కోట్లతో ప్రాజెక్టులు కట్టామని చెబుతున్న కేసీఆర్.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* TS News: కాంగ్రెస్‌ వరిదీక్షలో ఆసక్తికర సన్నివేశం!

7. Omicron: జిన్ పింగ్‌కు ఇబ్బంది కలగకూడదని.. ఒమిక్రాన్‌ అని పేరు పెట్టారట..!

దశలవారీగా కరోనా వైరస్ విజృంభణతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రపంచం.. ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటోంది. ఈ లోపే దక్షిణాఫ్రికా నుంచి ఒమిక్రాన్ (Omicron) రూపంలో మహమ్మారి కొత్త అవతారం ఎత్తింది. వెలుగుచూసిన రెండు రోజుల్లోనే ఆసియా, ఐరోపా ఖండాలకు విస్తరించింది. వేగంగా విస్తరిస్తోన్న ఈ వైరస్‌పై ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా.. కరోనా వైరస్ మొదట వెలుగుచూసిన రకానికి ఇప్పటికి పలు మార్పులు చోటుచేసుకున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. AP News: చర్చిలకు ఎంపీల్యాడ్స్‌ నిధుల ఖర్చుపై నివేదిక ఏదీ?: కేంద్రం

ఆంధ్రప్రదేశ్‌లో చర్చిలకు ఎంపీ ల్యాడ్స్‌ నిధుల ఖర్చుపై నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం మరోసారి ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర గణాంకాలు, ప్రణాళిక మంత్రిత్వశాఖ డైరెక్టర్‌ రమ్య ఏపీ సీఎస్‌, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శులకు లేఖ పంపారు. ఎంపీలకు ఏటా ఇచ్చే నిధుల్లో రూ.40లక్షలకు పైగా నిధుల్ని ఎంపీ నందిగామ సురేశ్‌ చర్చిలకు వినియోగించినట్టుగా మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా రెండు నెలల క్రితం వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు పీఎంవోకు లేఖ రాశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

AP News: జగన్‌ ఎవరో బెదిరిస్తే బెదిరిపోయే సీఎం కాదు: వెంకట్రామిరెడ్డి

9. Pragyajaiswal: ప్రగ్యా ప్రమేయం లేకుండానే బంపర్‌ ఆఫర్‌ చేజారిందా?

కెరీర్‌లో విజయాన్ని సొంతం చేసుకునేందుకు ఎంతో ప్రయత్నిస్తున్నారు నటి ప్రగ్యాజైశ్వాల్‌. ప్రస్తుతం ‘అఖండ’ ప్రమోషన్స్‌లో ఫుల్‌ బిజీగా పాల్గొంటున్న ప్రగ్యా గురించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. అనుకోని కారణాల వల్ల తన ప్రమేయం లేకుండానే ఓ బంపర్‌ ఆఫర్‌ చేజారిందట. బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అంతిమ్‌: ది ఫైనల్‌ ట్రూత్‌’. మహేశ్‌ మంజ్రేకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయుష్‌ శర్మ కీలకపాత్ర పోషించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. క్రెడిట్‌ కార్డు తీసుకోవాలనుకుంటున్నారా? వార్షిక రుసుములు లేని కార్డులివే..!

ఆర్థిక అవ‌స‌రాలు తీర్చడంలోనూ, వ‌స్తు, సేవ‌ల చెల్లింపులకు అనుకూలంగా ఉన్నందున క్రెడిట్‌కార్డులు ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ పొందుతున్నాయి. తెలివిగా ఉప‌యోగించ‌డం వ‌ల్ల క్రెడిట్ స్కోరు మెరుగుప‌ర్చుకోవ‌చ్చు. ఆఫ‌ర్లు, క్యాష్‌బ్యాక్‌లు, రివార్డు పాయింట్ల‌ను అందిపుచ్చుకోవచ్చు. అవాంత‌రాలు లేకుండా ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ మోడ్‌లో లావాదేవీలు చేసేందుకు వీలున్నందున అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో డ‌బ్బు అవ‌స‌ర‌మైన‌ప్పుడు కూడా క్రెడిట్ కార్డును ఉప‌యోగించుకోవ‌చ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Airtel: ఎయిర్‌టెల్‌ అదనపు డేటా కూపన్ల ఉపసంహరణ.. ఎందుకంటే

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని