Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 23 Jun 2024 17:00 IST

1. అమరావతికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు.. సీఆర్డీఏ సంప్రదింపులు షురూ!

ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. రాజధాని ప్రాంతంలో పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసేలా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 2014-19 మధ్య భూములు కేటాయించిన కేంద్ర సంస్థలతో సీఆర్డీఏ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. నెల రోజుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం: ఏపీ మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి

నెలలోగా మహిళలకు ఆర్టీసీ ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ఏపీ మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి తెలిపారు. సచివాలయం నాలుగో బ్లాక్‌లోని ఛాంబర్‌లో ఆయన రవాణా, క్రీడల శాఖ మంత్రిగా ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఆర్టీసీ సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇచ్చే ట్రైనింగ్‌ సెంటర్ల ఏర్పాటుపై తొలి సంతకం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రూ.30 వేల కోట్లతో రీజినల్ రింగ్‌రోడ్డు పూర్తి చేస్తాం: మంత్రి కోమటిరెడ్డి

ఎన్‌హెచ్‌ 65పై ప్రమాదాలు జరిగే బ్లాక్‌ స్పాట్లను గుర్తించామని, వాటిపై 17 బ్లాక్‌ స్పాట్ల వద్ద తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. చిట్యాల వద్ద రూ.40 కోట్లతో ఫ్లైఓవర్‌ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. రూ.30 వేల కోట్లతో రీజినల్‌ రింగ్‌ రోడ్డు పూర్తి చేస్తామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆ అవమానాలే చంద్రబాబులో కసిని పెంచాయి: వైకాపా మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి

ఎన్నికల్లో వైకాపా ఘోర ఓటమిపై గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి నిర్వేదం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలే దీనికి కారణమన్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఆయన ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. వీడియో కోసం క్లిక్‌ చేయండి 

5. ‘నీట్‌’ వ్యవహారంలో కీలక పరిణామం.. సీబీఐ రంగ ప్రవేశం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్‌ (NEET) ప్రశ్నపత్రం లీకేజీ అంశంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దీనిపై దర్యాప్తు చేయాలని కేంద్రం ఆదేశాల మేరకు సీబీఐ ఆదివారం కేసు నమోదు చేసింది. నీట్‌ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు వస్తోన్న ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారించనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అదానీ వేతనం రూ.9.26 కోట్లు.. సొంత ఉద్యోగుల కంటే తక్కువట!

ఆసియాలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైన గౌతమ్‌ అదానీ వార్షిక వేతనం ఎంత ఉంటుందనే విషయంపై అందరికీ ఆసక్తే. అయితే, ఆయన జీతం.. తన సహచర పారిశ్రామికవేత్తలతోపాటు సొంత కంపెనీల్లో పనిచేసే కీలక సిబ్బంది కంటే తక్కువట. ఏడాదికి రూ.9.26కోట్లు మాత్రమే జీతంగా తీసుకుంటారని వెల్లడైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. వరుసగా కుప్పకూలుతున్న వంతెనలు.. ఆందోళనలో ప్రజలు

బిహార్‌లో వరుసగా వంతెనలు కుప్పకూలుతున్నాయి. ఇప్పటికే రెండు బ్రిడ్జిలు పేకమేడలా కూలిపోగా.. తాజాగా తూర్పు చంపారన్‌ జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న మరో వంతెన కూలిపోయింది. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. వారం రోజుల వ్యవధిలో ఇది మూడో ఘటన కావడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పవన్‌ కల్యాణ్‌ ఫ్యామిలీ పిక్‌.. అరుదైన ఫొటో వైరల్‌

జనసేన పార్టీ సోషల్‌ మీడియా ఖాతాలో పోస్ట్‌ అయిన ఓ ఫొటో నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నటుడు, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఫ్యామిలీ పిక్‌ అది. తన శ్రీమతి అనా, పిల్లలు అకీరా నందన్‌, ఆద్యలతో కలిసి దిగిన ఆ అరుదైన స్టిల్‌ వైరల్‌ అవుతోంది. ఈ అందమైన చిత్రం ఆవిష్కృతమవడానికి కారణం ట్రాఫిక్‌ చిక్కులట. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మణిపుర్‌ వాసులకు అస్సాం మానవతా సాయం

అస్సాంలో తలదాచుకుంటున్న మణిపుర్‌ వాసులకు మానవతా సాయం అందించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మఆదేశించారు. మణిపుర్‌లోని జిరిబామ్‌(Jiribam) ప్రాంతంలో జరుగుతున్న ఘర్షణల నుంచి తప్పించుకొని 1700 మంది ప్రజలు అస్సాంలోని కాచర్‌(Cachar) జిల్లాలో ఆశ్రయం పొందుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అందవిహీన శునకాలకు పోటీలు.. విజేతగా నిలిచిన పికినీస్‌

ఇప్పటివరకూ మనం మనుషుల అందాల పోటీలు చూశాం. ఇంకొంచెం ముందుకు వెళితే జంతువుల అందాల పోటీలూ చూశాం. కానీ కాలిఫోర్నియాలో ‘వరల్డ్‌ అగ్లీయెస్ట్‌ డాగ్‌’ (అందవిహీన శునకం) పోటీలు నిర్వహిస్తున్నారు. గత 50 ఏళ్లుగా ఈ పోటీలు జరుగుతున్నాయి. తాజాగా జరిగిన ఈ పోటీలో ఎనిమిదేళ్ల శునకం విజేతగా నిలిచి యజమానికి కాసుల పంట పండించింది. వీడియో కోసం క్లిక్‌ చేయండి 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని