Published : 26 May 2022 16:56 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. మీరు ఆపితే మహానాడు ఆగుతుందా?: చంద్రబాబు

ఎన్నికలు ఎప్పుడు జరిగినా జగన్‌ ఇంటికి పోవడం ఖాయమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ‘‘నిన్న ఓ మంత్రి మహానాడును తాము అడ్డుకోవడం లేదని చెప్పారు. మీరు ఆపితే మహానాడు ఆగుతుందా? ఒంగోలులో సభకు గ్రౌండ్‌ ఇవ్వరా? వైకాపాకు ఊడిగం చేసే అధికారుల భరతం పడతాం. తెదేపా ఫ్లెక్సీలు చించేస్తారా? నాకు కోపం వస్తే ఎవరినీ వదిలిపెట్టను. మర్యాదగా మీరుంటే నేనూ మర్యాదగా ఉంటా. పిచ్చివేషాలు వేస్తే తోక కత్తిరించి పంపుతాం’’ అని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌ నేతలు.. కళ్లు ఉన్న గుడ్డివాళ్లు : హరీశ్‌రావు

2. కుటుంబ పాలనలో తెలంగాణ బందీ: ప్రధాని మోదీ

పట్టుదలకు, పౌరుషానికి మారు పేరు తెలంగాణ ప్రజలు అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బేగంపేట విమానాశ్రయంలో భాజపా ఏర్పాటు చేసిన స్వాగత సభలో మోదీ మాట్లాడారు. కుటుంబ పాలనలో తెలంగాణ బందీ అయిందని, కుటుంబ పార్టీలను తరిమితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయన్నారు. రాష్ట్రంలో భాజపా హవా కనిపిస్తోందని, ఇక్కడ కూడా అధికారంలోకి వచ్చితీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. 

3. కరోనా వేళ భారత్‌ సామర్థ్యం ప్రపంచానికి తెలిసింది: మోదీ

ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) హైదరాబాద్‌ మరో మైలురాయిని అందుకుందని.. దేశానికే గర్వకారణంగా నిలిచిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఐఎస్‌బీ నుంచి ఇప్పటివరకు 50 వేల మంది బయటకు వెళ్లారని.. ఇక్కడి విద్యార్థులు ప్రముఖ కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు. ఇక్కడ చదివిన విద్యార్థులు అనేక స్టార్టప్‌లు రూపొందించారని తెలిపారు. ఐఎస్‌బీ విద్యార్థులు దేశానికి గర్వకారణంగా నిలిచారని కొనియాడారు.

4. బెంగళూరు చేరుకున్న సీఎం కేసీఆర్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌ బెంగళూరు చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి అక్కడి పద్మనాభ నగర్‌లో మాజీ ప్రధాని, జేడీఎస్‌ అధినేత దేవెగౌడ నివాసానికి కేసీఆర్‌ వెళ్లారు. దేవెగౌడతో పాటు ఆయన తనయుడు, మాజీ సీఎం కుమారస్వామితో సీఎం సమావేశమయ్యారు. ప్రస్తుత జాతీయ రాజకీయాలు, ఇతర సమకాలీన అంశాలతో పాటు రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా విపక్షాల ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే అంశం, ఇందులో ప్రాంతీయ పార్టీల పాత్రపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. 

భర్తపై క్రికెట్‌ బ్యాట్‌తో దాడి చేసిన భార్య..!

5. అంబేడ్కర్‌ను వ్యతిరేకించే వాళ్లను దేశం నుంచి బహిష్కరించాలి: కొడాలి నాని

ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌లు చదువుతూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చిన్నపిల్లలను రెచ్చగొట్టి పబ్బం గడుపుతున్నారని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. రాజ్యాంగంపై ఎలాంటి అవగాహన లేని వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ఇలాగే ఉంటుందని వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా గుడివాడలో ‘గడప గడపకూ ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సభలో కొడాలి నాని మాట్లాడారు.  డా.బీ.ఆర్‌. అంబేడ్కర్‌ను వ్యతిరేకించే వాళ్లను దేశం నుంచి బహిష్కరించాలని.. అలాంటి వాళ్లను జైల్లో పెట్టాలన్నారు.

6. సీఐడీ కేసు.. మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట

మాజీ మంత్రి పొంగూరు నారాయణకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి రింగ్‌ రోడ్డు భూ సమీకరణలో అక్రమాలు జరిగాయని ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో నారాయణతో పాటు లింగమనేని సోదరులు, రామకృష్ణ కన్‌స్ట్రక్షన్స్‌ హైకోర్టును ఆశ్రయించాయి. విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషనర్లపై తొందరపాటు చర్యలు వద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

7. బీఎండబ్ల్యూ విద్యుత్‌ కారు సెడాన్‌ ఐ4 వచ్చేసింది.. ధరెంతో తెలుసా?

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ తన పూర్తి స్థాయి ఎలక్ట్రిక్‌ కారు సెడాన్‌ ఐ4ని భారత్‌ మార్కెట్లోకి విడుదల చేసింది. దేశంలో ఎలక్ట్రిక్‌ మొబిలిటీ డ్రైవ్‌ను వేగవంతం చేసేందుకు రూ.69.9లక్షల ప్రారంభ ధరతో ఈ-కారును తీసుకొచ్చింది. సెడాన్‌ ఐ4 యూనిట్‌ పూర్తిస్థాయిలో నిర్మించి దిగుమతి చేయనుంది. ఐదో తరం బీఎండబ్ల్యూ ఈడ్రైవ్‌ టెక్నాలజీ కలిగిన ఈ వాహనం.. ఎలక్ట్రిక్‌ మోటార్‌, సింగిల్‌ స్పీడ్‌ ట్రాన్స్‌మిషన్‌, పవర్‌ ఎలక్ట్రానిక్స్‌ ఆధారిత ఇంటిగ్రేటెడ్‌ డ్రైవ్‌ యూనిట్‌ను కలిగి ఉంది. 

సిజేరియన్‌ తర్వాత పాటించాల్సిన జాగ్రత్తలపై వైద్యుల సూచనలివే..!

8. దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా వినయ్‌ కుమార్‌ సక్సేనా ప్రమాణ స్వీకారం

దిల్లీ నూతన లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా వినయ్‌ కుమార్‌ సక్సేనా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడి రాజ్ నివాస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో దిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి విపిన్ సంఘీ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేబినెట్‌ మంత్రులు, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఈ వేడుకలకు హాజరయ్యారు. 

9. జర్మనీ వెళ్లేవారికి ఊరట.. కొవాగ్జిన్‌ తీసుకున్న వారికి అనుమతి

భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కరోనా టీకా కొవాగ్జిన్‌కు జర్మనీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని భారత్‌లోని జర్మనీ రాయబారి వాల్టర్‌ జే లిండ్నర్‌ వెల్లడించారు. దీంతో కొవాగ్జిన్‌ టీకా తీసుకొని జర్మనీ వెళ్లాలనుకునే ప్రయాణికులకు మార్గం సుగమమయ్యింది. జూన్‌ 1 నుంచి ఇది అమలులోకి రానుంది.

10. పెంపుడు కుక్కతో వాకింగ్‌.. ఐఏఎస్‌ కోసం స్టేడియం ఖాళీ

పెంపుడు శునకంతో నిత్యం వాకింగ్‌కి వెళ్లే ఓ ఉన్నతోద్యోగి.. అందుకోసం స్టేడియం మొత్తం ఖాళీ చేయిస్తున్న ఘటన దేశ రాజధానిలో చోటుచేసుకొంది. ఈ నిర్ణయం క్రీడాకారులు, శిక్షణకులకు తీవ్ర ఆటంకం కలిగించడంతోపాటు తీవ్ర విమర్శలకు కారణమైంది. బాధ్యతగా మెలగాల్సిన ఓ ఐఏఎస్‌ అధికారి చేస్తోన్న నిర్వాకం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో స్పందించిన దిల్లీ ప్రభుత్వం.. రాత్రి పది గంటల వరకు స్టేడియం అందరికీ అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించింది.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని