Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 04 Mar 2023 09:16 IST

1. ఇంటి వేటకు.. శంషాబాద్‌ వైపు

అంతర్జాతీయ విమానాశ్రయం.. ఏరో సిటీతోపాటు రాబోతున్న మరిన్ని టౌన్‌షిప్‌లు.. పేరున్న విద్యాసంస్థలు.. మెట్రో విస్తరణ.. కొనసాగుతున్న సైకిల్‌ ట్రాక్‌ పనులు.. ఓఆర్‌ఆర్‌ అనుసంధానం.. 40 నిమిషాల్లో ఐటీ కారిడార్‌కు చేరుకునే సౌలభ్యం.. బుద్వేల్‌లో హెచ్‌ఎండీఏ కొత్తగా వేయబోతున్న భారీ లేఅవుట్‌.. హిమాయత్‌సాగర్‌ జలాశయం అందాలు.. కొండలు, పచ్చదనం.. ఈసీ, మూసీ వాగు, కొత్వాల్‌గూడ ఎకో పార్క్‌.. వంటి హంగులతో హైదరాబాద్‌ సౌత్‌ శంషాబాద్‌ వైపు స్థిరాస్తి రంగం క్రమంగా విస్తరిస్తోంది. గచ్చిబౌలి ఐటీ కారిడార్‌ నుంచి ఒక వైపు కొల్లూరు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. నా భర్త మమ్మల్ని గెంటేశాడు.. బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్దీఖి భార్య ఆరోపణ

‘‘నా భర్త నన్ను, నా పిల్లల్ని ఇంటి నుంచి గెంటేశాడు’’ అంటూ ప్రముఖ బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్దీఖి (Nawazuddin Siddiqui) భార్య ఆలియా (జైనబ్‌) శుక్రవారం ఆరోపించారు. గుమ్మంలో కాపలాదారులను పెట్టి మరీ తమను లోనికి అనుమతించలేదంటూ ఆమె ఇన్‌స్టాగ్రాంలో వరుస వీడియోలను పోస్ట్‌ చేశారు. ఈ దంపతుల కుమారుడు (7), కుమార్తె (12) కూడా అందులో కనిపిస్తున్నారు. అధికారులు పిలిచారని తాను వెర్సోవా పోలీస్‌స్టేషనుకు వెళ్లొచ్చేలోపు ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కోటి మంది ఆధార్‌ను అప్‌డేట్‌ చేసుకోలేదు!

రాష్ట్రంలో కోటి మంది వరకు ఆధార్‌ కార్డుదారులు ఒక్కసారి కూడా తమ సమాచారాన్ని అప్‌డేట్‌ చేసుకోలేదని అధికారుల అంచనా. పదేళ్లకు ఒకసారి తమ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాలని విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) గత ఏడాది నవంబరులో సూచించింది. ఇందులో భాగంగా ఇంటి చిరునామా, వ్యక్తిగత గుర్తింపు ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా సమాచారాన్ని అప్‌డేట్‌ చేసుకోని వారిపై ఆధార్‌ అధికారులు దృష్టి సారించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నడకదారి భక్తులకు త్వరలో దివ్యదర్శన టోకెన్లు

తిరుమలకు అలిపిరి, శ్రీవారిమెట్టు నడక మార్గాల్లో వచ్చే భక్తులకు త్వరలో దివ్యదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక అన్నమయ్య భవనంలో తితిదే డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. నడక మార్గాల్లో తిరుమలకు వచ్చే భక్తుల్లో 60శాతం మంది వద్ద దర్శన టికెట్లు ఉండటం లేదని గుర్తించామన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నామని, అది పూర్తికాగానే టోకెన్ల జారీని ప్రారంభిస్తామని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఇంటర్‌ విద్యార్థులూ.. 14416కు ఫోన్‌ చేయండి

హైదరాబాద్‌లో ఇంటర్‌ విద్యార్థి సాత్విక్‌ ఆత్మహత్య నేపథ్యంలో పరీక్షల ఒత్తిడి, ఇతర మానసిక సమస్యలు ఉంటే మానసిక నిపుణులకు చెప్పుకొని పరిష్కరించుకునేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కొత్తగా టోల్‌ ఫ్రీ నంబరును అందుబాటులోకి తెచ్చింది. గతంలో కొందరు సైకాలజిస్టులను ఇంటర్‌బోర్డు నియమించేది. తాజాగా టెలీ మెంటల్‌ హెల్త్‌ అసిస్టెన్స్‌ అండర్‌ నెట్‌వర్కింగ్‌ అక్రాస్‌ ది స్టేట్స్‌(టెలీ-మానస్‌) పేరిట టోల్‌ ఫ్రీ నంబరు 14416ను తీసుకొచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. చస్తాను కానీ.. పారిపోను

‘అమ్మా.. ఆపదలో ఉన్నవాళ్లని హీరో ధైర్యంగా కాపాడతాడు కదా! ఆ పరిస్థితి వస్తే నేనేం చేయను?’ అని అడిగిందో అమ్మాయి. దానికి వాళ్లమ్మ ‘అలాంటిదేదైనా జరిగితే ముందు పారిపో’మన్న సలహానిచ్చింది. కోపగించుకున్న ఆ అమ్మాయి ‘నీలాగే అందరమ్మలూ ఆలోచిస్తే దేశం పరిస్థితేంటి? చస్తాను కానీ పారిపోను’ అని చెప్పింది. ఆ పరిస్థితి ఎదురైనప్పుడు నిజంగానే పోరాడింది. నీర్జా బానోత్‌.. ఇద్దరు అబ్బాయిల తర్వాత పుట్టింది. దీంతో ఇంట్లో గారాబం ఎక్కువే! ఈమెది చండీగఢ్‌. విద్యావంతురాలు పైగా అందాల భరిణ. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. భారత బ్యాటర్లతో పిచ్‌ ఆడుకుంది

ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో టీమ్‌ఇండియా బ్యాటర్ల మెదళ్లతో పిచ్‌ ఆడుకుందని దిగ్గజ ఆటగాడు సునీల్‌ గావస్కర్‌ అన్నాడు. ‘‘తమ ప్రతిభకు బ్యాటర్లు న్యాయం చేయలేదు. భారత పిచ్‌లను గమనిస్తే వికెట్‌ ఫలానా విధంగా స్పందిస్తుందన్న అంచనాతో షాట్లు ఆడటం ద్వారా మన బ్యాట్స్‌మెన్‌ ఔటవుతారు. నిజానికి టీమ్‌ఇండియా బ్యాటర్లలో ఆత్మవిశ్వాసం లేదు. తొలి రెండు టెస్టుల్లో రోహిత్‌శర్మ ఆకట్టుకున్నాడు. నాగ్‌పుర్‌లో అద్భుత సెంచరీ సాధించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అటకపైకి 3 లక్షల అర్జీలు

గ్రేటర్‌ పరిధిలో రెండు పడక గదుల ఇళ్ల దరఖాస్తుల్లో 50శాతం అటకెక్కినట్లే. దరఖాస్తుదారులు ఎవరు, ఎక్కడున్నారు, వారి ఫోన్‌ నంబరు ఏంటి, ఓటరు కార్డు ఏ నియోజకవర్గంలో ఉందనే వివరాలను అందించకపోవడంతో.. సుమారు 3లక్షల దరఖాస్తులను జీహెచ్‌ఎంసీ పక్కన పెట్టింది. వివరాలు అందించిన దరఖాస్తుదారుల జాబితాను సిద్ధం చేసింది. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి పరిశీలన పూర్తయిన దరఖాస్తుల వివరాలను అందించాలని కమిషనర్‌ డి.ఎస్‌.లోకేష్‌కుమార్‌ నిర్ణయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కుక్క కాటు.. ఎంజీఎంకు పరుగు!

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని అన్ని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో యాంటీ రేబిస్‌ కుక్కకాటు టీకాలు అందుబాటులో ఉన్నాయి. అయినా బాధితులు దూరభారం లెక్క చేయకుండా వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి వస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసిబ్బంది అందుబాటులో ఉండక ఇంతదూరం రావాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు. మరోవైపు వైద్యుడు పరీక్షించి సూచించకుండా టీకా ఇవ్వలేమని సిబ్బంది అంటున్నారు. పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలోనూ ఇదే పరిస్థితి. దీంతో 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండే ఎంజీఎంకు బాధితులు వస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ‘పేష్వాయీ గోల్డ్‌ పాన్‌’ రుచి చూడాలంటే.. రూ.లక్ష చెల్లించాల్సిందే!

మహారాష్ట్రలోని ఓ పాన్‌ షాప్‌లో దాదాపు 600 రకాల పాన్‌లను అమ్ముతున్నారు. గత ఎనిమిదేళ్లుగా నడుస్తున్న ఈ పాన్‌ షాప్‌ జనాలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో రూ.25 నుంచి రూ.లక్ష వరకూ ధర ఉన్న పాన్‌లను విక్రయిస్తున్నారు. నాసిక్‌ పమీపంలో ఉన్న ఆ దుకాణం పేరు మౌలి ఫ్యామిలీ పాన్‌హౌస్‌. దీన్ని గణేశ్‌ దుక్రే అనే యువకుడు ప్రారంభించాడు. డిగ్రీ పూర్తి చేసిన గణేశ్‌కు ఉద్యోగం దొరక్కపోవడంతో తానే సొంతంగా వ్యాపారం చేయాలని నిశ్చయించుకున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు