Agnipath News: అగ్నిపథ్‌పై నిరసనలు.. ఇప్పటివరకు ఉన్న అప్‌డేట్స్‌ ఒక్క క్లిక్‌లో!

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీకోసం.. 

Updated : 17 Jun 2022 21:00 IST


1. అగ్నిపథ్‌ జ్వాలలు.. 4 బోగీలు పాక్షికంగా దగ్ధం ▶️

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ‘అగ్నిపథ్‌’ నిరసనలో 4 బోగీలు పాక్షికంగా దెబ్బతిన్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. అజంతాలో రెండు కోచ్‌లు.. ఈస్ట్ కోస్ట్, రాజ్ కోట్ రైళ్లలో ఒక్కో కోచ్ పాక్షికంగా దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు. నిరసనల నేపథ్యంలో ఇప్పటివరకు 72 రైళ్లు రద్దు చేయగా, పాక్షికంగా 12 రైళ్లు రద్దు చేశారు. మరో మూడు రైళ్లను దారి మళ్లించారు వీడియో కోసం క్లిక్‌ చేయండి


2. ఏడు రాష్ట్రాల్లో అగ్నిపథ్‌ ఆందోళనలు.. 

త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ పథకంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన జ్వాలలు రేగాయి. పలు రాష్ట్రాల్లో ఆందోళనకారులు రైళ్లకు నిప్పుపెట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మొత్తం 7 రాష్ట్రాలకు ఈ నిరసనలు పాకగా.. దాదాపు 200 రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి


3. రణరంగంగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌.. ఆందోళన కారులు ఏమంటున్నారు? ▶️

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ రణరంగంగా మారింది. కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకాన్ని నిరసిస్తూ వందల సంఖ్యలో యువకులు రైల్వేస్టేషన్‌ ఆవరణలో ఆందోళనకు దిగారు. వారిని అదుపు చేసేందుకు  పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. వీడియో కోసం క్లిక్‌ చేయండి


4. గత్యంతరం లేకే అగ్నిపథ్‌పై వివాదం : ఆర్మీ మాజీ చీఫ్‌ వీకే సింగ్‌

సాయుధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్‌ (Agnipath) పథకంపై ప్రజలను రెచ్చగొడుతూ ప్రతిపక్షాలు వివాదాన్ని సృష్టిస్తున్నాయని కేంద్రమంత్రి, ఆర్మీ మాజీ చీఫ్‌ జనరల్‌ వీకే సింగ్‌ (VK Singh) పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రతిపక్షాలకు గత్యంతరం లేని పరిస్థితుల్లోనే.. పథకం అమలు కాకముందే వివాదాన్ని రేపుతున్నాయని ఆరోపించారు. అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతోన్న నేపథ్యంలో ఆర్మీ మాజీ చీఫ్‌ ఈ విధంగా స్పందించారు.మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి


5. ‘అగ్నిపథ్‌’ ఆందోళనలు.. రైల్వే గోదాంకు నిప్పు పెట్టిన నిరసనకారులు ▶️

సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ పై ఆందోళనలు మిన్నంటుతున్నాయి. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఆందోళనకు దిగిన యువకుల్ని పోలీసులు చెదరగొట్టడంతో సమీపంలోని చిలకలగూడ రైల్వే గోదాంకు వారు నిప్పు పెట్టారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలికి చేరుకొని మంటలు అదుపు చేస్తున్నారు. వీడియో కోసం క్లిక్‌ చేయండి


‘అగ్నిపథ్‌’ నిరసనలు లైవ్‌ అప్‌డేట్స్‌👇🏽


6. ఎయిర్‌ఫోర్స్‌లో జూన్‌ 24 నుంచి ‘అగ్నిపథ్‌’ నియామకాలు..! 

సాయుధ దళాల్లో నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్నప్పటికీ.. కేంద్రం మాత్రం అగ్నివీరుల నియామకాల చర్యలు వేగవంతం చేసింది. అగ్నిపథ్‌ పథకం కింద నియామక ప్రక్రియను త్వరలోనే విడుదల చేస్తామని ఇప్పటికే ఆర్మీ చీఫ్‌ మనోజ్‌ పాండే వెల్లడించారు. తాజాగా వాయు సేనాధిపతి ఎయిర్‌ చీఫ్ మార్షల్‌ వీఆర్‌ చౌధరి కూడా దీనిపై స్పందించారు. జూన్‌ 24 నుంచి ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నివీరుల నియామక ప్రక్రియను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి


7. నిలిచిన మెట్రో సేవలు.. ప్రయాణికుల ఇక్కట్లు ▶️

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ‘అగ్నిపథ్‌’ నిరసనల నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో  రైళ్లను రద్దు చేశారు. మెట్రో మూడు లైన్లలోనూ సర్వీసులు నిలిపేసినట్లు మెట్రో అధికారులు ప్రకటించారు. దీంతో ప్రయాణికులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీడియో కోసం క్లిక్‌ చేయండి


8. మిత్రుల మాట మాత్రమే వినడం వల్ల.. ప్రజల నుంచి ఈ తిరస్కరణ: రాహుల్

సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’పై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వ్యక్తం అవుతున్నాయి. పలు రాష్ట్రాల్లో నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. ఈ క్రమంలో కేంద్రంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. గతంలో ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి


9. పోలీసులపై ఆందోళనకారుల రాళ్ల వర్షం ▶️

సికింద్రాబాద్‌లో ‘అగ్నిపథ్‌’ నిరసనలు కొనసాగుతున్నాయి. తమను అదుపు చేయడానికి వస్తున్న పోలీసులపై ఆందోళన కారులు రాళ్లదాడి చేశారు. దీంతో చేసేది లేక పోలీసులు పరుగులు పెట్టారు. కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ స్కీం వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేస్తున్నారు. వీడియో కోసం క్లిక్‌ చేయండి


10. ‘అగ్నిపథ్‌’ తప్పనిసరి కాదు.. ఎంతో ఆలోచించి తీసుకొచ్చాం

సుదీర్ఘ ఆలోచనలు, ఎన్నో చర్చల తర్వాత తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’(Agnipath) విషయంలో యువతను తప్పుదారి పట్టించే ప్రయత్నం మంచిది కాదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సూచించారు. సికింద్రాబాద్‌లో పథకం ప్రకారమే కుట్ర చేసి విధ్వంసం సృష్టించారన్నారు. ప్రజల్లో దేశభక్తి, జాతీయ భావన పెంచే ప్రయత్నంలో భాగంగానే ‘అగ్నిపథ్‌’ను తీసుకొచ్చామని స్పష్టం చేశారు. ఈ మేరకు దిల్లీలో మీడియాతో కిషన్‌ రెడ్డి మాట్లాడారు.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని