Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 07 Dec 2021 17:12 IST

1. Omicron: తగిన చర్యలు తీసుకోకపోతే.. భారీగా మూడో ముప్పు రావొచ్చు..!

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలవరం పుట్టిస్తోన్న వేళ.. కరోనా టీకా అదనపు డోసులపై ప్రకటన చేయాలని ది ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ప్రభుత్వాన్ని కోరింది. వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌, బలహీన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులకు అదనపు డోసు ఇవ్వాలని సూచించింది. అలాగే 12 నుంచి 18 ఏళ్ల వయసు వారికి టీకాలు వేసే ప్రతిపాదనను వేగంగా పరిశీలించాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగుచూసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Omicron Variant: ఒమిక్రాన్‌ కలవరం.. దేశంలో మళ్లీ లాక్‌డౌన్‌ అవసరమేనా?

2. Modi: మారండి.. లేదంటే మార్పులు తప్పవు: ఎంపీలకు మోదీ వార్నింగ్..‌!

పార్లమెంట్‌ సమావేశాల్లో భాజపా ఎంపీల గైర్హాజరుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన పార్టీ పార్లమెంటరీ సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించిన ప్రధాని.. ఎంపీలకు గట్టి వార్నింగ్‌ ఇచ్చినట్లు సమాచారం. ఎంపీలు ఇకనైనా తమ ప్రవర్తన మార్చుకోవాలని, లేదంటే మార్పులు తప్పవని మోదీ హెచ్చరించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. తెలంగాణలో రూపాయికి కిలో బియ్యం రద్దు చేస్తారా?: కిషన్‌రెడ్డి

తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయట్లేదంటే రూపాయికి కిలో బియ్యం రద్దు చేయడమేనని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రూపాయికి కిలో బియ్యం ఇవ్వాలంటే రాష్ట్రం ధాన్యం సేకరించాల్సిందేనని స్పష్టం చేశారు.  బాయిల్డ్‌ రైస్‌ విషయంలో కేంద్రానికి కొన్ని ఇబ్బందులున్నాయన్నారు. కేంద్రం రా రైసు కొనుగోలు చేస్తుంది... కొనుగోలు చేయం అని ఎప్పుడైనా చెప్పిందా? అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

TS News: కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం: కె.కేశవరావు

4. UAE: ఇక యూఏఈలో నాలుగున్నర రోజులే పనిదినాలు..!

ది యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ కీలక నిర్ణయం తీసుకొంది. ప్రపంచ మార్కెట్లతో మరింత అనుసంధానం అయ్యేందుకు వీలుగా శని, ఆదివారాలను వారాంతపు సెలవు దినాలుగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ దేశ అధికారిక మీడియా డబ్ల్యూఏఎం వెల్లడించింది. ఇక్కడ మొత్తం నాలుగున్నర రోజులు మాత్రమే పనిదినాలు ఉంటాయని పేర్కొంది. ఈ నిర్ణయం వచ్చే ఏడాది నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. NPS: నెల‌కు రూ. 10 వేలు మ‌దుపు చేస్తూ రూ. 1.5 ల‌క్ష‌ల నెల‌వారి పెన్ష‌న్ పొందడం ఎలా?

సంపాదిస్తున్న వ్య‌క్తి.. ఆర్థిక అత్య‌వ‌స‌ర ప‌రిస్థితులు, ప‌ద‌వీ విర‌మ‌ణ, ఇత‌ర ల‌క్ష్యాలను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని పోర్ట్‌ఫోలియో నిర్మించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప‌ద‌వీవిర‌మ‌ణ జీవితం కోసం మ‌దుపు చేసేవారు నేష‌న‌ల్ పెన్ష‌న్ సిస్ట‌మ్‌(ఎన్‌పీఎస్‌)ను త‌మ ఆర్థిక ప్ర‌ణాళిక‌లో భాగం చేయ‌వ‌చ్చు. సీనియ‌ర్ సిట‌జ‌న్ల‌కు రెండు ర‌కాలుగా ఉపయోగ‌ప‌డే పెట్టుబ‌డి సాధ‌నం ఇది. ఎన్‌పీఎస్‌లో మ‌దుపు చేస్తే.. మెచ్యూరిటీ మొత్తం నుంచి గ‌రిష్టంగా 60 శాతం మొత్తాన్ని.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

స్టాక్‌ మార్కెట్‌ సూచీల్లో లాభాల జోరు

6. Ts News: విద్యాసంస్థల్లో కరోనా వ్యాప్తిపై ఆందోళన వద్దు: సబిత ఇంద్రారెడ్డి

విద్యా సంస్థల్లో కరోనా వ్యాప్తిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, పకద్బందీగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితులు ఏమీ లేవని స్పష్టం చేశారు. పాఠశాలలు, వసతి గృహాల్లో నూరు శాతం రెండు డోసులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లాల అధికారులను మంత్రి ఆదేశించారు. కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్‌, ఒమిక్రాన్‌ వేరియంట్‌పై జడ్పీ కార్యాలయంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి సమీక్షించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Samantha: చైతూతో విడిపోయాక చనిపోతా అనుకున్నా!

అక్కినేని నాగచైతన్యతో విడిపోయిన రెండు నెలల తరువాత తొలిసారి విడాకులపై స్పందించారు నటి సమంత. ఓ జాతీయ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికీ బాధపడిన ఆ రోజులు  గుర్తున్నాయి. చైతూతో విడిపోతున్నప్పుడు కుంగిపోయి చనిపోతాననుకున్నాను. కానీ, నేను అనుకున్న దానికంటే శక్తిమంతం అయ్యాను. మన జీవితంలో కొన్నిరోజులు చెడుగా ఉన్నప్పుడు వాటిని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే వాటిని అంగీకరించి ముందుకు వెళ్తామో సగం పని అయినట్లే’’ అని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Sirivennela: ‘శ్యామ్‌ సింగరాయ్‌’ ..‘సిరివెన్నెల’ చివరి గీతమిదే..!

8. Uttar Pradesh: ప్రాక్టికల్స్‌ పేరిట పిలిపించి.. 17 మంది బాలికలపై వేధింపులు!
 ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం వెలుగుచూసింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ప్రిన్సిపలే.. విద్యార్థినులపై వేధింపులకు పాల్పడ్డాడు. ముజఫర్‌నగర్‌ జిల్లాలోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 17 మంది బాలికలపై ప్రిన్సిపల్‌తోపాటు అతని సహచరుడు వేధింపులకు పాల్పడినట్లు ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ప్రాక్టికల్స్‌ పేరిట తమను స్కూల్‌కి రప్పించి.. ఆహారంలో మత్తుమందు కలిపి, స్పృహ కోల్పోయాక.. ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు బాలికలు ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. IND vs NZ: వీరూ.. నా బౌలింగ్‌లో దంచికొట్టడం ఇంకా గుర్తుంది: అజాజ్‌

టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌.. ఒకానొక సమయంలో న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ బౌలింగ్‌లో దంచి కొట్టాడట. దాంతో బంతి మైదానం దాటి వెళ్లిందట. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. తాజాగా ఇరు జట్ల మధ్య జరిగిన రెండో టెస్టులో టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో అజాజ్‌ పది వికెట్లు తీసి కొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రతి ఒక్కరూ అతడి ఘనతను కీర్తిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

IND vs NZ: అజాజ్‌కు కొత్త గుర్తింపు తీసుకొచ్చిన అశ్విన్

10. Bitcoin: అందరినీ ఉత్కంఠ పెట్టిన ఉదంతమిది!

 ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన అంశాల్లో ఒకటి ఒమిక్రాన్‌ అయితే.. మరొకటి క్రిప్టోకరెన్సీ. ఈ డిజిటల్‌ కరెన్సీపై గత కొంత కాలంగా విస్తృత చర్చ జరుగుతోంది. నిషేధం.. నియంత్రణ.. పెట్టుబడులు.. ఇలా రోజూ ఏదో ఒక వార్త తెరమీదకు వస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. అమెరికాలో గత 10 రోజులుగా సాగుతున్న ఓ కేసు విచారణ అందరిలో ఆసక్తి రేకెత్తించింది. దీంట్లో వెలువడే తీర్పుతో బిట్‌కాయిన్‌ సృష్టికర్త సతోషి నకమోటో ఎవరో తేలిపోతుందని అంతా భావించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని