Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 11 Jul 2024 17:09 IST

1. తయారీ రంగానికి ఏపీ వ్యూహాత్మక ప్రాంతం: సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో నైపుణ్య గణనపై ప్రధానంగా దృష్టి సారించామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గురువారం విశాఖలో నిర్వహించిన సీఐఐ నేషనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో సీఎం పాల్గొన్నారు. ‘‘ స్కిల్‌ గణన ద్వారా.. గ్లోబల్‌ ఉద్యోగ అవకాశాలు  పొందేలా చూస్తామని, తయారీ రంగానికి ఏపీ వ్యూహాత్మక ప్రాంతమని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. 2026 కల్లా భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తి చేస్తాం: సీఎం చంద్రబాబు

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం ఒక ఎకనామిక్‌ హబ్‌గా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విహంగ వీక్షణం ద్వారా భోగాపురం విమానాశ్రయం ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 2026 జూన్‌ నాటికి భోగాపురం విమానాశ్రయం తొలిదశ పూర్తి చేస్తామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అన్నదాతల అభిప్రాయాల మేరకే రైతు భరోసాపై నిర్ణయం: భట్టి విక్రమార్క

అన్నదాతల అభిప్రాయాల మేరకు ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గురువారం ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌లో రైతు భరోసా వర్క్‌షాప్‌ నిర్వహించారు. మంత్రివర్గ ఉపసంఘం ఆధ్వర్యంలో రైతుభరోసా పథకం విధివిధానాలపై అభిప్రాయ సేకరణ చేపట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మంత్రి నారా లోకేశ్‌ వాట్సప్‌ బ్లాక్‌.. వినతులు మెయిల్‌ ఐడీకి పంపాలని సూచన

ప్రజలు తమ సమస్యలను వాట్సప్‌ ద్వారా కాకుండా hello.lokesh@ap.gov.in మెయిల్‌కు పంపాలని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తమ సమస్యలపై వాట్సప్‌ మెసేజ్‌లు పంపుతుండడంతో మంత్రి వాట్సప్‌ను మాతృసంస్థ మెటా బ్లాక్ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పిడుగుపాట్లతో వణికిన యూపీ.. ఒక్కరోజే 38 మంది మృతి!

ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఈశాన్యంలోని అస్సాంతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో పిడుగుపాటు కారణంగా 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాలన్నీ ఒక్క రోజులోనే సంభవించడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. తుపాకీ గురిపెట్టి.. వంట చేయించుకున్న ఉగ్రవాదులు

జమ్మూ-కశ్మీర్‌లో సైనిక వాహనంపై ఉగ్రవాదులు మెరుపుదాడి(Kathua Attack)కి పాల్పడిన ఘటనలో ఐదుగురు జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. దీనికి ముందు ఉగ్రవాదులు స్థానికుల్ని బెదిరించినట్లు తెలుస్తోంది. వారి తలపై తుపాకీ గురిపెట్టి, తమ కోసం భోజనం తయారుచేయించుకున్నారని ఓ జాతీయ మీడియా కథనం వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రూ.65 కోట్ల ఫీజులు తిరిగి ఇచ్చేయండి.. ప్రైవేటు స్కూళ్లకు ఆదేశాలు

విద్యార్థుల నుంచి అక్రమంగా వసూలు చేసిన రూ.కోట్ల మేర ఫీజులను తిరిగి చెల్లించాలని పలు ప్రైవేటు పాఠశాలలకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2018-19 నుంచి 2024-25 మధ్యకాలంలో 10 పాఠశాలలు 81 వేలకుపైగా విద్యార్థుల వద్ద నుంచి రూ.64.58 కోట్లమేర ఫీజులను అక్రమంగా వసూలు చేసినట్లు తేలింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. రాజ్‌ తరుణ్‌ పర్సనల్‌ లైఫ్‌ నాకు తెలియదు: మాల్వీ మల్హోత్రా

‘తిరగబడర సామీ’ సినిమాలో రాజ్‌ తరుణ్‌ (Raj Tarun)తో కలిసి నటించానే తప్ప ఆయన వ్యక్తి జీవితం గురించి తెలుసుకోలేదని బాలీవుడ్‌ నటి మాల్వీ మల్హోత్రా (Malvi Malhotra) పేర్కొన్నారు. తమపై ఆరోపణలు చేసిన లావణ్య గురించి కూడా రాజ్‌ తరుణ్‌ గతంలో ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. దేశాధినేతలు, మాజీ ప్రధానులు, సీఈఓలు, రియాల్టీ స్టార్లు.. అంబానీల గెస్ట్ లిస్ట్ ఇదే..!

ముంబయిలోని బాంద్రా కుర్లా సెంటర్‌ (BKC)లోని జియో వరల్డ్ సెంటర్‌లో అనంత్-రాధికా మర్చంట్ వివాహం జరగనుంది. ఈ వేడుకకు పలు దేశాలకు చెందిన మాజీ ప్రధానులు, అమెరికన్ రియాలిటీ స్టార్లు కిమ్ కర్దాషియన్‌, ఖ్లో కర్దాషియన్‌, ఫిఫా అధ్యక్షుడు గియన్ని ఇన్‌ఫాంటినో వంటి ప్రముఖులు రానున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. భారత వ్యోమగాములతో భేటీకి ఎదురుచూస్తున్నా: ఆస్ట్రోనాట్‌ సునీతా విలియమ్స్‌

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించనున్న భారత వ్యోమగాములను కలిసేందుకు ఎదురుచూస్తున్నట్లు అమెరికా ఆస్ట్రోనాట్‌ సునీతా విలియమ్స్‌ పేర్కొన్నారు. ‘అమెరికా ఇండిపెండెన్స్‌ డే’ సందర్భంగా ఐఎస్‌ఎస్‌ నుంచి దిల్లీలోని ఆ దేశ రాయబార కార్యాలయానికి పంపిన సందేశంలో ఈ విషయం పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని