Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 16 Jun 2024 17:04 IST

1. పాత మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారమే రాజధాని నిర్మాణం: మంత్రి నారాయణ

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా నారాయణ బాధ్యతలు చేపట్టారు. వెలగపూడిలోని సచివాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ‘‘త్వరలో రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభిస్తాం. 15 రోజుల్లో అధ్యయనం చేసి టౌమ్‌బౌండ్‌ నిర్ణయిస్తాం. పాత మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారమే రాజధాని నిర్మాణం చేస్తాం’’ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రుషికొండపై రహస్యంగా విలాస భవనాలు కట్టారు: గంటా

స్థానిక నాయకులతో కలిసి తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖలో రుషికొండ భవనాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇక్కడ రహస్యంగా విలాస భవనాలను కట్టారని, ముందు పర్యాటకం అన్నారు.. తర్వాత పరిపాలన భవనాలు అన్నారు.. అంటూ ఆక్షేపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం

 ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్‌ సీఎస్‌ శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. మంత్రి నారాయణ బాధ్యతల స్వీకరణ సందర్భంగా సంతకం కోసం ఆమె ఫైల్‌ తెచ్చారు. అయితే, సంతకం పెట్టేందుకు నిరాకరించిన మంత్రి.. ఆ దస్త్రాన్ని తిప్పి పంపారు. ఇప్పుడు సమయం కాదంటూ తిరస్కరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. సంక్షేమ శాఖల్లో 581 పోస్టులు.. పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది

తెలంగాణలోని గురుకులాల్లో పలు పోస్టుల భర్తీకి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళాశిశు సంక్షేమశాఖల పరిధిలోని వసతి గృహాల్లో 562 అధికారులు, పిల్లల సంరక్షణ గృహాల్లో 19 మహిళా సూపరింటెండెంట్‌ పోస్టులకు 2022 డిసెంబర్‌లో నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన పరీక్షలను జూన్‌ 24 నుంచి 29వరకు నిర్వహించాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. జూన్‌ 30లోగా గనులను వేలం వేయాలి.. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సూచన

తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం ఒక్క మినరల్‌ బ్లాక్‌ను కూడా వేలం వేయలేదని కేంద్ర గనుల శాఖ వెల్లడించింది. జూన్‌ 30 నాటికి కనీసం ఆరింటికి వేలం పూర్తి చేయాలని సూచించింది. ఇప్పటికే రాష్ట్ర సర్కార్‌కు 11 బ్లాకుల జియాలాజికల్‌ నివేదికలను పంపినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6.  రామోజీరావు జీవితం నుంచి చాలా నేర్చుకోవాలి: ఎం. నాగేశ్వరరావు

క్రమశిక్షణకు మారుపేరు రామోజీరావు అని ఈనాడు ఏపీ ఎడిటర్ ఎం. నాగేశ్వరరావు అభివర్ణించారు. రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు సంతాప కార్యక్రమం ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి నాగేశ్వరరావు, ఈనాడు తెలంగాణ సంపాదకుడు డీఎన్‌ ప్రసాద్, తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు హాజరయ్యారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. జమ్మూకశ్మీర్‌లో వరుస ఉగ్రదాడులు.. అమిత్‌ షా ఉన్నతస్థాయి సమావేశం

జమ్మూకశ్మీర్‌లో వరుసగా చోటుచేసుకొంటున్న ఉగ్ర ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. అక్కడి శాంతిభద్రతల పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అధ్యక్షతన ఆదివారం దిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఉగ్రవాదం అణచివేతను వేగవంతం చేయడానికి ఆయన మార్గదర్శకాలు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఏడాదిలో 11వ ఘటన

రాజస్థాన్‌లోని కోటా(Kota)లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. ఐఐటీ-జేఈఈకి సిద్ధమవుతున్న ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఏడాది ఇది 11వ మరణం కావడం ఆందోళన కలిగిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లతో వొడాఫోన్‌ ఐడియా కొత్త ప్లాన్‌

వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌ కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీని ధర రూ.248. ఇది సాధారణ సర్వీస్‌ వ్యాలిడిటీ ప్లాన్‌ కాదు. ఇది ఒక డేటా వోచర్‌. దీన్ని రీఛార్జ్‌ చేసుకోవాలంటే కచ్చితంగా యాక్టివ్‌ సర్వీస్‌ వ్యాలిడిటీ ప్లాన్‌ ఉండాల్సిందే. ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే ఓటీటీ ప్రయోజనాలు లభించడం విశేషం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. 84 ఏళ్ల తర్వాత బయటపడ్డ విమాన శకలాలు..!

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సోవియట్ యూనియన్ బాంబర్లు కూల్చివేసిన ఫిన్లాండ్‌కు చెందిన ఓ ప్రయాణికుల విమానం శకలాలు.. 84 ఏళ్ల తర్వాత బయటపడ్డాయి. అప్పట్లో జరిగిన ఆ విమాన ప్రమాదంలో అమెరికా దౌత్యవేత్త సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. బాల్టిక్ సముద్రంలోని ‘కెరీ’ అనే చిన్న ద్వీపం వద్ద.. 70 మీటర్ల లోతులో దీని శకలాలు లభ్యమయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని