
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
1. తెలంగాణలో మరో కంపెనీ భారీ పెట్టుబడి
తెలంగాణలో మరో కంపెనీ భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. రాష్ట్రంలో రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు అలీయాక్సిస్ కంపెనీ ప్రకటించింది. దావోస్‌లో కేటీఆర్‌తో భేటీ అనంతరం తెలంగాణలో గ్రీన్ ఫీల్డ్ ఫెసిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అలీఆక్సిస్ కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. ఆశీర్వాద్ పైప్స్కు చెందిన అలీఆక్సిస్ కంపెనీ ప్లాస్టిక్ పైపులు, యాక్సెసరీస్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.
2. రేవంత్ నన్ను మామూలుగా బ్లాక్ మెయిల్ చేయలేదు: మంత్రి మల్లారెడ్డి
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తనను అడుగడుగునా బ్లాక్మెయిల్ చేస్తున్నారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నట్లు రేవంత్ తనపై చేసిన ఆరోపణలపై మంత్రి విరుచుకుపడ్డారు. తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయం కోసం భూములు కొన్న విషయం వాస్తవమే అయినా.. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మల్లారెడ్డి మండిపడ్డారు.
Video: ప్రపంచ శాంతి, సుస్థిరతను కాపాడేందుకు శక్తిగా అది పని చేస్తుంది: మోదీ
3. ఇక్కడి రైతులను గాలికొదిలేసి పంజాబ్ రైతులకు సాయమా?: ఈటల
రాష్ట్రమొస్తే నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయని ప్రజలు ఆశించారని.. రాష్ట్రం వచ్చాక ప్రజల ఆశలు అడియాశలయ్యాయని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లిలో పలు పార్టీల కార్యకర్తలు భాజపాలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పిన ఈటల.. పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఈటల మాట్లాడుతూ.. జెండాలు, పార్టీలు పక్కన పెట్టి రాష్ట్రం కోసం పోరాడినట్లు చెప్పారు. అంత చేసినా కల్వకుంట్ల కుటుంబం తప్ప రాష్ట్ర ప్రజలు బాగుపడలేదని విమర్శించారు.
4. అవినీతి ఆరోపణలు.. సీఎం ఆదేశంతో మంత్రి అరెస్టు!
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్ మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విజయ్ సింగ్లాను తాజాగా మంత్రివర్గం నుంచి తొలగించారు. మంత్రిపై ఆరోపణలు రావడం.. అందుకు సంబంధించి బలమైన సాక్ష్యాధారాలు కూడా లభించడంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా సింగ్లాపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
5. జపాన్‌లో మోదీ చిత్రం.. పిక్చర్ ఆఫ్ ది డే..!
క్వాడ్ సమావేశం నిమిత్తం జపాన్ వెళ్లిన ప్రధాని మోదీ.. తీరిక లేకుండా చర్చలు జరుపుతున్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పరస్పర సహకారాన్ని మెరుగుపర్చుకునేందుకు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా పాలకులతో భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగా వెలుగులోకి వచ్చిన చిత్రం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆ చిత్రంలో క్వాడ్ దేశాల నేతలంతా ఒకరితో ఒకరు ముచ్చటించుకుంటూ మెట్లు దిగుతూ ఉన్నారు. వారందరిలో మోదీ అందరికంటే ముందుగా నడుస్తుండగా.. ఆయన పక్కన జపాన్ ప్రధాని ఉన్నారు.
Video: బిత్తిరి సత్తి చిలక జోస్యం..రావిపూడి గుండెల్లో దడదడ!
6. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద దాడి..!
ప్రస్తుతం రష్యా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత డాన్‌బాస్‌పై అతిపెద్ద దాడిని జరపబోతోందని ఉక్రెయిన్ ఆందోళన వ్యక్తం చేసింది. వాస్తవానికి ఐరోపా ఖండంలో కూడా రెండోప్రపంచ యుద్ధం తర్వాత ఈ స్థాయిలో దాడులు జరగలేదని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి దిమిత్రి కులేబా వెల్లడించారు. ఆయుధ సరఫరాను వేగవంతం చేయాలని ఆయన మిత్రదేశాలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా మల్టిపుల్ రాకెట్ లాంఛ్ సిస్టమ్స్, దీర్ఘశ్రేణి శతఘ్నులను, ఆర్మర్డ్ పర్సనల్ క్యారియర్లను పంపించాలని కోరారు.
7. డ్రాగన్‌పై బైడెన్ గందరగోళాస్త్రం..!
తైవాన్.. అమెరికాకు సెమీకండెక్టర్లను సరఫరా చేసే కీలక దేశం. అటువంటి దేశం విషయంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఓ మాట మాట్లాడితే.. ఆయన అధికారిక నివాసం శ్వేతసౌధం పూర్తి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. తైవాన్ను ఆక్రమించేందుకు ఎదురు చూస్తోన్న చైనాకు ఏది నమ్మాలో అర్థం కావడం లేదు..! ఇలా ఒకసారి జరిగిందంటే ఏదో సమన్వయ లోపం అనుకోవచ్చు. కానీ, ఇప్పటికి మూడు సార్లు ఇదే విధంగా జరిగింది.
8. హత్యాయత్నం నుంచి తప్పించుకొన్న పుతిన్..!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన భద్రతా వలయం ఉంటుంది. దానిని దాటుకొని ఆయనపై హత్యాయత్నం జరిగినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. రెండు నెలల క్రితం పుతిన్ ఓ దాడి నుంచి తప్పించుకొన్నట్లు ఉక్రెయిన్ రక్షణశాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఉక్రెయిన్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ విభాగం అధిపతి కైర్‌యలో బుద్‌నోవ్ స్కైన్యూస్‌తో మాట్లాడుతూ వెల్లడించినట్లు ఉక్రెయినిస్కా ప్రావడా వెల్లడించింది.
Guntur: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం శేకూరు చెరువు వద్ద ఉద్రిక్తత
9. హార్దిక్ పాండ్య కెప్టెన్సీకి 100/100: మహ్మద్ కైఫ్
గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యకు 100కు 100 మార్కులిస్తానని అంటున్నాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్. ఈ సీజన్‌కు ముందు సుదీర్ఘకాలం ముంబయి జట్టులో కొనసాగిన అతడు ఆ జట్టు వదిలేయడంతో గుజరాత్ చేజిక్కించుకుంది. ఈ క్రమంలోనే అతడికి కెప్టెన్సీ కట్టబెట్టి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే, దీనిపై చాలా మంది అది సరైన నిర్ణయం కాదని తొలుత భావించారు. కానీ, హార్దిక్ అందివచ్చిన అవకాశాన్ని రెండు చేతులా సద్వినియోగం చేసుకున్నాడు.
10.మంకీపాక్స్‌లో మ్యుటేషన్‌పై WHO ఏమన్నదంటే..!
గత రెండున్నరేళ్లుగా కొవిడ్ మహమ్మారితో సతమతమవుతోన్న ప్రపంచ దేశాలను తాజాగా మంకీపాక్స్ కలవరపెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 100 కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో మంకీపాక్స్ మ్యుటేషన్ చెందిందని చెప్పడానికి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ కేసులు క్రమంగా పెరగడానికి కారణాలేంటనే దానిపై ఇంకా స్పష్టత లేదని పేర్కొంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Major: ఓటీటీలోకి ‘మేజర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
-
General News
HMDA: హెచ్ఎండీఏ ఈ-వేలానికి ఆదరణ.. తుర్కయాంజిల్‌లో గజం రూ.62,500
-
Politics News
Maharashtra Crisis: ఫడణవీస్ ఎందుకు సీఎం బాధ్యతలు చేపట్టలేదంటే?
-
World News
Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత!
-
Technology News
Android 12: ఆండ్రాయిడ్ 12 యూజర్లకు గూగుల్ మరో కొత్త యాప్
-
General News
Cesarean Care: శస్త్రచికిత్స తర్వాత ఏం జరుగుతుందంటే...!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Maharashtra Crisis: ఫడణవీస్ ఎందుకు సీఎం బాధ్యతలు చేపట్టలేదంటే?
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్‌ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో మీటింగ్.. అభిమాని భావోద్వేగం
- Eknath Shindhe: నాడు ఆటో నడిపారు.. ఇకపై మహారాష్ట్రను నడిపిస్తారు..
- YSRCP: గన్నవరం వైకాపాలో 3 ముక్కలాట.. అభ్యర్థి ఎవరో తేల్చేసిన కొడాలి నాని
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత!
- Credit card rules: క్రెడిట్ కార్డుదారులూ అలర్ట్!.. జులై 1 నుంచి కొత్త రూల్స్
- BJP: అంబర్‌పేట్‌లో భాజపా దళిత నాయకుడి ఇంట్లో భోజనం చేసిన యూపీ డిప్యూటీ సీఎం
- Maharashtra: ‘నాన్నే చెప్పేవారు.. మనకు చెందనిది ఎప్పటికీ మనతో ఉండదని..’: ఆదిత్య ఠాక్రే
- Raj Thackeray: అన్న రాజీనామా.. రాజ్ ఠాక్రే కీలక ట్వీట్