Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 12 Jun 2024 17:02 IST

1. చంద్రబాబు టీమ్‌ ఇదే.. కొత్త మంత్రుల వివరాలు ఇలా..

ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మంత్రిగా ప్రమాణం చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో అట్టహాసంగా ఈ వేడుక జరిగింది. వీరిద్దరితో పాటు మరో 23 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. పవన్‌.. రాజకీయాల్లో ఓ సైలెంట్‌ పవర్‌..!

‘కొన్నిసార్లు రావడం లేటు అవ్వొచ్చేమో గానీ, రావడం మాత్రం పక్కా’’ పవన్‌ కల్యాణ్‌ పలికిన సంభాషణే ఇది. ఆయన రాజకీయాల్లో త్వరగానే వచ్చారు. కానీ, ‘అధ్యక్షా’ అని పిలవడానికి పదేళ్లు ప్రజా క్షేత్రంలో ఓ యుద్ధమే చేశారు. ఆయన శక్తి, సామర్థ్యం ఏంటో ప్రత్యర్థులకు తెలుసు. అందుకే పేదలకు నీడలా నిలబడదామనుకున్న చెట్టులాంటి పవన్‌ను పడగొట్టాలనుకున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి 

3. ఎన్డీయే కూటమి ఏపీ కీర్తిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది: ప్రధాని మోదీ

తెదేపా, జనసేన, భాజపా కూటమి ఆంధ్రప్రదేశ్‌ కీర్తిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ‘‘ఏపీ నూతన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యా. సీఎంతో పాటు ప్రమాణం చేసిన మంత్రులందరికీ అభినందనలు. రాష్ట్ర యువత ఆకాంక్షలు నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని మోదీ ట్వీట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. తెలంగాణ టెట్‌ ఫలితాలు విడుదల.. దరఖాస్తులపై కీలక నిర్ణయం

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET) ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. మరోవైపు టెట్‌లో అర్హత సాధించని వారు వచ్చే టెట్‌కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. అర్హత సాధించిన వారు డీఎస్సీకి ఉచితంగా దరఖాస్తు చేసుకునే వీలు కల్పించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. ఆధార్‌- రేషన్‌ కార్డ్‌ అనుసంధానం గడువు 3 నెలలు పొడిగింపు

ఆధార్‌- రేషన్‌ కార్డ్‌ను లింక్‌ చేయని వారికి కేంద్రం మరో అవకాశం కల్పించింది. దీనికి సంబంధించిన గడువును పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. 2024 జూన్‌ 30తో గడువు ముగియనుండగా.. సెప్టెంబర్‌ 30 వరకు పెంచింది. రేషన్‌ కార్డులు దుర్వినియోగం అవుతున్న నేపథ్యంలో అవకతవకల్ని అడ్డుకొనేందుకు ఆధార్‌- రేషన్‌ కార్డ్‌ను లింక్‌ చేయాలని కేంద్రం గతంలో ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. నేను ఎటూ తేల్చుకోలేకపోతున్నా : రాహుల్‌ గాంధీ

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ.. తను పోటీచేసిన వయనాడ్‌ (కేరళ), రాయ్‌బరేలీ (యూపీ)లో మంచి మెజార్టీతో గెలిచారు. దీంతో ఆయన ఇప్పుడు ఒక నియోజకవర్గాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈవిషయంపై రాహుల్‌ బుధవారం స్పందించారు. తాను ఎటువైపు మొగ్గాలో తేల్చుకోలేకపోతున్నట్లు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. నా భర్త సీఎం అని.. టీవీలో వచ్చాకే తెలిసింది..!

రెండు దశాబ్దాల తర్వాత ఒడిశాకు కొత్త ముఖ్యమంత్రి వస్తున్నారు. ఆదివాసీ నేత మోహన్‌చరణ మాఝి (Mohan Charan Majhi).. సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. మోహన్‌ సతీమణి ప్రియాంక మాట్లాడుతూ.. కొత్త ముఖ్యమంత్రి ఎవరొస్తారా..? అని టీవీ చూస్తుండగా.. ఈ విషయం తెలిసిందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఇండియా VS మినీ ఇండియా.. ఎమోషనల్‌ గేమ్‌: భారత మాజీ క్రికెటర్

టీ20 వరల్డ్‌ కప్‌లో పాక్‌పై భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు యూఎస్‌ఏతో తలపడేందుకు టీమ్‌ఇండియా (IND vs USA) సిద్ధమైంది. ఇది కూడా ఒకరకంగా భావోద్వేగంతో కూడుకున్నదేనని మాజీ క్రికెటర్ లక్ష్మీపతి బాలాజీ వ్యాఖ్యానించాడు. యూఎస్‌ఏ - భారత్‌ మ్యాచ్‌ కాదు.. ఇండియా vs మినీ ఇండియాగా ఈ పోరును అభివర్ణించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రియాసీ దాడిలో ఉగ్రవాది ఇతడే.. స్కెచ్‌ విడుదల చేసిన పోలీసులు

జమ్మూకశ్మీర్‌లో రియాసీ వద్ద యాత్రికుల బస్సుపై జరిగిన ఉగ్రదాడి ఘటన దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకొన్నాయి. ప్రధాన నిందితుడి ఊహా చిత్రాలను పోలీసులు విడుదల చేశారు. నిందితుడి ఆచూకీ వెల్లడిస్తే రూ.20 లక్షలు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం.. భారతీయులు సహా 41 మంది మృతి

కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 41 మంది మరణించారు. మరో 50 మందికిపైగా తీవ్ర గాయాలపాలైనట్లు సమాచారం. వీరిలో ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు. కేరళ, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వారని తెలిసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని