Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 14 Jun 2024 16:59 IST

1. పవన్‌కు పంచాయతీరాజ్‌... అనితకు హోంశాఖ.. ఏపీలో మంత్రులకు కేటాయించిన శాఖలివే!

ఆంధ్రప్రదేశ్‌ మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాఖలు కేటాయించారు. ఈ మేరకు జాబితాను విడుదల చేశారు. పవన్‌ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలు కేటాయించారు. నారా లోకేశ్‌కు విద్య (హెచ్‌ఆర్‌డీ), ఐటీ, ఆర్టీజీ శాఖలు ఇవ్వగా, కింజరాపు అచ్చెన్నాయుడుకు వ్యవసాయ శాఖ అప్పగించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.. 

తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సరంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు జూన్‌ 5, 6 తేదీల్లో నిర్వహించిన ఐసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉన్నతాధికారులు ఈ ఫలితాలను విడుదల చేశారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. 24 లక్షల తెలుగు పాఠ్య పుస్తకాలు వెనక్కి.. ఇద్దరు అధికారులపై చర్యలు

తెలుగు పాఠ్యపుస్తకం ముందు మాటలో తప్పులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠ్యపుస్తకాల విభాగం డైరెక్టర్‌ శ్రీనివాసచారి, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ రాధారెడ్డిని ఆయా బాధ్యతల నుంచి తొలగించింది. తెలంగాణలో ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందజేసిన తెలుగు వాచకం పాఠ్య పుస్తకాలను వెనక్కి తీసుకోనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. తిహాడ్‌ జైలులో కవితతో కేటీఆర్‌ ములాఖత్‌

మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తిహాడ్‌ జైలులో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవితతో ఆమె సోదరుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ములాఖత్‌ అయ్యారు. అనంతరం హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు. దిల్లీ మద్యం కేసులో మనీ లాండరింగ్‌ నేరారోపణలతో కవిత అరెస్టయిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వయనాడ్‌ను వదులుకోనున్న రాహుల్‌.. ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ..?

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసిన రెండో చోట్ల గెలవడంతో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ.. వయనాడ్‌ స్థానాన్ని ఆయన వదులుకోనున్నట్లు ప్రచారం జోరందుకొంది. అంతేకాదు.. ఇక్కడి నుంచే ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా ఎన్నికల అరంగేట్రం చేస్తారనే ప్రచారం జరుగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. భాజపాపై ఆర్‌ఎస్‌ఎస్‌ గుర్రు.. భాగవత్‌తో భేటీ కానున్న యోగి..!

‘‘నిజమైన సేవకుడు అహంకారం కలిగిఉండడు. ఇతరులకు ఎలాంటి హాని కలిగించకుండా పని చేస్తాడు’’ అంటూ ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఈ తరుణంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, భాగవత్ల మధ్య భేటీ జరగనున్నట్లు వార్తలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఇకపై జమ్మూకశ్మీర్‌ పాఠశాలల్లో జాతీయ గీతం తప్పనిసరి

దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని పాఠశాలల్లో విద్యార్థులు ప్రార్థనా సమయంలో జాతీయ గీతాన్ని పాడుతారు. అయితే, జమ్మూకశ్మీర్‌లోని పాఠశాలల్లో జాతీయ గీతాన్ని కచ్చితంగా ఆలపించాలనే నియమం లేదు. ఇకపై కేంద్రపాలిత ప్రాంతంలోని అన్ని పాఠశాలల్లో ఉదయం ప్రార్థనా సమయంలో ఈ గీతాన్ని తప్పనిసరి చేయాలని జమ్మూ కశ్మీర్ పాఠశాల విద్యా శాఖ ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. డెలివరీ పార్ట్‌నర్స్‌కు సీపీఆర్‌లో శిక్షణ.. జొమాటోకు గిన్నిస్‌ రికార్డ్‌

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ కంపెనీ జొమాటో అరుదైన రికార్డ్‌ సొంతం చేసుకుంది. అత్యవసర సమయాల్లో ఉన్నవారికి వైద్య సాయం అందించేలా తమ డెలివరీ భాగస్వాములను తీర్చిదిద్దింది. ఒకే వేదికపై 4,300 మంది డెలివరీ పార్ట్‌నర్స్‌కు సీపీఆర్‌ శిక్షణ అందించి గిన్నిస్‌ రికార్డును కైవసం చేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కస్టడీలో దర్శన్‌కు పోలీసుల ‘రాచమర్యాదలు’?

అభిమాని హత్య కేసులో అరెస్టైన కన్నడ నటుడు దర్శన్‌కు కస్టడీలో రాచమర్యాదలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటిని కర్ణాటక ప్రభుత్వం ఖండించింది. కస్టడీలో ఉన్న దర్శన్‌కు ప్రత్యేక సదుపాయాలు కల్పించడం లేదని స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అసలు సెహ్వాగ్‌ ఎవరు? నేనెవరికీ సమాధానం చెప్పక్కర్లేదు: షకిబ్

నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌ తర్వాత నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బంగ్లాదేశ్‌ సీనియర్‌ ప్లేయర్ షకిబ్ అల్ హసన్ మాట్లాడాడు. ఈ సందర్భంగా భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌ చేసిన కామెంట్లను రిపోర్టర్లు అతడి దృష్టికి తీసుకొచ్చారు. దానికి స్పందిస్తూ ‘వీరేంద్ర సెహ్వాగ్‌ ఎవరు? నేనెందుకు సమాధానం ఇవ్వాలి’’ అని వ్యాఖ్యానించడం నెట్టింట వైరల్‌గా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని