Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 06 Mar 2023 09:20 IST

1. టైప్‌-1 మధుమేహానికి కళ్లెం వేసే వినూత్న విధానం

టైప్‌-1 మధుమేహ బాధితులకు వరంగా మారగల సరికొత్త విధానాన్ని అమెరికాలోని మసాచుసెట్స్‌ జనరల్‌ ఆసుపత్రి (ఎంజీహెచ్‌) పరిశోధకుల నేతృత్వంలోని బృందం తాజాగా అభివృద్ధి చేసింది. ఈ రకం మధుమేహుల్లో- ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే బీటా కణాలపై సొంత రోగనిరోధక వ్యవస్థ దాడి చేస్తుంటుంది. బీటా కణాల మార్పిడి ద్వారా వారికి సాంత్వన చేకూర్చవచ్చని పరిశోధకులు తేల్చారు. అయితే అందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న విధానాలు ప్రభావవంతంగా పనిచేయడం లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఊరూరా దాహం కేకలే

వేసవి ప్రారంభంలోనే జిల్లాలోని ప్రతి ఊరిలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. వేసవిలో నీటి కష్టాలు ఎదురవకుండా ఏటా ప్రత్యేక నిధులు విడుదలవుతూనే ఉన్నాయి. వీటితో సీజన్‌లో మొక్కుబడిగా మరమ్మతులు చేపట్టి ఆ తర్వాత ఆ పథకం ముఖం చూసేందుకు సైతం గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇష్టపడడం లేదు. దీని ఫలితంగా నీటి పథకాలు మూన్నాళ్ల ముచ్చటగా మారిపోయాయి. సమగ్ర కార్యాచరణతో తాగునీటి పథకాలు వినియోగంలోకి తీసుకొచ్చి ఉంటే ఇబ్బందులు కొంత వరకైనా పరిష్కారమయ్యేవి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. చదివేదెలా... ఫీజులు కట్టేదెలా?

స్టడీహాల్‌, హాస్టల్‌ ఫీజులు పోటీ పరీక్షల అభ్యర్థులకు భారంగా మారుతున్నాయి.. నియంత్రించే యంత్రాంగం లేకపోవడంతో ఇష్టారీతిన రుసుములు పెంచేస్తున్నారు. దీంతో వ్యయ ప్రయాసలు కోర్చి నగరానికి వస్తున్న అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. లైబ్రరీల్లో చదివేందుకు వెళ్తే రద్దీ ఎక్కువగా ఉండటం, ఆరు బయట చదివేందుకు చెట్ల నీడను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో స్టడీహాల్‌కు నెలకు రూ.800 నుంచి రూ.1000కు ఫీజు వసూలు చేయగా ప్రస్తుతం దానిని రూ.2,000 పెంచడంతో ఆర్థిక భారం పడుతోందని చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కుక్కలున్నాయ్‌.. పిక్కలు జాగ్రత్త!

వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. వాటి నియంత్రణపై పట్టణ స్థానిక సంస్థలు చేతులెత్తేస్తున్నాయి. కుక్కల్లో సంతానోత్పత్తిని నిరోధించే శస్త్ర చికిత్సలు చాలాచోట్ల నిలిచిపోయాయి. సమస్యాత్మకమైన శునకాలను గుర్తించి ప్రత్యేక సంరక్షణ శిబిరాలకు తరలించడం వంటి విషయాలను పుర, నగరపాలక సంస్థలు పక్కన పెట్టేశాయి. కుక్కల దాడిలో పిల్లలు మరణించడం, తీవ్రంగా గాయపడడం వంటి విషాద ఘటనలు జరిగినపుడే అధికారులు హడావుడి చేస్తుంటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ప్రకృతి ప్రకోపం.. నష్టం అపారం

ప్రకృతి వైపరీత్యాలతో దేశానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కరవు, కొండ చరియలు విరిగిపడటం తదితర విపత్తుల వల్ల భారీగా ఆస్తి, ప్రాణనష్టం సంభవిస్తోంది. గత 22 ఏళ్లలో రూ.12 లక్షల కోట్ల ఆస్తినష్టం వాటిల్లగా.. 86 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కాలంలో నగరాలను వరదలు ముంచెత్తడం సమస్యగా మారింది. వరద తీవ్రతను ముందుగానే అంచనా వేస్తూ., హెచ్చరికలు జారీ చేస్తూ, ముంపునకు గురయ్యే ప్రాంతాల నుంచి ముందుగా ప్రజలను ఖాళీ చేయిస్తూ.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మా నాన్న నన్ను లైంగికంగా వేధించాడు.. ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు

 సినీ నటి, జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు ఖుష్బూ (Kushboo) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడు తండ్రి తనని లైంగికంగా వేధింపులకు గురి చేశాడని ఆరోపించారు. తనను గాయపరిచి, చిత్రహింసలకు గురిచేసేవాడని చెప్పారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని  ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక అబ్బాయి లేదా అమ్మాయి చిన్నతనంలో వేధింపులకు గురైతే.. అది వాళ్లను జీవితాంతం భయానికి గురి చేస్తుంది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఆ హానికారక ఇంజెక్షనేంటి?.. రక్త పరీక్షల్లోనూ రాని స్పష్టత

వైద్య విద్యార్థిని ప్రీతి మృతి చెందడానికి కారణమైన హానికారక ఇంజెక్షన్‌ ఏంటనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆమె మరణించి వారం రోజులు గడిచినా ఈ విషయంపై స్పష్టత రాలేదు. హైదరాబాద్‌ నిమ్స్‌ వైద్యుల తాజా నివేదికల్లో సైతం దీనికి సంబంధించి స్పష్టత కొరవడింది. వరంగల్‌ కాకతీయ వైద్య కళాశాలలో అనస్థీషియా మొదటి సంవత్సరం చదువుతున్న ప్రీతి గత నెల 22న బలవన్మరణానికి యత్నించిన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఆకట్టుకుంటున్న మినీయేచర్‌ రైలు మ్యూజియం

ఆ మినీయేచర్‌ నగరంలో స్టీమ్‌ ఇంజిన్‌ నుంచి బుల్లెట్‌ రైళ్లదాకా అన్ని రకాల రైళ్లూ అటూఇటూ తిరుగుతూ చూపరులను ఆకట్టుకుంటున్నాయి. సిగ్నళ్లు లేని రోడ్లపై వాహనాలు దూసుకెళ్తున్నాయి. అన్ని రకాల వినోదాలకు ఇక్కడ కొదవ లేదు. ఈ మినీయేచర్‌ నగరం ఏ ఐరోపా దేశంలోనిదో కాదు.. ఉన్నది మన మహారాష్ట్రలోని పుణెలో. నీళ్లలో పరుగులు పెట్టే పడవలు, స్టీమర్లు... అందమైన కొండల అంచున రోప్‌వేలు.. వినోదాలు పంచే హాట్‌ ఎయిర్‌ బెలూన్‌, రోలర్‌ కోస్టర్‌, జెయింట్‌ వీల్‌ రైడ్లు మనసును దోచేస్తాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. త్రిపుర పీఠంపై వీడని ఉత్కంఠ

త్రిపురలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేది ఎవరన్న అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ విషయంలో స్థానిక పార్టీలో విభేదాలు తలెత్తకుండా, ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన భాజపా కీలక నేత హిమంత బిశ్వ శర్మ ఇప్పటికే అక్కడికి చేరుకొని మంతనాలు సాగిస్తున్నారు. 60 స్థానాలున్న త్రిపుర అసెంబ్లీలో భాజపా 32 సీట్లు కైవసం చేసుకొని ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాల్లో ఉంది. ముఖ్యమంత్రి అభ్యర్థికి సంబంధించి మాణిక్‌ సాహా పట్ల ఒక వర్గం సానుకూలత వ్యక్తం చేస్తుండగా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. 5జీ పేరుతో వల

ప్పుడిప్పుడే విస్తరిస్తున్న 5జీ నెట్‌వర్క్‌ పేరుతో కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. వేగవంతమైన అంతర్జాలాన్ని ఉపయోగించుకోవాలన్న వినియోగదారుల ఉత్సుకతను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈ తరహా మోసాలు గత రెండు నెలల నుంచి వెలుగుచూస్తున్నాయి. ఇదే అదునుగా భావించి సరికొత్త పంథాలో బురిడీ కొట్టిస్తున్నారు. ఈ నెపంతో రకరకాల పద్ధతుల్లో అందినంత దోచుకుంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని