Published : 25 May 2022 16:57 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. తెలంగాణలో మూడు రోజులు వర్షాలు

తెలంగాణలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాగల 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు నైరుతి అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, మాల్దీవులు, కొమోరిన్‌ ప్రాంతం, దక్షిణ, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలపై మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది.

Health: అజీర్తితో బాధ పడుతున్నారా!

2. అమలాపురం ఆందోళనలో రౌడీషీటర్లు.. సంఘ విద్రోహశక్తులు: మంత్రి విశ్వరూప్

ఆందోళనకారులు తగులబెట్టిన తన ఇంటిని మంత్రి విశ్వరూప్‌ పరిశీలించారు. కోనసీమ ప్రాంతంలో గత 50 ఏళ్లలో ఏనాడూ ఇలాంటి ఘటనలు జరగలేదన్నారు. ‘‘మంగళవారం జరిగిన ఘటనలకు కోనసీమ సాధన సమితి బాధ్యత తీసుకోవాలి. శాంతియుతంగా జరుగుతున్న ఆందోళనలో కొన్ని సంఘ విద్రోహశక్తులు, కొంతమంది రౌడీషీటర్లు చేరి దశ, దిశ లేని ఉద్యమాన్ని పక్కదోవ పట్టించారు. నాతో పాటు, ఎమ్మెల్యే సతీశ్‌ ఇంటిని తగులబెట్టారు’’ అని చెప్పారు. 

3. ఆనాడే అంబేడ్కర్‌ పేరు పెట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు: పవన్‌ కల్యాణ్‌

కోనసీమ ప్రాంతానికి రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ పేరు పెట్టారని.. జిల్లాలకు కొత్త పేర్లు పెట్టేటప్పుడే అంబేడ్కర్‌ పేరు కూడా పెడితే బాగుండేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అభిప్రాయపడ్డారు. ఆనాడే అంబేడ్కర్‌ పేరు పెట్టి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టడంలో ప్రభుత్వం ఎందుకు జాప్యం చేసిందో అర్థం కావడం లేదని పేర్కొన్నారు.

4. కోనసీమ జిల్లా పేరుపై ప్రజాభిప్రాయం సేకరించండి: రఘురామ

ఎక్కువ మంది కోరుకున్న వ్యక్తే సీఎం అయినప్పుడు.. ఎక్కువ మంది కోరిక మేరకు కోనసీమ జిల్లా పేరుపై నిర్ణయం తీసుకోవాలని వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. కోనసీమ జిల్లా పేరుపై నిన్న అమలాపురంలో చోటు చేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాల పేర్ల మీద గతంలో వివాదాలు, చర్చలు జరిగినప్పుడు చాలా చోట్ల ప్రజాభిప్రాయం తీసుకున్నారని చెప్పారు. 

Housing Prices: దేశంలో పెరిగిన ఇళ్లు, ఫ్లాట్ల ధరలు

5. అమలాపురం ఘటనలో 46 మంది అరెస్ట్‌: హోంమంత్రి తానేటి వనిత

అమలాపురం ఘటన, అనంతర పరిస్థితులపై డీజీపీతో సమీక్షించినట్లు ఏపీ హోంమంత్రి తానేటి వనిత తెలిపారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఆందోళనలు జరగకుండా అమలాపురానికి అదనపు బలగాలను పంపామని.. అక్కడి పరిస్థితులు ప్రస్తుతం పూర్తిగా అదుపులోనే ఉన్నాయని చెప్పారు. గతంలో ఏడుకు పైగా కేసులున్న 72 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని.. వారిలో 46 మందిని అరెస్ట్‌ చేశామన్నారు.

మరో యుద్ధాన్ని తలపించేలా అమలాపురం ఘటన: సోము వీర్రాజు

6. రాజధానిలో ఎల్పీఎస్‌ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ కొనసాగుతోంది: సీఆర్డీఏ కమిషనర్‌

రాజధాని అమరావతి ప్రాంతంలోని ఎల్పీఎస్‌ (ల్యాండ్‌ పూలింగ్‌ స్కీమ్‌) లే అవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొనసాగుతోందని సీఆర్డీఏ కమిషనర్‌ వివేక్‌యాదవ్‌ తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులకు కట్టుబడి ఉన్నామని.. అందుకు అనుగుణంగానే పనులు చేపడుతున్నామని చెప్పారు. ఈ ఏడాది నవంబర్‌ నాటికి రాజధానిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిల భారత సర్వీసు అధికారుల నివాసాలు పూర్తవుతాయన్నారు. 

7. మారని మార్కెట్‌ స్థితి.. మూడోరోజూ నష్టాలే!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా మూడోరోజైన బుధవారమూ నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. అక్కడి నుంచి అమ్మకాల ఒత్తిడితో అంతకంతకూ దిగజారుతూ ఇంట్రాడే కనిష్ఠాలను తాకాయి. చక్కెర ఎగుమతులపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆ రంగంలో భారీ అమ్మకాలు జరిగాయి. మరోవైపు ఐటీ స్టాక్స్‌ సైతం భారీ నష్టాలను చవిచూశాయి.

8. మేరీ కోమ్‌తో ఫొటో.. వైరల్‌గా మారిన నిఖత్‌ జరీన్ పోస్టు

ఇటీవల జరిగిన ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ యువతి నిఖత్ జరీన్‌ తన సోషల్ మీడియాలో పెట్టిన ఫొటోతో మరోసారి వార్తల్లో నిలిచింది. ఇంతకీ ఆ ఫొటో ఏంటంటారా..? ఒలింపిక్స్ పతక విజేత మేరీ కోమ్‌తో కలిసి నిఖత్ జరీన్‌ ఉన్న పిక్‌ను ట్విటర్‌ పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. కేవలం గంటల వ్యవధిలోనే 13 వేలకుపైగా లైకులు, 595 రీట్వీట్లు వచ్చాయి.

9. ₹20లక్షలు దోపిడీ చేసి.. ‘ఐ లవ్‌ యూ’ అని రాసిపెట్టి పోయారు!

గోవాలో సినీ ఫక్కీలో జరిగిన ఓ దోపిడీ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఎవరూ లేని సమయంలో ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి చొరబడిన దుండగులు రూ.20లక్షల విలువ చేసే ఆభరణాలతో పాటు కొంత నగదును ఎత్తుకెళ్లారు. అంతేకాకుండా ఇంట్లో టీవీ స్క్రీన్‌పై ‘ఐ లవ్‌ యూ’ అని మార్కర్‌తో రాసి ఉండటాన్ని గమనించిన ఇంటి యజమాని ఒక్కసారిగా కంగుతిన్నారు. వెంటనే మార్గోవ్‌ పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది.

10. మంకీపాక్స్‌పై ఆ మందులు పనిచేస్తున్నాయా?

కొవిడ్‌తో ఇంతకాలం ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలను తాజాగా మంకీపాక్స్‌ (Monkeypox) కలవరానికి గురిచేస్తోంది. చాపకింద నీరులా వ్యాపిస్తున్న ఈ వ్యాధి క్రమంగా ఒక్కో దేశానికీ విస్తరిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. మరోవైపు కరోనాలా ఇది కూడా మరో మహమ్మారి కానుందా? అనే ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో ప్రముఖ మెడికల్‌ జర్నల్‌ లాన్సెట్‌ (Lancet)లో ప్రచురితమైన ఓ కథనం కొంత ఊరటనిస్తోంది. 

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని