Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 10 Jul 2024 17:03 IST

1. తెలంగాణ డీజీపీగా జితేందర్‌ .. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

తెలంగాణ డీజీపీగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి జితేందర్‌ను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు డీజీపీగా ఉన్న రవి గుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఏపీ సీఎం చంద్రబాబుతో బీపీసీఎల్‌ ఛైర్మన్‌ భేటీ

ఏపీ సీఎం చంద్రబాబుతో భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌) ప్రతినిధులు భేటీ అయ్యారు. బీపీసీఎల్‌ ఛైర్మన్‌, ఎండీ కృష్ణకుమార్‌, సంస్థ ప్రతినిధులు ఆయన్ను కలిశారు. రాష్ట్రంలో పెట్రోల్‌ రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటుపై సీఎంతో చర్చించారు. సుమారు రూ.60 వేల కోట్లతో రిఫైనరీ ఏర్పాటు అంశంపై ప్రభుత్వం, బీపీసీఎల్ మధ్య సంప్రదింపులు జరిగినట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. సికింద్రాబాద్‌ ఎంపీ టికెట్ ఇస్తే గెలిచేవాడిని: వీహెచ్‌

గత ఎనిమిదేళ్లలో తనకు ఒక్క పదవీ లేదని.. రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు (వీహెచ్‌) కోరారు. లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ ఎంపీ టికెట్‌ తనకు ఇస్తే గెలిచేవాడినని వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌లో మీడియాతో వీహెచ్‌ మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. త్వరలోనే ఆలయాలకు కొత్త పాలకమండళ్లు: మంత్రి ఆనం

ఏపీలోని ఎనిమిది ప్రధాన దేవాలయాల్లో సౌకర్యాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇతర అంశాలపై సమీక్ష చేస్తున్నట్లు ఏపీ దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి తెలిపారు. విజయవాడ కనుకదర్గమ్మను దర్శించుకున్న అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. త్వరలోనే అన్ని ఆలయాలకు కొత్త పాలకమండళ్లు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. నటుడు రాజ్‌తరుణ్‌పై కేసు నమోదు

సినీ నటుడు రాజ్‌ తరుణ్‌ (Raj Tarun)పై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి ఫిర్యాదు మేరకు 420, 506, 493 సెక్షన్ల కింద రాజ్‌ తరుణ్‌పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మోదీ పర్యటన ఓ ‘గేమ్‌ ఛేంజర్‌’ - రష్యా

భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల మాస్కో పర్యటన, పుతిన్‌తో జరిగిన చర్చలు చరిత్రాత్మకమని రష్యా పేర్కొంది. ఈ పర్యటనను గేమ్‌ ఛేంజర్‌గా అభివర్ణించింది. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా రష్యా సైన్యంలో ఉన్న భారతీయులను వెనక్కి రప్పించడంతోపాటు పలు కీలకాంశాలపై పుతిన్‌-మోదీలు ప్రధానంగా దృష్టి సారించినట్లు భారత్‌లోని రష్యా రాయబార కార్యాలయం వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఈ ఏడాది నీట్‌ ఫలితాల్లో పెద్ద తేడా ఏం లేదు!: ఎన్‌టీఏ

ఈ ఏడాది విడుదలైన నీట్‌ యూజీ 2024 ఫలితాల్లో అసాధారణమైన వ్యత్యాసం ఏమీ లేదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) వెల్లడించింది. ఈమేరకు సుప్రీంకోర్టుకు తెలిపినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నీట్‌ పరీక్ష అక్రమాల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోన్న సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ప్రొబేషనరీ ఐఏఎస్‌ గొంతెమ్మ కోర్కెలు.. కన్నెర్ర చేసిన ప్రభుత్వం

అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు రావడంతో ఒక ప్రొబేషనరీ ఐఏఎస్‌ అధికారి బదిలీ అయ్యారు. ప్రత్యేక వసతులు అందించాలని ఆమె డిమాండ్‌ చేయడంతో వివాదాల్లో చిక్కుకున్నారు. దాంతో ఆమెపై మహారాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. 17 మందిని కాల్చి చంపిన హంతకుడు.. ‘బ్రెయిన్‌’ ఇచ్చేందుకు అంగీకారం!

ఎనిమిదేళ్ల క్రితం ఫ్లోరిడాలోని ఓ పాఠశాలలో చోటుచేసుకున్న భీకర కాల్పుల్లో విద్యార్థులు, సిబ్బంది సహా మొత్తం 17 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఆ కేసులో తాజాగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటనకు పాల్పడిన నిందితుడు తన మెదడును దానం చేసేందుకు అంగీకరించాడు. బాధితుల్లో ఒకరితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. పాక్‌ నేతల ఫోన్‌కాల్స్‌పై ఐఎస్‌ఐ నిఘా.. అక్కడి పార్లమెంట్‌లో చట్ట సవరణ

పాక్‌ రాజకీయాలపై సైన్యం మరింత ఉడుంపట్టు బిగించింది. సైన్యం అధీనంలోని నిఘా సంస్థ ఐఎస్‌ఐ ఇకనుంచి దేశీయంగా ఫోన్‌కాల్స్‌, మెసేజ్‌లను చూసేందుకు వీలుగా అక్కడి న్యాయశాఖ చట్ట సవరణలు చేసింది. దీంతో రాజకీయ నాయకుల వ్యక్తిగత కాల్స్‌ కూడా గోప్యంగా ఉండలేని పరిస్థితి తలెత్తింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని